వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం జగన్ - షర్మిల మరోసారి : ఇడుపులపాయ వేదికగా - విజయమ్మ ప్లీనరీకి హాజరుపైనా..!!

|
Google Oneindia TeluguNews

సీఎం జగన్ కడప పర్యటనకు వెళ్తున్నారు. ఈ నెల 8న దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ జన్మదినం. దీంతో...రేపు తన సొంత నియోజకవర్గం పులివెందుల చేరుకోననున్న సీఎం జగన్ పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. రేపు సాయంత్రానికి ఇడుపులపాయ చేరుకుంటారు. రేపు ( గురువారం) సాయంత్రం 5.15కు ఇడుపులపాయ చేరుకుంటారు. 5.20కి హెలీప్యాడ్‌ నుంచి బయలుదేరి 5.25కు ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఎస్టేట్‌కు చేరుకుని రాత్రి బస చేస్తారు. అయితే, ప్రస్తుతం పాదయాత్రలో ఉన్న సీఎం జగన్ సోదరి షర్మిల..తల్లి విజయమ్మ సైతం ఇడుపుల పాయకు రానున్నట్లు సమాచారం.

వైఎస్సార్ ఎస్టేట్స్ కు ఫ్యామిలీ మొత్తం

వైఎస్సార్ ఎస్టేట్స్ కు ఫ్యామిలీ మొత్తం

షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసిన సమయం..నుంచీ వైఎస్సార్ జన్మదినం - వర్దంతి నాడు ఇడుపులపాయలో వీరిద్దరి రావటం..కలుసుకోవటం పైన ఆసక్తి కర చర్చ జరుగుతూ వస్తోంది. గతంలో ప్రతీ క్రిస్మస్ కు అందరూ కలిసి పులివెందులలో కలిసే వారు. కానీ, కొంత కాలంగా అది జరగటం లేదు. ఇక, ఇప్పుడు షర్మిల తెలంగాణలో సుదీర్ఘ పాదయాత్రలో ఉన్నారు. అయితే, తన తండ్రి జన్మదినం కావటంలో రేపు సాయంత్రానికి ఇడుపులపాయ చేరుకుంటారని సమాచారం. రేపు వైఎస్సార్ కుటుంబ సభ్యులు వైఎస్సార్ ఎస్టేట్స్ లోనే బస చేయనున్నారు.

వైఎస్సార్ కు నివాళి - ప్లీనరీకి పయనం

వైఎస్సార్ కు నివాళి - ప్లీనరీకి పయనం


8వ తేదీ ఉదయం 8 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఎస్టేట్‌ నుంచి బయలుదేరి 8.05కు వైఎస్సార్‌ ఘాట్‌కు చేరుకొని దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి నివాళులు అర్పించి ప్రార్థనల్లో పాల్గొంటారు. 8.45కు వైఎస్సార్‌ ఘాట్‌ నుంచి బయలుదేరి 8.50కు ఇడుపులపాయలోని హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. 8.55కు హెలీకాప్టర్‌లో బయలుదేరి 9.10కి కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. గత ఏడాది ఇదే విధంగా కుటుంబ సభ్యులు అందరూ కలిసి వైఎస్సార్ కు నివాళి అర్పించి.. ప్రార్ధనల్లో పాల్గొన్నారు. ఇప్పుడు కూడా కలిసే నివాళి అర్పించనున్నట్లు తెలుస్తోంది. ఇక, విజయమ్మ పార్టీ ప్లీనరీకి హాజర పైన కొద్ది రోజులుగా చర్చ సాగుతోంది. ఒక దశలో వైసీపీ గౌరవాధ్యక్ష పదవి వీడటానికి సైతం విజయమ్మ సిద్దం అయ్యారనే ప్రచారం సాగింది.

పార్టీ బైలాస్ లోనూ మార్పుల దిశగా

పార్టీ బైలాస్ లోనూ మార్పుల దిశగా

కానీ, ఇడుపులపాయ నుంచి సీఎం జగన్ తో పాటుగానే విజయమ్మ సైతం పార్టీ ప్లీనరీ ప్రారంభోవత్సవ సభకు హాజరవుతారని తెలుస్తోంది. 2017 లో జరిగిన ప్లీనరీలో విజయమ్మతో పాటుగా షర్మిల -పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సైతం హాజరయ్యారు. అయితే, ఈ సారి పార్టీ ప్లీనరీ వేదికగా పార్టీ రాజ్యాంగానికి సంబంధించి కొన్ని సవరణలు ప్రతిపాదిస్తున్నట్లుగా సమాచారం. శాశ్వత గౌరవాధ్యక్షురాలు..శాశ్వత అధ్యక్షుడు హోదాలో ఈ రెండు పదవులను ఖరారు చేస్తూ పార్టీ బైలాస్ లో మార్పులు చేర్పులు చేయనున్నట్లు నేతలు చెబుతున్నారు. దీంతో..ఇప్పుడు మరోసారి ఇడుపుల పాయలో వైఎస్సార్ కుటుంబం ఒక్కటిగా కనిపించనుండటం ఆసక్తి కరంగా మారనుంది.

English summary
CM Jagan Kadpa tour two days, He pays tributes to lates YSR at Ipudpulapya qlong with his family members on 8th of this month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X