ఢిల్లీ టు అమరావతి లెక్క క్లియర్ - సీఎం జగన్ నో కాంప్రమైజ్, తాజాగా..!!
వై నాట్ 175. ముఖ్యమంత్రి జగన్ నినాదం ఇదే. జగన్ ఓటమే లక్ష్యంగా టీడీపీ, జనసేన ఒక్కటయ్యాయి. బీజేపీ వైఖరి పైన స్పష్టత రావాల్సి ఉంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన జరిగింది. చంద్రబాబు అరెస్ట్..పొత్తులతో వైసీపీ టార్గెట్ రాజకీయం నడుస్తోంది. కానీ, ముఖ్యమంత్రి నో కాంప్రమైజ్ అంటున్నారు. ఎన్నికల సమరశంఖం పూరించేందుకు సిద్దమయ్యారు. పార్టీ నేతల సమక్షంలో కీలక నిర్ణయాలకు సిద్దమయ్యారు.
మారుతున్న సమీకరణాలు : చంద్రబాబు అరెస్ట్ తరువాత ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. టీడీపీ, జనసేన పొత్తు ఖాయమైంది. రెండు పార్టీలు సీఎం జగన్ ఓటమి లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి. ఇందు కోసం బీజేపీ కూడా తమతో కలిసి రావాలని కోరుకుంటున్నాయి. తమతో మైత్రి కొనసాగిస్తూ టీడీపీతో పవన్ పొత్తు ప్రకటపైన బీజేపీ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.

దీంతో, తన ప్రకటన వెనుక కారణాలను వివరిస్తానంటూ పవన్ ఒక విధంగా నచ్చ చెప్పే ప్రయత్నం ప్రారంభించారు. అటు చంద్రబాబు కేసులపైన కోర్టులో విచారణ సాగుతోంది. అరెస్ట్ అక్రమం..రాజకీయ వేధింపులు అంటూ టీడీపీ ప్రచారం చేస్తోంది. చంద్రబాబు అరెస్ట్ ఎన్నికల వేళ తమకు కలిసి వస్తుందని అంచనా వేస్తోంది.
సీఎం జగన్ కీలక సమావేశం : పొత్తులు...సానుభూతి లెక్కలతో ప్రతిపక్షాలు ఎన్నికల ఫలితాలపైన నమ్మకం పెట్టుకున్నాయి. ఈ సమయంలో ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ నుంచి అమరావతి వరకు చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు.. తెర చాటు లెక్కలపైన ఫోకస్ చేసారు. ఎవరెవరు కలిసినా తన ఓట్ బ్యాంక్ పైనే గురి పెట్టారు. రాష్ట్రంలో 87 శాతం మందికి అందుతున్న సంక్షేమం తిరిగి తనకు అధికారం నిలబెడుతుందనే నమ్మకంతో జగన్ ఉన్నారు.
ప్రతీ ఇంటికి మంచి జరిగితేనే తనకు మద్దతు నిలవాలని పిలుపునిస్తున్నారు. ఇదే సమయంలో ఓట్ బ్యాంక్ మరింత పెంచుకొనే వ్యూహాలు అమలు చేస్తున్నారు. ప్రతీ ఇంటికి పార్టీ నేతలను దగ్గర చేసే కార్యాచరణ వేగవంతం చేసారు అందులో భాగంగా రేపు (9వ తేదీ, సోమవారం) పార్టీ నేతలతో ముఖ్యమంత్రి జగన్ కీలక సమావేశం ఏర్పాటు చేసారు.

వై నాట్ 175..నో కాంప్రమైజ్ : వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం పైన ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేయనున్నారు. అభివృద్ధి - సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి వెళ్లి వారి దీవెనలు పొందేందుకు పార్టీ కేడర్ కు ముఖ్యమంత్రి రూట్ మ్యాప్ ఫిక్స్ చేయనున్నట్లు తెలు్తోంది. దాదాపు 8 వేల మందికి పైగా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ వారితో మమేకం అవ్వటంతో పాటుగా చంద్రబాబు అరెస్ట్..అవినీతి పైన ప్రతిపక్షాల ప్రచారాన్ని తిప్పి కొట్టేలా కొత్త కార్యాచరణ సిద్దం చేస్తున్నారు.
స్కిల్ స్కాంలో చంద్రబాబు 13 చోట్ల సంతాలు చేసిన అంశాన్ని వివరించాలని భావిస్తున్నారు. దీని ద్వారా ఎన్నికల్లోగా ఢిల్లీ టు గల్లీ రాజకీయం ఎలా మారినా...తన నమ్ముకున్న ఓట్ బ్యాంక్ తో ఎన్నికల కరుక్షేత్రానికి సిద్దమవుతున్న జగన్ వై నాట్ 175 లో మాత్రం నో కాంప్రమైజ్ అంటున్నారు. దీంతో, ఈ కీలక సమావేశంలో జగన్ ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications