కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎం జగన్ సెల్ఫీ వైరల్ - లోకేశ్ రియాక్షన్ : వరద బాధితుల పరామర్శలో పరిహాసమా..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ముఖ్యమంత్రి జగన్ తో సెల్ఫీ తీసుకోవటం కోసం అనేక మంది పోటీ పడతారు. పాదయాత్ర నుంచి సీఎం అయిన తరువాత కూడా సీఎంతో పలువురు సెల్ఫీల కోసం ప్రయత్నించటం సాధారణంగా జరిగేది. కానీ, స్వయంగా ముఖ్యమంత్రే సెల్ఫీ తీస్తే..అదే ఇప్పుడు జరిగింది. అందుకే ఆ సెల్ఫీ ఇప్పుడు వైరల్ అయింది. ముఖ్యమంత్రి జగన్ వదర ప్రభావిత జిల్లాల్లో పర్యటనకు వెళ్లారు. గన్నవరం నుంచి కడపకు విమానం లో వెళ్లిన సీఎం జగన్..అక్కడి నుంచి హెలికాఫ్టర్ లో రాజంపేట బయల్దేరారు.

ముఖ్యమంత్రి స్వయంగా సెల్ఫీ తీస్తే...


ఆ సమయంలో హెలికాప్టర్ లోనే సీఎం జగన్ తనతో పాటుగా ఎంపీ మిధున్ రెడ్డి.. మంత్రి ఆదిమూలపు సురేష్.. తన కార్యదర్శి ధనుంజయ రెడ్డితో పాటుగా సెల్ఫీ తీసారు. సీఎం స్వయంగా సెల్ఫీ తీయటంతో ఆ ఫొటోను మంత్రి సురేష్ అపురూపంగా భావించారు. తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసారు. సీఎం సెల్ఫీ తీయటం స్పెషల్ గా భావించటంతో ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక, ఇప్పుడు దీని పైన రాజకీయంగా విమర్శలు మొదలయ్యాయి. ఇదే అంశం పైన టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు.

వరద బాధితుల పరామర్శ సమయంలో

సీఎం జగన్ సెల్ఫీ దిగటం.. బాధితులతో నవ్వుతూ ఫొటోలు దిగటం పై అభ్యంతరం వ్యక్తం చేసారు. సీఎం జగన్ వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లింది ఎందుకంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఓ ఫోటోను షేర్ చేశారు. 'ముఖ్యమంత్రి గారూ... మీరు వెళ్లింది మీ ఇసుక మాఫియాల కోసం జలసమాధి అయిపోయిన 60 మంది కుటుంబసభ్యులను పరామర్శించడానికి. మీ వంధిమాగదులతో సెల్ఫీలు తీసుకోవడానికి కాదు..అంటూ కామెంట్ పెట్టారు.

లోకేశ్ అభ్యంతరం..విమర్శలు


దీనికి కొనసాగింపుగా.. 'మీరు వెళ్లింది.. మీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో వ‌చ్చిన విప‌త్తు వ‌ల్ల జ‌రిగిన వేల‌కోట్ల న‌ష్టం ప‌రిశీలించ‌డానికి. ప్రజల్ని దూరం పెట్టి ప‌ళ్లు ఇకిలిస్తూ ఫోటోలు దిగ‌డానికి కాదు. జ‌నం బాధ‌లు మీకు అంత పైశాచిక‌ ఆనందం క‌లిగిస్తున్నాయా?' అంటూ లోకేష్ సూటిగా ప్రశ్నించారు. అందులో ముఖ్యమంత్రి జగన్ వరద బాధితులను కడప జిల్లా రాజంపేట మండలం లో పరామర్శించారు. వారికి అభయం ఇచ్చారు. ఇళ్లు కోల్పోయిన వారికి తిరిగి కట్టిస్తామని హామీ ఇచ్చారు.

బాధితులకు సీఎం భరోసా


వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల్లో ఒకరికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని చెప్పారు. కడప జిల్లాలో కొట్టుకుపోయిన అన్నమయ్య డామ్ ను పరిశీలించారు. డామ్ ను రీ డిజైన్ చేస్తామని ప్రకటించారు. ఆ తరువాత చిత్తూరు జిల్లా రేణిగుంటలో సీఎం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ రోజున తిరుపతి నగరంతో పాటుగా నెల్లూరు జిల్లాలో సీఎం వరద బాదితులను పరామర్శించనున్నారు. నెల్లూరు జిల్లాలో వరద నష్టం పైన అధికారులతో సమీక్ష ఏర్పాటు చేసారు.

English summary
CM Jagan who was on a visit to the flood affected districts took a selfie in the chopper along with Mithun Reddy and Adimulapu Suresh that has gone viral
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X