వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం జగన్ షాకింగ్ డెసిషన్ : బాబాయ్ పొలిటికల్ ఫ్యూచర్ ఏంటి : టీటీడీకి స్పెసిఫైడ్ కమిటీ ...!!

By Lekhaka
|
Google Oneindia TeluguNews

ప్రతిష్ఠాత్మక తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ఛైర్మన్..బోర్డు వ్యవహారంలో సీఎం జగన్ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత 2019 జూన్ 21 టీటీడీ నూతన ఛైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డిని నియమిస్తూ నిర్ణయించారు. ఆ తరువాత మూడు నెలలకు జంబో బోర్డును ఏర్పాటు చేసారు. ఈ నెల 21వ తేదీతో రెండేళ్ల కాలం ముగియటంతో..కొత్త బోర్డు ఏర్పాటు పైన చర్చ మొదలైంది. ఈ సమయంలోనే కొత్త బోర్డు ఏర్పాటు పైన చర్చ మొదలైంది. పలువురి ఆశావాహుల పేర్లు తెర పైకి వచ్చాయి.

సుబ్బారెడ్డి తొలుత వద్దన్నా..తరువాత

సుబ్బారెడ్డి తొలుత వద్దన్నా..తరువాత


సాధారణంగా ఏ నియామకంలో అయినా..సామాజిక సమీకరణాలను అమలు చేస్తూ పక్కాగా నిర్ణయం తీసుకుంటారు. సుబ్బారెడ్డి రెండేళ్ల పదవీ కాలం ముగియటంతో రాజ్యసభకు వెళ్లాలని కోరుకుంటున్నారని...మరొకరికి టీటీడీ ఛైర్మన్ గా అవకాశం ఇవ్వాలంటూ ఓపెన్ గానే కోరారు. ఇదే విషయం ముఖ్యమంత్రి వద్ద ప్రతిపాదించినట్లుగా సమాచారం. కానీ, రాజ్యసభ లో వైసీపీ వచ్చే ఏడాది జూన్ వరకు అవకాశం లేదు. అప్పుడు నాలుగు స్థానాలు ఖాళీలు అవుతాయి. అందులో విజయ సాయిరెడ్డి సైతం పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఆయనకు రెన్యువల్ చేస్తే రెండో సీటు రెడ్డి వర్గానికే ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో..సీఎం జగన్ దాని పైన ఎటువంటి హామీ ఇవ్వలేదని తెలుస్తోంది.

సుబ్బారెడ్డికి ప్రత్యామ్నాయం ఏంటి

సుబ్బారెడ్డికి ప్రత్యామ్నాయం ఏంటి

ఎమ్మెల్సీగా చేసి సుబ్బారెడ్డిని కేబినెట్ లోకి తీసుకుంటారనే ప్రచారం సాగినా..అందుకు సామాజిక - ప్రాంతీయ సమీకరణాలు కుదరవని తెలుస్తోంది. దీంతో..తిరిగి సుబ్బారెడ్డిని మరో ఏడాది పాటు తిరిగి టీటీడీ ఛైర్మన్ గా కంటిన్యూ చేయాలని సీఎం తొలుత భావించినట్లుగా సమాచారం. సుబ్బారెడ్డి రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ వెంటనే టీటీడీ ఛైర్మన్ పదవి ఆశిస్తున్న భూమన కరుణాకర రెడ్డి సైతం సమావేశం అయ్యారు. ఇదే సమయంలో కొత్త బోర్డులో అవకాశం కోసం ముఖ్యమంత్రి మీద పెద్ద ఎత్తున ఒత్తిడి పెరుగుతోంది. ఈ సమయంలో వెంటనే నిర్ణయం తీసుకోవటం కంటే...కొంత సమయం తీసుకొని బోర్డును ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఈ నిర్ణయం ద్వారా సుబ్బారెడ్డి తిరిగి టీటీడీ చైర్మన్ అయ్యే అవకాశం లేదనేది స్పష్టమవుతోంది.

వచ్చే నెలలో కొత్త బోర్డు

వచ్చే నెలలో కొత్త బోర్డు

బాబాయ్ కు మరోసారి పొడిగింపు ఖాయమనే ప్రచారం నడుమ ఈ నిర్ణయం సుబ్బారెడ్డి అనుచరుల్లో చర్చకు కారణమవుతోంది. ప్రస్తుతం నామినేటెడ్ పోస్టులు..త్వరలో ఎమ్మెల్సీల భర్తీ..కేబినెట్ విస్తరణతో ముఖ్యమంత్రి ఈ విషయంలో ఆచి తూచి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారని తెలుస్తోంది. దీంతో వచ్చే నెలలో కొత్త ఛైర్మన్ తో పాటుగా బోర్డు సభ్యులతో ట్రస్టు ఏర్పాటవుతుందని చెబుతున్నారు. అప్పటి వరకు ఆలయ ఈఓ కు బాధ్యతలు అప్పగిస్తూ స్పెసిఫైడ్ కమిటీని ఏర్పాటు చేసారు. కొత్త బోర్డు ఏర్పాటయ్యే వరకూ ఈ బోర్డు టీటీడీ కి సంబంధించి అన్ని నిర్ణయాలు తీసుకొనే అధికారం ఉంటుంది. అయితే, ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో సుబ్బారెడ్డి కి ఎటువంటి ప్రాధాన్యత దక్కుతుంది... ఏ పదవిలో కొనసాగుతారనే చర్చ ఆసక్తి కరంగా మారుతోంది.

English summary
CM Jagan appointed specified committee for TTd in place of board. news speculated that Subba reddy may continue fo some more time as TTD chairman. But, CM decided to form new board for TTD
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X