వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్టీ ముఖ్య నేతలకు సీఎం జగన్ పిలుపు - కీలక నిర్ణయం దిశగా..!!

పార్టీ ముఖ్య నేతలతో సీఎం జగన్ భేటీ కానున్నారు. కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.

|
Google Oneindia TeluguNews

ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ వ్యవహారాలతో పాటుగా పార్టీ పైన ఫోకస్ పెట్టారు. పార్టీ ముఖ్య నేతలకు సీఎం నుంచి పిలుపు అందింది. కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రత్యర్ధి పార్టీల పొత్తులపైన స్పందించిన జగన్ తాను సింహం లాగా సింగిల్ గానే పోరాడుతానని ప్రకటించారు. పార్టీకి కంచుకోట లాంటి జిల్లాల్లో కొందరు ఎమ్మెల్యే తీరు పైన సీఎం జగన్ ఆగ్రహంగా ఉన్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్యేల పనితీరు పైన సర్వే నివేదికలు..క్షేత్ర స్థాయి రిపోర్టులను సీఎం సిద్దం చేసుకున్నారు. ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్దులను ప్రకటిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి..ఇప్పుడు పార్టీ కీలక నేతల భేటీలో ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

పార్టీ నేతలతో సీఎం జగన్ సమావేశం

పార్టీ నేతలతో సీఎం జగన్ సమావేశం

ప్రస్తుతం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం జగన్ రెండు రోజులు ఢిల్లీలోనే ఉండనున్నారు. అక్కడ ఖరారు అయిన కార్యక్రమాలకు హాజరవుతారు. ఫిబ్రవరి 2వ తేదీన పార్టీ రీజనల్ ఇంఛార్జ్ లతో సమావేశం కావాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. అందులో ప్రధానంగా గడప గడపకు ప్రభుత్వంలో భాగంగా ఎమ్మెల్యేల గ్రాఫ్ పైన నివేదికలు సిద్దమయ్యాయి. గత సమావేశంలో హెచ్చరించిన ఎమ్మెల్యేల పని తీరులో వచ్చిన మార్పుల పైన చర్చించే అవకాశం ఉంది. అదే సమయంలో నెల్లూరు జిల్లా లాంటి పార్టీకి బలమైన జిల్లాల్లో కొందరు ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేసే విధంగా ఉన్నాయనే అభిప్రాయం ఉంది. ఇప్పటికే సీనియర్ నేత ఆనం పైన చర్యలు మొదలయ్యాయి. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఎమ్మెల్యేలు - పార్టీ నేతల తీరు పైన సీఎం ఆగ్రహం ఉన్నట్లు సమాచారం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఎవరు పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించినా సహించేది లేదని పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న రీజనల్ ఇంఛార్జ్ ల ద్వారా సీఎం స్పష్టం చేయనున్నట్లు తెలుస్తోంది.

పొత్తుల వేళ మరింత అప్రమత్తంగా..

పొత్తుల వేళ మరింత అప్రమత్తంగా..


ఏపీలో టీడీపీ - జనసేన పొత్తు దాదాపు ఖాయమైంది. వైసీపీ ముందు నుంచి ఈ రెండు పార్టీలు కలుస్తాయని చెబుతోంది. ఇదే సమయంలో వైసీపీ..సీఎం జగన్ లక్ష్యంగా ఈ పొత్తులతో ఎన్నికల్లో ఆ పార్టీలు దిగుతున్నాయి. సామాజిక - ప్రాంతీయ సమీకరణాల్లో జగన్ కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. అందులో పార్టీ సీనియర్ల సేవలను సమర్ధవంతంగా వినియోగించుకోవాలని నిర్ణయించారు. పార్టీ రీజనల్ కో ఆర్డి నేటర్ల పని తీరు పైన సమీక్షించటంతో పాటుగా జిల్లా అధ్యక్షులు - ఎమ్మెల్యేలతో నిరంతరం మానిటరింగ్..తీసుకోవాల్సిన నిర్ణయాల పైన ముఖ్యమంత్రి వారికి దిశా నిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలో 87 శాతం మందికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం చేరుతున్న వేళ.. పార్టీ నేతలు దానిని ఓట్లుగా మలచుకోలేకపోతే వైఫల్యంగా పరిగణించాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. దీని కోసం రీజనల్ కో ఆర్డినేటర్లు ఎమ్మెల్యేతో కలిసి నియోజకవర్గాల్లోకి వెళ్లే విధంగా సూచనలు చేస్తారని సమాచారం.

కన్వీనర్లు - గృహ సారథుల నియామకం

కన్వీనర్లు - గృహ సారథుల నియామకం


రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోకవర్గాల్లో ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు చొప్పున 15 వేల గ్రామాల్లో 5.20 లక్షల మందిని పార్టీ తరఫున గృహ సారథులుగా నియమించాలని గతంలోనే ముఖ్యమంత్రి ఆదేశించారు. గృహ సారథులు కూడా అదే క్లస్టర్‌కు చెందిన వారై ఉండాలన్నారు. వీరు బూత్‌ కమిటీలలో సభ్యులుగా కూడా ఉంటారని సీఎం జగన్ తెలిపారు. దీని ద్వారా ప్రతీ ఇంటి నుంచి సత్సంబంధాలు నెలకొల్పటమే దీని ప్రధాన ఉద్దేశం. అయితే, ఇప్పటికీ కన్వీనర్లు..గృహ సారథుల నియామకం పూర్తి కాలేదు. ఇప్పుడు పార్టీ రీజనల్ ఇంఛార్జ్ ల సమావేశంలో ముఖ్యమంత్రి వీరి నియామకానికి సంబంధించి ఆరా తీయటంతో పాటుగా డెడ్ లైన్ ఫిక్స్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక..ఈ సమావేశం ద్వారా సీఎం జగన్ ఎటువంటి కార్యాచరణ ఖరారు చేస్తారనేది పార్టీలో ఆసక్తి గా మారుతోంది.

English summary
CM Jagan to Decided to hold meeting with party regional co ordinators on present political situation and future action plan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X