ద్వారంపూడిపై పవన్ సవాల్ - కాకినాడ కేంద్రంగా జగన్ కీలక నిర్ణయం...!!
ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. సీఎం జగన్ పలు నియోజకవర్గాల్లో ఇంఛార్జ్ లను మారుస్తున్నారు. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అటు టీడీపీ, జనసేన పొత్తుతో జగన్ ఓటమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాయి. గోదావరి జిల్లాల కేంద్రంగా ఈ సారి గెలుపు , ఓటమలు డిసైడ్ కానున్నాయి. పవన్ కాకినాడ కేంద్రంగా ద్వారంపూడిని ఓడిస్తానని శపథం చేసారు, ఇప్పుడు కాకినాడలో సీఎం జగన్ అడుగు పెడుతున్నారు.
కాకినాడలో హోరా హోరీ
జనసేనాని పవన్ కల్యాణ్ ప్రస్తుతం కాకినాడలో మకాం వేసారు. గోదావరి జిల్లాల్లో నియోజకవర్గాల సమీక్ష చేస్తున్నారు. వారాహి యాత్ర సమయంలో కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడిని పవన్ టార్గెట్ చేసారు. వచ్చే ఎన్నికల్లో ద్వారంపూడిని గెలవనీయనని పవన్ శపథం చేసారు. దీనికి ద్వారంపూడి సై అన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల వేళ కాకినాడకు వస్తున్నారు.

ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు వైఎస్సార్ పెన్షన్ కానుక రూ 3వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. జనవరి 1నుంచి పెరిగిన పెన్షన్ పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ కాకినాడ కేంద్రంగా ప్రారంభించాలని నిర్ణయించారు. ఇదే సమయంలో మరిన్ని అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.
సీఎం జగన్ పర్యటన
ముఖ్యమంత్రి జగన్ వచ్చే ఎన్నికల్లో గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. గోదావరి జిల్లాల్లొ కొత్త సమీకరణాలతో ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో దశలవారీగా పింఛన్ సొమ్మును పెంచుతామని ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుతం ఉన్న రూ.2750 నుంచి రూ.3,000కు పెంచే కార్యక్రమాన్ని కాకినాడలో ప్రారంభించనున్నారు. ), రూ 20 కోట్లతో నిర్మించిన రాగిరెడ్డి కళాక్షేత్రం, రూ.7 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన స్కేటింగ్ రింక్‌ను కూడా సీఎం ప్రారంభిస్తారు. కాకినాడలో జరిగే సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఉభయ గోదావరి జిల్లాల్లో సిట్టింగ్ ల్లో కొందరి స్థానాల మార్పుకు జగన్ నిర్ణయించారు. కాకినాడ సీటు సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడిని కొనసాగించిటం ఖాయంగా కనిపిస్తోంది.
ఎన్నికల సమరం
ఇక, కొద్ది నెలల క్రితం పవన్ కల్యాణ్ కాకినాడ వేదికగా ద్వారంపూడిని గెలవనీయనంటూ సవాల్ చేసారు. ఆ సమయంలో ద్వారంపూడి వర్సస్ పవన్ మాటల యుద్దం జరిగింది. ఈ సారి ఎన్నికల్లో కాకినాడ సిటీ నుంచి జనసేన అభ్యర్దిగా ముత్తా శశిధర్, కాకినాడ ఎంపీ అభ్యర్దిగా జనసేన నుంచి తోట సుధీర్ పోటీ చేస్తారని చెబుతున్నారు.
వైసీపీ కాకినాడ సిట్టింగ్ ఎమ్మెల్యే వంగా గీతను ఈ సారి పిఠాపురం అసెంబ్లీ నుంచి పోటీకి దింపాలని నిర్ణయించారు. కాకినాడ ఎంపీ అభ్యర్దిని అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది. దీంతో..కాకినాడ వేదికగా ముఖ్యమంత్రి జగన్ వచ్చే ఎన్నికల్లో గెలుపు పైన దిశా నిర్దేశం చేయటంతో పాటుగా కొత్త సంవత్సరం తొలి సభా వేదికగా ఎన్నికల సమరశంఖం పూరించేందుకు సిద్దమవుతున్నారు.












Click it and Unblock the Notifications