వైసీపీలో ఆ ఎమ్మెల్యేలకు ముగిసిన గడువు : సర్వే రిపోర్ట్స్ రెడీ..!!
ముఖ్యమంత్రి జగన్ ఎమ్మెల్యేల పని తీరు మెరుగు పర్చుకోవటానికి ఇచ్చిన సమయం ముగిసింది. తాజా నివేదకలు సిద్దమయ్యాయి
ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల కసరత్తు వేగం పెంచారు. పార్టీ నేతలకు టార్గెట్ ఫిక్స్ చేస్తున్నారు. వై నాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి..పార్టీ నేతలకు కొత్త రోడ్ మ్యాప్ సిద్దం చేసారు. ఈ నెలాఖరు లోగా డిసైడ్ చేసిన షెడ్యూల్ పూర్తి చేయాల్సిందేనని పార్టీ ఆదేశించింది. వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఏప్రిల్ నుంచి అటు పాలన - ఇటు పార్టీ పరంగా కొత్త నిర్ణయాల అమలు దిశగా సీఎం నిర్ణయాలు ఉండనున్నాయి. ఈ నెల 13న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక భేటీ ఏర్పాటు చేసారు. ఇప్పటికే ఎమ్మెల్యేల పని తీరు మెరుగు పర్చుకోవటానికి ఇచ్చిన సమయం ముగిసింది. ఈ భేటీలో ఎంత మంది పాస్ అయ్యారనేది తాజా నివేదికలు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.

నేటితో ముగియనున్న గడువు
ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తున్నారు. పార్టీ నేతలంతా ప్రజల్లోనే ఉండేలా ప్రణాళికలు సిద్దం చేసారు. ఇప్పటికే గడప గడపకు ప్రభుత్వం పేరుతో ప్రతీ ఇంటికి పార్టీ నేతలను పంపారు. ఇందులో వెనుకబడి ఉన్న నేతలకు క్లాస్ తీసుకున్నారు. వారి పని తీరు మెరుగు పర్చుకొనేందుకు అవకాశం ఇచ్చారు. సీఎం హెచ్చరికలతో ఆ నేతలంతా ఇప్పుడు గడప గడపకు కార్యక్రమం లో పాల్గొంటున్నారు. ఈ నెల 13న ముఖ్యమంత్రి జగన్ మంత్రులు...ఎమ్మెల్యేలు.. పార్టీ నియోకవర్గ పరిశీలకులతో సమావేశం కానున్నారు. అందులో ఎమ్మెల్యేల పనితీరు.. గడపగపడకు ప్రభుత్వం నిర్వహణ పైన తాజా సర్వే నివేదికలను వెల్లడించే అవకాశం ఉంది. ఆరు నెలల ముందుగానే అభ్యర్ధులను ప్రకటిస్తానని స్పష్టం చేసిన సీఎం..సర్వే రిపోర్టుల ఆధారంగా ఎమ్మెల్యేకు ఏం చెబుతారనేది ఆసక్తి కరంగా మారుతోంది. ఈ భేటీలోనే ఎమ్మెల్యేలకు కొత్త బాధ్యతలు అప్పగించేందుకు సిద్దమయ్యారు.
ఎమ్మెల్యేలకు కొత్త టాస్క్ - షెడ్యూల్ ఫిక్స్
గత సమావేశంలోనే ముఖ్యమంత్రి గృహ సారథుల నియామకం గురించి దిశా నిర్దేశం చేసారు. ఆ తరువాత పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంలోనూ ఈ అంశం పై క్లారిటీ ఇచ్చారు. పార్టీ విధించిన గడువు ఈ రోజుతో ముగుస్తోంది. ఈనెల 10 నుంచి 28 వరకు విస్తృత కార్యక్రమాలు నిర్వహించేలా పార్టీ నిర్ణయం చేసింది. 13న జరిగే సమావేశంలో ఎమ్మెల్యేల ప్రోగ్రస్ కార్డులతో పాటుగా కొత్త కార్యక్రమాల పైన సీఎం జగన్ దిశా నిర్దేశం చేయనున్నారు. 'జగనన్నే మా భవిష్యత్తు' ప్రచార కార్యక్రమం పైన ఎమ్మెల్యేకు సూచనలు చేయనున్నారు. ఈ నెల 14 నుంచి 19వరకు ఈ కార్యక్రమం పైన వాలంటీర్లకు శిక్షణా కార్యక్రమం చేపట్టనున్నారు. 20న 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకకాలంలో 'జగనన్నే మా భవిష్యత్తు' ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. 20 నుంచి 27 వరకు 'జగనన్నే మా భవిష్యత్తు' ప్రచార కార్యక్రమాన్ని నియోజకవర్గ పరిధిలోని అన్ని ఇళ్లలో వంద శాతం పూర్తి చేయాలని పార్టీ నిర్ణయించింది.

నియోజకవర్గాల వారీగా సమీక్షలు
ఇప్పటికే సీఎం జగన్ కొన్ని నియోజకవర్గాల సమీక్షలు పూర్తి చేసారు. అందులో ముందుగా టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో సమీక్షలు చేసారు. అక్కడ అభ్యర్ధులను ఖరారు చేసారు. కొన్ని నియోజకవర్గాల్లో వివాదాల పరిష్కారంలో భాగంగా నిర్ణయాలు ప్రకటించారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా మైలవరం నియోజకవర్గంలోని నేతల మధ్య సమస్య ఉండటంతో నేరుగా సీఎం జోక్యం చేసుకొని పరిష్కరించారు. ఇక.. మిగిలిన నియోకవర్గాల విషయంలోనూ సమీక్షలు వేగవంతం చేయాలని భావిస్తున్నారు. మార్చి 6వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ సమావేశాల సమయంలోనే నియోజకవర్గాల సమీక్ష నిర్వహించాలని ఆలోచన చేస్తున్నారు. దీంతో..ఎన్నికల కసరత్తు వేళ ముఖ్యమంత్రి ఎటువంటి నిర్ణయాలు ప్రకటిస్తారనేది పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ పెంచుతోంది.












Click it and Unblock the Notifications