కరోనా కంట్రోల్ కి సీఎం జగన్ మరో కీలక నిర్ణయం ... ప్రతి ఇంట్లో ఒకరికి కరోనా పరీక్షలు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 62కొత్త కేసులు నమోదు జరిగిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు . ఇక ఈ నేపథ్యంలో సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనాను పూర్తి స్థాయిలో కట్టడి చెయ్యాలంటే అసలు కేసులు ఎన్ని ఉన్నాయో ముందు ఐడెంటిఫై చెయ్యాలని ఆయన భావిస్తున్నారు. అందుకే ప్రతి కుటుంబంలో ఒకరికి కరోనా పరీక్ష నిర్వహించాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు .

ముందుగా ఏపీలో రెడ్ జోన్ జిల్లాలుగా ఉన్న కర్నూలు, చిత్తూరు , గుంటూరు , కృష్ణా , నెల్లూరు జిల్లాలలో మండలాల వారీగా కరోనా టెస్టులు చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. మండలాల వారీగా ప్రతి ఇంట్లో ఒకరికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేస్తే ఇంకా ఎవరికైనా ఉంటే బయటపడుతుందని , తగిన చికిత్స చేసి, జాగ్రత్తలు తీసుకుంటే రాష్ట్రం కరోనా నుండి బయటపడే అవకాశం ఉందని సీఎం జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నారు . కరోనా కంట్రోల్ కి తాత్కాలిక పరిష్కారం కాకుండా శాశ్వత పరిష్కారం ఆలోచిస్తున్నారు.

CM Jagan taken another key decision for Corona Control ... Corona tests in each family

ఈ క్రమంలో ఇప్పటికే శనివారం ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలంలోని ప్రతి ఇంట్లో ఒకరికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అక్కడి గ్రామ వాలంటీర్లు తమ పరిధిలోని 50 కుటుంబాల్లో ఒక్కొక్కరి చొప్పున తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. ఈ ఫలితాలు రెండు రోజుల్లో రానున్నాయని అధికారులు చెప్పారు. అయితే ఏపీలో ఇప్పటివరకు 1,08,403 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. మొత్తం 1,525 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 33 మంది మరణించారు . 1,051 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 441 మందికి నయం అయ్యింది . రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం రిస్క్ తో కూడుకున్నదే అయినా సరే ప్రజల ఆరోగ్య రక్షణకు ఇంతకంటే మార్గం లేదని భావిస్తోంది ఏపీ ప్రభుత్వం .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+