పథకాల మహిళా లబ్దిదారులకు సీఎం జగన్ కీలక సూచన..!!

ఎన్నికల షెడ్యూల్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ప్రధాన పార్టీలు కొత్త వ్యూహాలతో ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. ఇప్పటికే అభ్యర్దుల ఎంపిక పైన దాదాపు స్పష్టత ఇచ్చాయి. ఇదే సమయంలో సీఎం జగన్ ఈ నెల 16న ఇడుపులపాయలో తన పార్టీ అభ్యర్దుల జాబితా ప్రకటించనున్నారు. ఈ నెల 18 నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. తాను 58 నెలల కాలంగా అమలు చేసిన సంక్షేమం - సామాజిక తనను గెలిపిస్తాయనే నమ్మకంతో ఉన్న జగన్ కీలక ప్రకటన చేసారు.

సంక్షేమం కొనసాగిస్తాం
ముఖ్యమంత్రి జగన్ కర్నూలు జిల్లాలో పర్యటించారు. వైయ‌స్ఆర్ ఈబీసీ పేద మహిళలకు ఎంతో మేలు జరిగింద‌ని తెలిపారు. పేదల భవిష్యత్తుపై యుద్ధానికి చంద్రబాబు కూటమి మరోసారి సిద్ధమైందని.. ఈ ఎన్నికల్లో ఓటు అనే దివ్యాస్త్రాన్ని వాళ్ల మీద జాగ్రత్తగా ప్రయోగించాలని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు పిలుపు ఇచ్చారు.వైయ‌స్ఆర్ ఈబీసీ అనేది.. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన కార్యక్రమం కాదు..పేదరికం వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదనే మన ప్రభుత్వం ఈ పథకం తీసుకొచ్చింద‌ని చెప్పారు.

CM Jagan Releases EBC Nestham funds and key appeal for Beneficiaries at Kurnool

మహిళలకు లబ్ది చేకూరేలా
ఈ పథకంతో 4560 సంవత్సరాల వయసులో ఉన్న నా అక్కచెల్లెమ్మలందరికీ రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, క్షత్రియ, వెలమ, బ్రాహ్మణ.. తదితర ఓసీల్లో ఉన్న అక్కచెల్లెమ్మలకు కూడా ఆర్థిక స్వావలంబన కలిగిస్తూ ఏటా రూ.15,000 చొప్పున సహాయం అందిస్తున్నట్లు వివరించారు. 4,19,528 మంది నా అక్కచెల్లెమ్మలకు 629 కోట్లు వారి ఖాతాల్లోకి నేరుగా జమ చేయనున్నాం.

ఈరోజు జమ చేస్తున్న ఈ సొమ్ముతో కలుపుకొంటే మూడు దఫాల్లో 4,95,269 మంది అక్కచెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ రూ.1877 కోట్లు వైయ‌స్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా మంచి అందించామని చెప్పుకొచ్చారు. వైయ‌స్ఆర్ కాపు నేస్తం ద్వారా 4,64,000 మందికి మంచి జరిగిస్తూ అడుగులు పడ్డాయి. వైయ‌స్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా 4,95,000 మందికి మంచి జరిగించామని చెప్పారు.

CM Jagan Releases EBC Nestham funds and key appeal for Beneficiaries at Kurnool

లబ్దిదారులకు సీఎం సూచన
మొత్తంగా 4560 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న అక్కచెల్లెమ్మలు 44,74,000 మందికి మంచి జరిగిస్తూ ఈ 58 నెలల కాలంలో అడుగులు పడ్డాయన్నారు. ఈ 58 నెలల కాలంలోనే ఎప్పుడూ జరగని, చూడని విధంగా ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్లిపోవడం.. ఎప్పుడూ జరగని విధంగా అడుగులు పడిన పరిస్థితులు ఇప్పుడే కనిపిస్తున్నాయన్నారు.

ఇందులో రూ1.89 లక్షల కోట్లు మహిళల ఖాతాల్లో జమ చేసామని చెప్పారు. ఈ రోజు మూడు పార్టీలుగా కూటమిగా ఏర్పడి పేదవాడి భవిష్యత్ మీద యుద్ధానికి వస్తున్నారని జగన్ వివరించారు. ఈబీసీ నేస్తం డబ్బులొచ్చే కార్యక్రమం ఒక వారం అటో ఇటో జరుగుతుంది. ఏ ఒక్కరూ భయపడాల్సిన పని లేదు. కచ్చితంగా ప్రతి ఒక్కరికీ డబ్బులు చేరుతాయని జగన్ వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+