జ‌గ‌న్ ఆఫ‌ర్‌ను రోజా కాద‌న్నారా: మ‌ంత్రి ప‌ద‌వికి అదే అడ్డంకి: జ‌గ‌న్ రాజీ ఫార్ములా..!

Recommended Video

    జ‌గ‌న్ ఆఫ‌ర్‌ను రోజా కాద‌న్నారా ? || Oneindia Telugu

    వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాకు ద‌క్కే ప‌ద‌వి ఏంటి. జ‌గ‌న్ ఆలోచ‌న ఏంటి. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఇచ్చిన ఆఫ‌ర్‌ను రోజా కాద‌న్నారా. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డికి కేబినెట్ బెర్తు ఖాయం. మ‌రి..అదే సామాజిక వర్గం..అదే జిల్లాకు చెందిన రోజా కు అవ‌కాశం ఉండ‌దా. రోజాకు ప్రాధాన్య‌త ఇవ్వ‌కుండా జ‌గ‌న్ ఉండ‌గ‌ల‌రా. రోజా మాత్రం త‌న క‌ష్టం జ‌గ‌న్‌కు తెలుసు అని చెబుతూనే..ప‌రోక్షంగా త‌న‌కు త‌గిన గుర్తింపు ఇవ్వాల‌ని కోరుకుంటున్నారు. ఇంత‌కీ జ‌గ‌న్ ఏం చేయ‌బోతున్నారు.

    జ‌గ‌న్ ఆఫ‌ర్ ఇచ్చినా..రోజా నో..

    జ‌గ‌న్ ఆఫ‌ర్ ఇచ్చినా..రోజా నో..

    కేబినెట్ కూర్పు పైన క‌స‌ర‌త్తు చేస్తున్న స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ త‌న పార్టీ కీల‌క నేత రోజాకు ఒక ఆఫ‌ర్ ఇచ్చారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో రోజాను ఏక‌ప‌క్షంగా ఏడాది పాటు సస్పెండ్ చేసారు. స‌భ‌లో మాట్లాడే అవ‌కాశం లేకుండా చేసారు. ఇప్పుడు అదే చంద్ర‌బాబు ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్నారు. ఆ చంద్ర‌బాబు ద్వారా అధ్య‌క్షా అని పిలిపించేందుకు రోజాకు స్వీక‌ర్ ప‌ద‌వి ఇవ్వాల‌నే చ‌ర్చ సాగింది. దీంతో..జ‌గ‌న్ సైతం త‌న పార్టీ మ‌హిళా నేత‌కు జ‌రిగిన అవ‌మానానికి స‌మాధానంగా..రోజాకు స్పీక‌ర్ ప‌ద‌వి ఇవ్వాల‌ని భావించి...రోజాతో చ‌ర్చించారు. కానీ, రోజా మాత్రం తాను స్పీక‌ర్‌గా ఉండ‌లేన‌ని..తాను ఎక్కువ‌గా ప్ర‌జ‌ల్లో ఉండాల‌ని కోరుకుంటున్నాన‌ని..మంత్రిగా అవ‌కాశం ఇవ్వాల‌ని అభ్య‌ర్ధిస్తూనే..చివ‌ర్లో మాత్రం మీ ఇష్టం అన్నా..మీరు ఎలా చెబితే అలా.. అంటూ..స‌మాధానం ఇచ్చారు. దీంతో..జ‌గ‌న్ తాను నిర్ణ‌యం తీసుకుంటాన‌ని చెప్పుకొచ్చారు.

    పెద్దిరెడ్డికి ఖాయం..రోజాకు అదే అడ్డంకా..

    పెద్దిరెడ్డికి ఖాయం..రోజాకు అదే అడ్డంకా..

    చిత్తూరు జిల్లా నుండి సీనియ‌ర్ ఎమ్మెల్యే..తొలి నుండి జ‌గ‌న్‌కు-పార్టీకి ఆర్దికంగా..రాకీయంగా అండ‌గా నిలిచిన పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి మంత్రి ప‌ద‌వితో పాటుగా కీల‌క శాఖ ఇవ్వ‌టం ఖాయంగా క‌నిపిస్తోంది. అయితే, ఇదే చిత్తూరు జిల్లాకు ..అదే సామాజిక వ‌ర్గానికి చెందిన రోజాకు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌టానికి స‌మీక‌ర‌ణాలు అడ్డుగా మారాయి. దీనికి తోడు జిల్లా లో త‌న ప్రాధాన్య‌త ఉండాల‌ని పెద్దిరెడ్డి కోరుకుంటున్నారు. జ‌గ‌న్ సైతం పెద్దిరెడ్డికి ప్రాధాన్య‌త ఇవ్వ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. అదే స‌మ‌యంలో రోజాకు త‌గిన గుర్తింపు ఇవ్వాల్సిందేన‌ని నిర్ణ‌యించారు. దీంతో..రోజాకు గుర్తింపు ఇస్తూ నే కొత్త ఫార్ములా తెర మీద‌కు తెచ్చారు. అదే స‌మ‌యంలో చిత్తూరు నుండి ఎస్సీ వ‌ర్గానికి ప్రాతినిధ్యం ఇవ్వాల్సిన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. రోజా విష‌యంలో మాత్రం జ‌గ‌న్ సానుకూలంగా ఉన్నారు.

    జ‌గ‌న్ రాజీ ఫార్ములా ఏంటి..

    జ‌గ‌న్ రాజీ ఫార్ములా ఏంటి..

    పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి మంత్రి ప‌ద‌వి..ఆయ‌న కుమారుడు మిధున్ రెడ్డికి లోక‌స‌భ పార్టీ ఫ్లోర్ లీడ‌ర్‌గా అవ‌కావం ఇవ్వ‌టం ద్వారా వారికి ఎటువంటి ప్రాధాన్య‌త ఇస్తోంది స్ప‌ష్టం చేసారు. ఇదే స‌మ‌యంలో రోజా సైతం మంత్రి పదవి కావాలని ఇంతవరకూ తాను అడగలేదని.. పార్టీ కోసం తాను ఎంతగా కష్టపడ్డానో జగన్‌కు తెలుసని ఆమె చెప్పుకొచ్చా రు. జ‌గ‌న్ సైతం రోజాకు కీల‌క ప‌ద‌వి అప్ప‌గించే అవ‌కాశం ఉంద‌ని తాజా స‌మాచారం. ఇందులో భాగంగానే.. ఈ రోజు రోజాకు ఇవ్వ‌బోయే ప‌ద‌వి గురించి జ‌గ‌న్ స్ప‌ష్ట‌మైన సంకేతాలు ఇవ్వ‌నున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+