వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం జగన్ సీరియస్ వార్నింగ్ - 32 ఎమ్మెల్యేల మార్పుపై : జాబితాలో మంత్రులతో సహా..!!

|
Google Oneindia TeluguNews

ముఖ్యమంత్రి జగన్ సీరియస్ అయ్యారు. పని తీరు బాగోలేని ఎమ్మెల్యేలకు ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. 32 మంది పని తీరులో వెనుకబడి ఉన్నారని తేల్చి చెప్పారు. క్షేత్ర స్థాయిలో విభిన్న అంశాల ఆధారంగా సేకరించిన సమాచారాన్ని వైసీపీ రాజకీయ వ్యూహకర్త ఐ పాక్ రిషి సింగ్ సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరంచారు. ప్రతిపక్షాలు స్పీడ్ అవుతున్నాయని సీఎం వ్యాఖ్యానించారు. ఎవరికి వారే సీటు ఖాయమని అనుకోవద్దని స్పష్టం చేసారు. ప్రత్యామ్నాయం ఖాయని తేల్చి చెప్పారు. అభ్యర్ధులను మార్చే అంశంలోనూ క్లారిటీ ఇచ్చారు. ఇక..కన్వీనర్లు -గృహ సారధుల నియామకంపైన గడువు విధించారు. ఏప్రిల్ వరకు ఎమ్మెల్యేలకు గడువు నిర్దేశించారు. ఆషామాషీగా తీసుకుంటే కుదరదని స్పష్టం చేసారు. జాబితాలో ఎమ్మెల్యేతో పాటుగా మంత్రులు ఉన్నారు.

32 మందికి సీఎం జగన్ వార్నింగ్..

32 మందికి సీఎం జగన్ వార్నింగ్..


గడప గడపకు ప్రభుత్వం వర్క్ షాప్ లో సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎమ్మెల్యేల పని తీరు పైన సూక్ష్మ స్థాయిలో సేకరించిన సమాచారం వారి ముందుంచారు. 32 మంది ఎమ్మెల్యేలు వెనుకబడి ఉన్నారని తేల్చారు. పదే పదే చెబుతున్నా.. 10 నుంచి 21 రోజులు మాత్రమే గడప గడప కార్యక్రమంలో చేపట్టిన 32 మంది పై సీఎం సీరియస్ అయ్యారు. వీరికి ఏప్రిల్ వరకు సమయం నిర్దేశించారు. తన అంచనాలకు తగినట్లుగా పని చేయని ఎమ్మెల్యేలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసారు. ఎమ్మెల్యేలు అందరూ తిరిగి పోటీ చేయాలని తాను కోరుకుంటున్నానని.. ఎవరినీ వదులుకోవాలని అనుకోవటం లేదని చెప్పారు. అయితే, ఎవరికి వారు సీటు గ్యారంటీ అనే ధీమాతో ఉండవద్దని చెప్పారు. గెలుపు ప్రామాణికంగా సీట్ల ఖరారు ఉంటుందని స్పష్టం చేసారు. తనకు ప్రత్యామ్నాయం సిద్దంగా ఉన్నారని..ఆ పరిస్థితి తనకు రానీయద్దని సీఎం స్పష్టం చేసారు. ఎవరినీ పక్కన పెట్టటం తనకు ఇష్టం లేదన్నారు.

జాబితాలో మంత్రులు - ఎమ్మెల్యేలు..

జాబితాలో మంత్రులు - ఎమ్మెల్యేలు..


ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసిన జాబితాలో మంత్రులు మంత్రి గుమ్మనూరు జయరాం, విడదల రజనీ, అమర్నాధ్, అంబటి రాంబాబు, సిదిరి అప్పలరాజు, జోగి రమేష్ ఉన్నారు. మరో 25 మంది ఎమ్మెల్యేలు పేర్లను ప్రస్తావించారు. మైదుకూరు రఘురామి రెడ్డి, దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ , కందుకూరు ఎమ్మెల్యే, నిడదవోలు, తాడికొండ ఎమ్మెల్యేలు ఆ జాబితాలో ఉన్నారు. 30 రోజుల పాటు తిరిగినా సగటున రోజుకు 4 గంటల లోపే తిరిగిన వాళ్ళు 20 మంది ఉన్నట్లు నివేదికలో స్పష్టం చేసారు. సీఎం టార్గెట్ రీచ్ కాని వాళ్ళల్లో ఎక్కువ మంది మంత్రులే ఉన్నట్లుగా తేల్చారు. 30 రోజులు తిరగని వాళ్ళల్లో జోగి రమేష్, కొడాలి నాని కూడా ఉన్నారు. అదే విధంగా.. తక్కువ టైం తిరిగిన వాళ్ళల్లో అనీల్ కుమార్, పార్ధ సారధి ఉన్నట్లు వెల్లడించారు. ప్రజల్లో తిరిగినా.. క్షేత్ర స్థాయి పనుల పైన రిపోర్టు చేయని నేతల అంశాన్ని సీఎం ప్రస్తావించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పని చేసింది కేవలం 50 మంది మాత్రమేనని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మార్చిలో మరోసారి ఇదే తరహా వర్క్ షాప్ ఉంటుందని సీఎం ప్రకటించారు. ఇక నుంచి జరిగే సమావేశాలు సీరియస్ గా ఉంటాయని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు.

నియామకాలకు డెడ్ లైన్ - సీఎం జగన్ లేఖలు

నియామకాలకు డెడ్ లైన్ - సీఎం జగన్ లేఖలు


ప్రతీ 50 ఇళ్లకు డిసెంబర్ 25 లోగా సచివాలయ కన్వీనర్ల, జనవరి 26లో గ్రుహ సారధుల నియామకం పూర్తి కావాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. జనవరి 1న ప్రభుత్వ పథకాలు అందుకుంటున్న ప్రతీ లబ్దిదారుడకి సీఎం తన పథకాలను వివరిస్తూ గ్రీటింగ్స్ లేఖలు పంపాలని నిర్ణయించారు. 29న డిసెంబర్ ఆసరా పథకం ఉంటుందని సీఎం వెల్లడించారు. తాను పంపే గ్రీటింగ్ కార్డులతో ప్రతీ ఇంటికి వెళ్లాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ఏ ఎమ్మెల్యే పని చేయకపోయినా తామే గ్యారంటీగా ఉంటామని భావించవద్దని స్పష్టం చేసారు. ప్రత్యర్ధులు స్పీడ్ అవుతున్నారు...మనం కూడా స్పీడ్ గా ఉండాలని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు ఏదో చేద్దామంటే కుదరదని తేల్చి చెప్పారు. గృహ సారధులు, కన్వీనర్లతో మండల స్థాయి వర్క్ షాప్ నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు.

English summary
CM Jagan Serious on party mlas who not performing in Gada Gadapau prabhutvam programme, fixed dead line to improve.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X