జగన్ నిర్ణయం సాహసమే - సీనియర్ మంత్రులను తప్పిస్తే : ముప్పు పొంచి ఉందా-టైం కోసం చంద్రబాబు...!!

సీఎం జగన్ సమర్ధతకు మరో పరీక్ష సిద్దం అవుతోంది. తన పట్టు నిలుపుకొనే ప్రయత్నాల్లో..కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. ఫలితం ఎలా ఉన్నా.. తన నిర్ణయాలను మాత్రం మార్చుకోవటానికి ఇష్ట పడరు. ఇప్పుడు తీసుకుంటున్న మరో నిర్ణయం సైతం రాజకీయంగా..వ్యక్తిగతంగా జగన్ పైన ఎటువంటి ప్రభావం చూపిస్తుందనే చర్చకు కారణమవుతోంది. రెండున్నారేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న జగన్ మరో సాహసం చేయటానికి సిద్దమవుతున్నారు. గతంలో ఎన్టీఆర్ ఒకే సారి తన కేబినెట్ లోని అందరు మంత్రులను తప్పించి అప్పట్లో రాజకీయంగా చరిత్ర సృష్టించారు.

జగన్ నిర్ణయం సాహసమేనా

జగన్ నిర్ణయం సాహసమేనా

ఇప్పుడు జగన్ అదే తరహా నిర్ణయానికి సిద్దమయ్యారు. తన కేబినెట్ లో ఉన్న సీనియర్లు- జూనియర్లు అన్న తేడా లేకుండా అందిరినీ తప్పించాలని డిసైడ్ అయ్యారు. తొలి సారి కేబినెట్ కూర్పు సమయంలోనే రెండన్నారేళ్ల తరువాత 90 శాతం వరకు మంత్రులను మార్చి..కొత్త వారికి అవకాశం ఇస్తానని జగన్ స్పష్టం చేసారు. అయితే, ఇప్పుడు కొందరిని తప్పించి..కొందరిని కొనసాగించటం ద్వారా కొత్త సమస్యలు వస్తాయని భావిస్తున్నారు. దీంతో..విధానపరమైన నిర్ణయంగా అందరినీ తప్పించాలని భావిస్తున్నారు. ఇందులో సీనియర్లు ఉన్నారు. వారిని పార్టీ సేవలకు వినియోగించుకోవాలని నిర్ణయించారు.

నిర్ణయాలకు వెనుకాడని జగన్

నిర్ణయాలకు వెనుకాడని జగన్

వారిని పార్టీ సేవలకు వినియోగించుకోవాలని భావిస్తున్నారు. అయితే, వైసీపీలో ఇప్పటి వరకు జగన్ నిర్ణయమే ఫైనల్. పార్టీ ఏర్పాటు నుంచి ఈ రోజు వరకు పార్టీ పైన జగన్ ఎక్కడా పట్టు తప్పలేదు. ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా...వాటి పైన కొన్ని ఇబ్బందులు వచ్చినా వెనక్కు తగ్గలేదు. జగన్ తో ఉంటూ గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు నాడు అధికార పార్టీలోకి జగన్ ను విడిచి వెళ్లిపోయిన సందర్భాలు పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. అయితే, అధికారంలో ఉన్న సమయంలో పదువులు అనుభవించాలనే సహజమైన ఆకాంక్ష ఇప్పుడు వైసీపీలో కొత్త సమస్యలకు కారణమయ్యే అవకాశం కనిపిస్తోంది.

సీనియర్లను తప్పిస్తే ఇబ్బందులు ఉంటాయా

సీనియర్లను తప్పిస్తే ఇబ్బందులు ఉంటాయా

ఇప్పటికే పలువురు సీనియర్లు తమకు కేబినెట్ పదవులు దక్కక్కపోవటం పైన రెండున్నారేళ్లుగా నిరీక్షిస్తున్నారు. ఇప్పుడు విస్తరణలో తమకు మంత్రి పదవులు ఖాయమనే భావనలో అంబటి రాంబాబు, రోజు, ఆనం, పార్ధసారధి, అనంత వెంకట్రామిరెడ్డి లాంటి వారు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక, ఇదే సమయంలో ప్రస్తుత కేబినెట్ లో ఉన్న సీనియర్లను అందరినీ పక్కన పెడితే ..అది రాజకీయంగా రానున్న రోజుల్లో జగన్ కు కొత్త సమస్యలు తెచ్చి పెట్టే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.

జగన్ పట్టు తప్పితే ..ముప్పు తప్పదంటూ

జగన్ పట్టు తప్పితే ..ముప్పు తప్పదంటూ

పార్టీ పైన పట్టు..జనంలో ఇమేజ్ ఉండి..ఖచ్చితంగా 2024 లో అధికారంలోకి వస్తామనే భావనతో ఇప్పటి వరకు జగన్ ఆలోచన పైన ఎవరూ నెగటివ్ గా స్పందించ లేదు. తిరిగి అధికారంలోకి వస్తే మరలా పదవులు దక్కుతాయనే నమ్మకం వారిది. ప్రచారం సాగుతున్నట్లుగా ప్రభుత్వం పైన వ్యతిరేకత..జగన్ నాయకత్వం బలహీన పడ్డారనే సంకేతాలు ఏమాత్రం కనిపించినా..మంత్రి పదవులు వీడిన తరువాత వారి నుంచే సమస్యలు వచ్చే అవకాశం లేకపోలేదని విశ్లేషకుల అంచనా.

వచ్చే ఎన్నికలకు సమాయత్తంలో భాగంగా..

వచ్చే ఎన్నికలకు సమాయత్తంలో భాగంగా..

ఏపీలో ఎన్నో ఉదంతాలు ఇలా పదవుల కోసం జరిగినవేనని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన దగ్గరకు రావాటానికి..ఆయన గురించి మాట్లాడటానికి భయపడిన నేతలు..ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలోకి రావటంతోనే ఒక్క సారిగా స్వరం పెంచుతున్నారు. వైసీపీ పూర్తిగా జగన్ కంట్రోల్ లోనే ఉంది. ప్రజలు ఓట్లు సైతం జగన్ పైన అభిమానం..ఆయన పధకాల పైన ఆకర్షణతో వేస్తున్నారనే అభిప్రాయం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నింటా గెలవటం ద్వారా జగన్ బలం పెరిగిందనే లెక్కలు వినిపిస్తున్నాయి.

Recommended Video

    గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరుగుతుందన్న సీపి!!
    జిల్లాల్లో పెరుగుతున్న వైసీపీ నేతల కోల్డ్ వార్

    జిల్లాల్లో పెరుగుతున్న వైసీపీ నేతల కోల్డ్ వార్

    అయితే, స్థానిక ఎన్నికలు-సార్వత్రిక ఎన్నికలు ఒకే విధంగా ఉండవు. ఇక, ఏ మాత్రం ప్రజల్లో వైసీపీ పైనా..జగన్ పైన సానుకూలత శాతం తగ్గిందని భావిస్తే..అసమ్మతి స్వరాలు మొదలైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పార్టీలో పలు జిల్లాల్లో నేతల మధ్య అంతర్గతంగా ఆధిపత్య పోరు సాగుతోంది. అయితే, పార్టీ కోసం ఎటువంటి నిర్ణయాలైన తీసుకోవటంలో జగన్ వెనుకాడరు. ఎవరినీ ఉపేక్షించరనే అభిప్రాయం ఉంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+