టీటీడీకి సుబ్బారెడ్డి స్థానంలో కొత్ ఛైర్మన్ - ఆ ఇద్దరిలో దక్కేదెవరికి..!?

ప్రసిద్ద పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం కు కొత్త పాలక మండలి రానుంది. ప్రస్తుతం ఛైర్మన్ గా ఉన్న సుబ్బారెడ్డి సేవలను ఇక పార్టీకి పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సీఎం భావిస్తున్నారు. కీలకమైన ఉత్తరాంధ్ర బాధ్యతలను సుబ్బారెడ్డి ఎన్నికల వరకు పూర్తి స్థాయిలో నిర్వహించనున్నారు. దీంతో, ప్రస్తుతం సుబ్బారెడ్డి నిర్వహిస్తున్న టీటీడీ ఛైర్మన్ పదవిలో కొత్త వారికి అవకాశం ఇవ్వనున్నారు. కీలకమైన హోదా కావటంతో పలువురు సీనియర్లు ఈ పదవిని ఆశిసున్నారు. అందులో ఇద్దరి పేర్లు తుది పరిశీలనలో ఉన్నాయి. సీఎం జగన్ వీరిలో ఎవరికి అవకాశం ఇస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

సుబ్బారెడ్డి సేవలు ఇక పార్టీ కోసం...

సుబ్బారెడ్డి సేవలు ఇక పార్టీ కోసం...

ఏపీలో వైసీపీ ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన తరువాత టీటీడీ ఛైర్మన్ గా బాబాయ్ సుబ్బారెడ్డికి జగన్ అవకాశం కల్పించారు. రెండేళ్ల పదవీ కాలం తరువాత కొంత గ్యాప్ వచ్చినా..తిరిగి సుబ్బారెడ్డి మరో రెండేళ్ల పాటు ఆయనే తిరిగి ఛాన్స్ వచ్చింది. ఈ ఏడాది జూన్ తో ఆయన పదవీ కాలం ముగియనుంది. సుబ్బారెడ్డి ప్రస్తుతం వైసీపీ ఉత్తరాంధ్ర ఇంఛార్జ్ గా ఉన్నారు. మూడు రాజధానుల వ్యవహారం.. ఉత్తరాంధ్ర పైన ప్రతిపక్ష పార్టీలు కొత్త వ్యూహాలతో పట్టు పెంచుకొనే అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలో ఆ ప్రాంతం పైన ఎన్నికల వేళ మరింతగా ఫోకస్ చేయాలని సీఎం జగన్ సూచించారు. అందులో భాగంగా.. ఎన్నికల వరకు టీటీడీ ఛైర్మన్ బాధ్యతలను మరో నేతకు అప్పగించే విధంగా సూత్రప్రాయంగా నిర్ణయం జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల ఛైర్మన్ పదవి కోసం సీనియర్లు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సుబ్బారెడ్డికే అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఎవరికి దక్కుతుందనేది ఆసక్తిని పెంచుతోంది.
సీఎం ను కలిసిన భూమన.. హామీ దక్కిందా..

సీఎం ను కలిసిన భూమన.. హామీ దక్కిందా..

టీటీడీ ఛైర్మన్ గా సుబ్బారెడ్డికి రెండో సారి రెన్యువల్ సమయంలోనే తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి పేరు ప్రచారంలోకి వచ్చింది. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కరుణాకర రెడ్డి టీటీడీ ఛైర్మన్ గా పని చేసారు. ఆ సమయంలో పలు కీలక నిర్ణయాలు అమలు చేసారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలోనూ తిరిగి స్వామి సేవ ప్రధమ సేవకుడిగా పని చేయాలని భూమన ఆశించారు. టీటీడీ ఛైర్మన్ మార్పు అంశం చర్చల వేళ..తాడేపల్లికి వచ్చిన కరుణాకర రెడ్డి ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. దీంతో..సుబ్బారెడ్డి తరువాత కరుణాకర రెడ్డికి అవకాశం దక్కుతుందనే ప్రచారం మొదలైంది. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో తిరుపతి నుంచి తన కుమారుడికి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని సీఎంను కరుణాకరరెడ్డి కోరుతున్నారు. కానీ, ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ.. ముఖ్యమంత్రి సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం.
ఆ ఇద్దరిలో ఒకరికి ఛాన్స్..!

ఆ ఇద్దరిలో ఒకరికి ఛాన్స్..!


ముఖ్యమంత్రి జగన్ పరిశీలనలో తుది జాబితాలో ఇద్దరి పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ ఎంపీ మేకపాటి పేరు తెర మీదకు వచ్చింది. వైఎస్ కుటుంబంతో ఉన్న అనుబంధం.. జగన్ పార్టీ ఏర్పాటు సమయం నుంచి తోడుగా నిలబడిన నేత కావటంత ఆయనకు అవకాశం ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం సమయంలోనూ ఆ కుటుంబానికి అండగా ఉంటానని సీఎం జగన్ హామీ ఇచ్చారు. మేకపాటి విక్రమ్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో, మేకపాటి రాజమోహన్ రెడ్డి కి టీటీడీ అవకాశం దక్కుతుందా లేదా అనేది చర్చ సాగుతోంది. ఇక, ఈ సారి టీటీడీ ఛైర్మన్ గా బీసీ వర్గానికి అవకాశం ఇవ్వాలని సీఎం ఆలోచనగా తెలుస్తోంది. బీసీ వర్గానికి ఇస్తే జంగా కృష్ణమూర్తి కి ఖరారు కానుంది. గతంలో టీడీపీ హయాంలోనూ బీసీ వర్గానికి అవకాశం దక్కింది. దీంతో..ఇప్పుడు సీఎం జగన్ ఈ ఇద్దరి లో ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తిగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+