జగన్ మరో సంచలనం : ఏకంగా అయిదుగురు డిప్యూటీ సీఎంలు: ఆ వర్గాలకే కేటాయింపు..వీరికేనా..!
ఏపీ ముఖ్యమంత్రి మరో సంచలన ప్రకటన చేసారు. ఏకంగా తన కేబినెట్‌లో అయిదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉంటారని ప్రకటించారు. అయిదుగురు ఉప ముఖ్యమంత్రులను ఎస్సీ-ఎస్టీ-బీసీ-మైనార్టీ-కాపులకు అవకాశం ఇవ్వాల ని నిర్ణయించారు. మొత్తం 25 మందితో ఏకంగా ఒకేసారి కేబినెట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రాంతాలు.. వర్గాల వారీగా ఈ ఉప ముఖ్యమంత్రులుగా అవకాశం ఇవ్వనున్నారు. ఇందులో ఒకరికి మహిళకు ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా సమాచారం.
అయిదుగురు డిప్యూటీలు..
జగన్ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అయిదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉంటారని జగన్ ప్రకటించారు. ఎన్నికల వేళ టిక్కెట్లు ఇచ్చారో..అదే ఫార్ములా అనుసరిస్తున్నారు. ఎస్సీ-ఎస్టీ-బీసీ-మైనార్టీ-కాపు వర్గాలకు అవకాశం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇందులో ప్రాంతీయ సమతుల్యత పాటించనున్నారు. ఇక, ఈ వర్గాల్లో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఇప్పడు అంచనాలు మొదలయ్యాయి. ఎస్టీ వర్గం నుండి విజయనగరం జిల్లాకు చెందిన మహిళకు అవకాశం దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక, ఎస్సీ వర్గానికి చెందిన ప్రకాశం జిల్లాకు చెందిన జగన్ విధేయుడికి అవకాశం దక్కనుంది. అదే విధంగా కాపు వర్గం నుండి పశ్చిమ గోదావరి జిల్లాలో తొలి నుండి జగన్‌తోటే ఉన్న నేతకు ఛాన్స్ దక్కనుంది. బీసీ వర్గం నుండి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ కు ఇవ్వనున్నట్లు సమాచారం. మైనార్టీ వర్గానికి మాజీ పోలీసు అధికారి ఇక్బాల్‌కు డిప్యూటీగా అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం.

50 శాతం పదువులు వారికే..
తన కేబినెట్‌లో 50 శాతం అవకాశం బీసీ-ఎస్టీ-ఎస్సీలకే అవకాశం ఇవ్వనున్నట్లు జగన్ ప్రకటించారు. అదే విధంగా పాలనలోనూ ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. 50 శాతం నామినేషన్ పనులు వారికే అప్పగిస్తామన్నారు. ఇక, గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో కాపు-బీసీ వర్గాలకు రెండు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు. ఈ సారి అధికారంలోకి వస్తే మైనార్టీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని ప్రకటించారు. అయితే, జగన్ ఆ మూడు వర్గాల తో పాటుగా ఎస్సీ-ఎస్టీ వర్గాలకు ఉప ముఖ్యమంత్రులుగా అవకాశం ఇవ్వాలని..అందులో ఒక మహిళకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications