కలిసే రండి - ఓడించి తీరుతాం: యుద్దానికి..సై - జగన్ సింహనాదం..!!
ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల సమరశంఖం పూరించారు. యుద్దానికి సై అంటూ సమర నాదం చేసారు. ఎవరు కలిసి వస్తారో రండి..చంద్రబాబుతో సహా అందరినీ ఓడించాల్సిందేనని నినదించారు. కౌరవ సైన్యం పద్మవ్యూహంలో చిక్కుకోవానికి తాను అభిమన్యుడు కాదని..ఇక్కడ ఉన్నది అర్జునుడని హెచ్చరించారు. యుద్దానికి తాను సిద్దమని..కేడర్ సిద్దమా అని ప్రశ్నించారు. ప్రతీ ఒక్కరూ ఒక సైనికుడై 175కి 175 సీట్లు గెలిచేలా ప్రజల్లోకి వెళ్లాలని..ప్రతీ ఒక్కరి మద్దతు పొందాలని జగన్ సూచించారు.
జగన్ సింహనాదం : ముఖ్యమంత్రి జగన్ భీమిలి నుంచి ఎన్నికల సమరనాదం మోగించారు. మరో 60-70 రోజుల్లో జరిగే ఎన్నికల్లో ప్రతీ కార్యకర్త ఒక సైనికుడులా పని చేాయలని పిలుపునిచ్చారు. దేవుడి దయతో ఒంటరి పోరాటానికి సిద్దం. మీరు సిద్దమా అంటూ ప్రశ్నించారు. ఎవరు కలిసి వచ్చినా తాను భయ పడనని తేల్చి చెప్పారు. తొణకను..బెణకను 175కి 175 సీట్లు గెలవాల్సిందేనని లక్ష్యం నిర్దేశించారు. 2024 లో దుష్ట చతుష్టం, గజ దొంగల ముఠాను ఓడించేందుకు సిద్దం కావాలని పిలుపునిచ్చారు. పేదలు - పెత్తందార్లు, వంచన- విశ్వసనీయతకు, సామాజిక అన్యాయం - సామాజిక న్యాయానికి మధ్య యుద్దం గా పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు రద్దు చేసే వారికి - సంక్షేమ ప్రభుత్వానికి మధ్య యుద్దంగా వివరించారు. ప్రతిపక్షాలకు ఓటు వేస్తే పథకాలు అమలు కావని.. వివక్షత, పెత్తందార్ల పాలన వస్తుందనేది ప్రతీ ఇంటా వివరించాలని కేడర్ కు జగన్ సూచించారు.

తొణకను బెణకను : వచ్చే రెండు నెలలు నిత్యం యుద్దమేనని చెప్పిన జగన్..ప్రతీ ఒక్కరూ సైన్యంగా పని చేయాలన్నారు. ప్రతిపక్షం చేసే దాడిని, దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. 175కి 175 గెలవాలనే లక్ష్యంతో పని చేయాలన్నారు. ప్రతిపక్ష పార్టీకి పోటీకి అభ్యర్దులు లేరన్నారు. జనంలో లేని వారు దిగజారుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 56 నెలల కాలంలో 2.53 లక్షల కోట్ల మేర అందించిన సంక్షేమం, అమలు చేసిన సామాజిక న్యాయం గురించి వివరించాలన్నారు. ప్రతీ ఇంటికి జరిగిన మంచి గురించి చెప్పాలన్నారు. రాష్ట్రంలో 82 శాతం మందికి పథకాలు అందాయనిచెప్పారు. తనకు కుతంత్రాలు, కుట్రలు, మోసం, అబద్దాలు తెలియదని చెప్పుకొచ్చారు. చెప్పాడంటే చేస్తాడంతే అనే విశ్వనీయత ఉందన్నారు. పొత్తులు, జిత్తులు తాను నమ్ముకోలేదని స్పష్టం చేసారు.

కలిసి కట్టుగా ఓడిద్దాం : ఈ ఎన్నికలు పేదల భవిష్యత్ కు కీలకమైనవిగా వివరించాలని సూచించారు. బడులు మారాలన్నా..ఇంగ్లీషు మీడియం చదువు రావాలన్నా వైసీపీ తిరిగి గెలవాలని చెప్పాలని కోరారు. రాష్ట్రంలో ఎక్కడ చూసిన జగన్ మార్క్ పాలన కనిపిస్తుందన్నారు. వచ్చే ఎన్నికలు మోసం- విశ్వసనీయకు యుద్దంగా పేర్కొన్నారు. ఇది తన ఒక్కడి పార్టీ కాదని..మీ అందరి పార్టీ అంటూ చెప్పుకొచ్చారు. తాను అందరికీ మంచి సేవకుడిని మాత్రమేనని చెప్పారు. కార్యకర్తలను, నాయకులను అభిమానించే విషయంలో దేశ చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా కార్పోరేషన్ ఏర్పాటు చేసి ఛైర్మన్లు, డైరెక్టర్లను నియమించిన ప్రభుత్వంగా వివరించారు.ఎవరికీ దక్కని విధంగా మనకు అవకాశాలు, విజయాలు దక్కాయన్నారు. జగన్ ను నమ్మిన వారు..వైసీపీలో ఉన్నవారు..పార్టీ కోసం కష్టపడిన వారికి అంచెలంచలుగా ఏ పార్టీలోని ఇవ్వని అవకాశాలు లేని విధంగా ఇచ్చిందని చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల్లోనూ ప్రజలు ఇంతకంటే ఆదరిస్తారని జగన్ ధీమా వ్యక్తం చేసారు.












Click it and Unblock the Notifications