పార్టీ పరువు తీస్తున్నారు - సీఎం జగన్ సీరియస్ : ఆ మంత్రి-ఎమ్మెల్యేలకు ఏమైంది..!!

వైసీపీ కి తొలి నుంచి అండగా నిలుస్తున్న జిల్లా నెల్లూరు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉప ఎన్నికలోనూ..2014 లో 8 సీట్లు..2019 లో క్లీన్ స్వీప్ చేసి వైసీపీకి పట్టం కట్టిన జిల్లా. ఇటువంటి జిల్లాలో అధికార వైసీపీ నేతల మధ్య పంచాయితీలు తీవ్ర స్థాయికి చేరాయి. తాజాగా ఏకంగా అధికార పార్టీ ఎంపీ పైన క్రిమినల్ కేసు నమోదు చేయటం..దీని వెనుక అధికార పార్టీ నేతల ప్రమేయం ఉందంటూ ప్రతిపక్షాలు అవకాశం గా తీసుకోవటం వైసీపీ ముఖ్యనేతలు సీరియస్ గా తీసుకున్నారు. ముఖ్యమంత్రి సైతం నెల్లూరు జిల్లా నేతల పంచాయితీలు-వ్యవహారాల పైన సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది.

 నెల్లూరు నేతలకు ఏమైంది..

నెల్లూరు నేతలకు ఏమైంది..

తాజాగా, ఏకంగా సొంత పార్టీ ఎంపీ పైనే క్రిమినల్ కేసు నమోదు చేయటం వెనుక కారణాల పైన ఆయన ఆరా తీసినట్లు సమాచారం. ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిపై నెల్లూరు జిల్లా వెంకటాచలం పోలీసు స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు నమోదైంది. జూన్‌ 21న ఇరిగేషన్‌ అధికారుల ఫిర్యాదుతో నమోదైన కేసులో ఎంపీని ఏ2 నిందితుడిగా పేర్కొన్న విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. సర్వేపల్లి రిజర్వాయర్‌లో అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు జరిపారన్న అభియోగాలతో మాగుంటపై కేసు నమోదు చేశారు. అధికార పార్టీ ఎంపీపై కేసు నమోదు కావడంతో అధికార పార్టీ ఇరుకు పడినట్లు కనిపిస్తోంది.

 అవకాశంగా మలచుకొనే పనిలో టీడీపీ..

అవకాశంగా మలచుకొనే పనిలో టీడీపీ..

అయితే, ఇక్కడ ప్రతిపక్ష నేత సోమిరెడ్డి ఇదంతా కాకాని గోవర్ణన్ రెడ్డి చేసిన వ్యవహారంగా ఆరోపిస్తున్నారు. దీనికి గోవర్ధన్ రెడ్డి సైతం కౌంటర్ ఇచ్చారు. అనుమతులకు మించి తవ్వకాలు జరిపిన నేపథ్యంలో నిబంధనల ప్రకారం అనుమతులు పొందిన ముగ్గురిపై ఇరిగేషన్‌ డీఈ, జేఈ వెంకటాచలం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఏ1గా తూపిలి ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఏ2గా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఏ3గా బి.శ్రీధర్‌రెడ్డిని చేరుస్తూ 427ఐపీసీ, 21(4) ఎంఎండీఏఆర్‌ఏ సెక్షన్ల కింద జూన్‌ 21న కేసు నమోదు చేశారు. అయితే ఆ తర్వాత ఈ కేసును పక్కన పెట్టారు. కాగా, సర్వేపల్లి రిజర్వాయర్‌లో తవ్వకాలకు సంబంధించి అనుమతులు, కేసు నమోదు వంటి వివరాలను ఇటీవల టీడీపీ నేతలు ఆర్టీఐ చట్టం ద్వారా సేకరించారు. ఈ క్రమంలోనే ఎంపీ మాగుంటపై కేసు నమోదైన విషయం వెలుగులోకి వచ్చింది.

 మాగుంటపైన వ్యతిరేకతే కారణమా..

మాగుంటపైన వ్యతిరేకతే కారణమా..

తెలుగు దేశం నేత వైసీపీ ఎంపీకి అనుకూలంగా మాట్లాడటం..ఇప్పుడు నెల్లూరులోని కొందరు వైసీపీ నేతలకు మింగుడు పడటం లేదు. మాగుంటది పెద్ద పారిశ్రామిక కుటుం బం. వాళ్లు సాధారణ మట్టి తవ్వకాలకు దరఖాస్తు చేస్తారా.. అక్రమ తవ్వకాలు చేస్తారా లేదా అన్నది ఆలోచించకుండా కేసు పెట్టారంటూ సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతలను మరింత ఆత్మరక్షణలోకి నెట్టాయి. అయితే, ఇక్కడ ఫిర్యాదు చేసింది ఇరిగేషన్ శాఖ అధికారులు కావటం...ఇదే జిల్లాకు చెందిన మంత్రి అనిల్ చేతిలో ఆ శాఖ ఉండటంతో రాజకీయంగా ఈ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది.

 మంత్రికి తెలియకుండానే ఫిర్యాదు చేసారా..

మంత్రికి తెలియకుండానే ఫిర్యాదు చేసారా..

అదే సమయంలో కేసు నమోదు చేసిన వెంకటాచలం పోలీసు స్టేషన్ కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలో ఉంది. మంత్రి కి సమాచారం లేకుండా ఆ శాఖ అధికారులు..అధికార పార్టీ ఎంపీ పైన ఫిర్యాదు చేస్తారా అనేది ఒక సందేహం. అదే సమయంలో.. కాకాని గోవర్ధన్ రెడ్డి-మంత్రి అనిల్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందనేది మరో చర్చ. దీని కారణంగానే ఆయన నియోజకవర్గంలో జరిగిన ఘటన పైన అనిల్ ఆదేశాల మేరకే అధికారులు పోలీసుల వరకు వెళ్లారనే చర్చ జిల్లాలో సాగుతోంది.

 నేతల తీరుతో ఇరకాటంలో అధికార పక్షం..

నేతల తీరుతో ఇరకాటంలో అధికార పక్షం..

కానీ, గోవర్ధన్ రెడ్డి అనుచరులు మాత్రం ఈ వివాదంతో తమకు ఎటువంటి సంబంధం లేదని చెబుతున్నారు. అయితే, నెల్లూరులో మాత్రం సీనియర్ నేతలు ఆనం రామనారాయణ రెడ్డి..ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి వారు ఓపెన్ గా చేసిన వ్యాఖ్యలు కొద్ది కాలం క్రితం చర్చకు దారి తీసాయి. ఇక, ఇప్పుడు ఏకంగా ఎంపీ పైనే కేసు నమోదు అయింది. దీంతో..ఈ మొత్తం వ్యవహారం పైన జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి నుంచి సీఎం సమాచారం కోరినట్లుగా తెలుస్తోంది.

 సజ్జల సమన్వయ ప్రయత్నాలు చేసినా..

సజ్జల సమన్వయ ప్రయత్నాలు చేసినా..

గతంలోనే పార్టీ ముఖ్యనేత సజ్జల నెల్లూరులో జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలు..ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేసి..వివాదాలకు అందరూ దూరంగా ఉండాలని సీఎం మాటగా చెప్పారు. కానీ, ఇప్పుడు తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు సీఎం ఆగ్రహానికి కారణమవుతున్నాయి. జిల్లాలో ఏ ఎన్నిక జరిగినా వైసీపీకి అనుకూలంగా ఏకపక్ష ఫలితాలు ఈ జిల్లాలో ఆనవాయితీగా మారింది. ఇక, మంత్రి పదవులు సీనియర్లు ఆశించినా..ఇద్దరు యువకులు మేకపాటి గౌతమ్ రెడ్డి-అనిల్ కుమార్ కు సీఎం జగన్ ఏరికోరి మంత్రి పదవులు ఇచ్చారు.

 కేబినెట్ విస్తరణతో మరింతగా..

కేబినెట్ విస్తరణతో మరింతగా..

ఇక, సీనియర్లు తమకు గుర్తింపు లేదనే భావనలో ఉన్నారు. ఈ సారి మంత్రివర్గంలో జరిగే మార్పుల పైన ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యే లు ఎక్కువగా ఉండటం..రేసులోనూ వారే ఉండటంతో మార్పులు సీఎంకు సామాజిక పరంగా కష్టంగా మారుతోంది. దీంతో...పరోక్షంగా ఒత్తిడిం పెంచే విధంగా పావులు కదుపుతున్నారనే చర్చ ఉంది. దీంతో.. దీని పైన ఇప్పుడు వైసీపీ అధిష్ఠానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+