Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వివేకా హత్యపై రాజకోట రహస్యాన్ని సీఎం జగన్ బయటపెట్టాలి; అంతా తెలిసే జగన్నాటకాలు: వర్ల రామయ్య

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ వైసిపి నేత, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్యకేసులో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి కీలక సూత్రధారి అని, సిబిఐ కూడా ఇదే విషయాన్ని చెబుతోందని టిడిపి నేతలు టార్గెట్ చేస్తున్నారు. ఈ వ్యవహారమంతా జగన్ రెడ్డికి తెలిసే జరిగిందని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇక వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తాజా పరిణామాల నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆత్మరక్షణలో పడింది.

 తన బాబాయ్ ని ఎవరు చంపారో ముందే తెలిసి జగన్ నాటకాలు: వర్ల రామయ్య

తన బాబాయ్ ని ఎవరు చంపారో ముందే తెలిసి జగన్ నాటకాలు: వర్ల రామయ్య

తాజాగా టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య వివేకానంద రెడ్డి హత్య కేసు ని టార్గెట్ చేశారు. వివేకానంద రెడ్డి హత్య అనే రాజకోట రహస్యం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బయటపెట్టాలని డిమాండ్ చేశారు. తన బాబాయ్ ని ఎవరు చంపారో జగన్మోహన్ రెడ్డి కి ముందే తెలిసి నాటకాలాడుతున్నారని వర్ల రామయ్య ఆరోపణలు గుప్పించారు. వివేకానంద రెడ్డి హత్య కేసులోని సాక్ష్యాలను వైఎస్ అవినాష్ రెడ్డి నేతృత్వంలోనే హత్య జరిగినట్లుగా చూపిస్తున్నా, ఆయనను అరెస్ట్ చేయకుండా ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు అని ప్రశ్నించారు.

 అవినాష్ రెడ్డి అరెస్ట్ ను ఆపుతుంది జగన్ కాదా?

అవినాష్ రెడ్డి అరెస్ట్ ను ఆపుతుంది జగన్ కాదా?

సీఎం జగన్మోహన్ రెడ్డికి ఈ వ్యవహారంతో సంబంధం లేకుంటే అవినాష్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని, హత్యతో ప్రమేయం ఉన్న పెద్ద తలకాయల ఆట కట్టించాలని సీఎం జగన్ సిబిఐ తో ఎందుకు చెప్పడం లేదని వర్ల రామయ్య ప్రశ్నించారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవినాష్ రెడ్డి అరెస్ట్ ను అడ్డుకుంటున్న అనుమానాలున్నాయని పేర్కొన్నారు. అవినాష్ రెడ్డి అరెస్ట్ ను తాను ఆపడం లేదని సీఎం తక్షణమే ప్రకటన చేయాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

కళ్ళముందు ఇన్ని సాక్ష్యాలున్నా ఎందుకు తాత్సారం

కళ్ళముందు ఇన్ని సాక్ష్యాలున్నా ఎందుకు తాత్సారం


హత్య జరిగినప్పుడే ఎంపీ అవినాష్ రెడ్డి జగన్ కు మొత్తం చెప్పేశాడని, జగన్ కు ముందే అన్ని విషయాలు తెలుసు కాబట్టి, తన బాబాయ్ ని చంపిన వాళ్ళు ఎవరో తెలుసు కాబట్టి ఇన్ని నాటకాలు ఆడుతున్నారని వర్ల రామయ్య విమర్శించారు. కళ్ళముందు ఇన్ని సాక్ష్యాలున్నా, హత్యలో అవినాష్ రెడ్డి పాత్రను ధృవీకరిస్తున్నా, అరెస్టు జరగకుండా అడ్డుకుంటుంది జగన్మోహన్ రెడ్డి కాదా చెప్పాలంటూ అంటూ వర్ల రామయ్య నిలదీశారు.

Recommended Video

    TDP Vs YSRCP : Andhra Pradesh లో ఆ పది పోలీస్ స్టేషన్లు వైసీపీ కి అప్పగించండి - TDP
    వివేకా హత్యపై టీడీపీ మాటల దాడితో జగన్ సర్కార్ ఉక్కిబిక్కిరి

    వివేకా హత్యపై టీడీపీ మాటల దాడితో జగన్ సర్కార్ ఉక్కిబిక్కిరి

    వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తున్న వేళ ఈ హత్య కేసులో సీబీఐ చివరకు ఏం తేల్చబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. అవినాష్ రెడ్డి పాత్రను సిబిఐ ధ్రువీకరిస్తున్న నేపథ్యంలో ఎంపీ అవినాష్ రెడ్డికి ఉచ్చు బిగుస్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న మాటల దాడి జగన్ సర్కార్ ను మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. పదేపదే జగన్ కు హంతకులెవరో తెలుసు అని టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు జగన్ కు తలనొప్పిగా మారింది. వైఎస్ వివేకానంద రెడ్డిని హతమార్చింది వైఎస్ కుటుంబ సభ్యులే అని చేస్తున్న విమర్శలు వైసీపీ నేతలకు ఆగ్రహం తెప్పిస్తుంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+