• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం జగన్ మద్దతే కీలకంగా - ఢిల్లీ పర్యటన అజెండా ఇదే : కేంద్రం వద్ద పట్టు బిగిస్తారా..!!

|
Google Oneindia TeluguNews

ఏపీ రాకీయాలు హటెక్కుతున్న వేళ..సీఎం జగన్ ఢిల్లీ పర్యటన కీలకంగా మారింది. మూడేళ్ల పాలన పూర్తి చేసుకున్న సీఎం జగన్..ఢిల్లీ నుంచి వచ్చిన సమాచారంతో హస్తినకు పయనమవుతున్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి అవసరమైన ప్రతీ సందర్భంలో అండగా నిలుస్తున్న వైసీపీ అధినేత జగన్ ..ఇప్పుడు మరోసారి మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వంలోని ముఖ్యులు ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నిక పైన ఫోకస్ పెట్టారు. గతంలో ఎన్టీఏ ప్రతిపాదించిన రాష్ట్రపతి - ఉప రాష్ట్రపతి అభ్యర్ధులకే జగన్ మద్దతుగా నిలిచారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో మారుతున్న సమీకరణాల్లో రాష్ట్రపతి ఎన్నికకు ప్రతిపక్షా ల నుంచి అభ్యర్ధిని నిలబెట్టటం ఖాయంగా కనిపిస్తోంది.

కీలకంగా మారిన వైసీపీ మద్దతు

కీలకంగా మారిన వైసీపీ మద్దతు

రాష్ట్రపతిని ఎన్నుకొనే ఎలక్టోరల్ ఓట్లలో కావాల్సిన దాని కంటే కొద్ది దూరం తేడాతో ఎన్టీఏ నిలిచింది. ఎన్‌డీయేతర పక్షాలకు 51 శాతం మెజారిటీ ఉంది. దీంతో.. రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్‌డీఏ అభ్యర్థి విజయం సాధించాలంటే వైసీపీ మద్దతు ఇస్తే..ఎన్టీఏ సులభంగా తమ అభ్యర్ధిని గెలిపించుకుంటుంది. ఇదే అంశం ప్రధాన అజెండాగా ఈ రోజున ఢిల్లీ పర్యటనలో సీఎం జగన్ - ప్రధాని మధ్య చర్చ జరగనుంది. రాష్ట్రపతి - ఉప రాష్ట్రపతి అభ్యర్ధులుగా తమ ప్రతిపాదనలు - మద్దతు అంశం పైన వీరిద్దరి మధ్య చర్చ జరగనుంది. దీంతో పాటుగా జూలై 4న ప్రధాని మోదీ ఏపీ పర్యటనకు రానున్నారు. దీంతో..అదే రోజున ప్రధాని చేతులగా మీదుగా కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించేలా ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం.

ప్రధానితో ఏపీ అంశాలపై చర్చలు

ప్రధానితో ఏపీ అంశాలపై చర్చలు

అయితే, ఇప్పటి వరకు అన్నింటా బేషరతుగా మద్దతిస్తూ వచ్చిన సీఎం జగన్ కు ఇప్పుడు ఏపీలో తన ప్రభుత్వం బలంగా మారాలంటే కేంద్రం నుంచి కొన్ని అంశాల్లో మద్దతు అవసరంగా మారింది. వీటిని ఇప్పటికే పలుమార్లు ప్రధానికి వినితి రూపంలో ఇచ్చినా.. ఆశించిన స్పందన రాలేదు. కానీ, ఈ సారి మాత్రం పట్టు బట్టేందుకు ముఖ్యమంత్రి జగన్ డిసైడ్ అయ్యారనే వాదన అధికార పార్టీలో బలంగా వినిపిస్తోంది. ప్రత్యేక హోదా గురించి కేంద్రం నుంచి ప్రస్తుత పరిస్థితుల్లో సానుకూల స్పందన వచ్చే అవకాశం లేదు. పోలవరం విషయంలో సవరించిన అంచనాలు .. ప్రాజెక్టు పెండింగ్ నిధులు.. విశాఖ ఉక్కు అంశంతో పాటుగా ప్రధానంగా రెవిన్యూ లోటు..అదే విధంగా రుణ పరిమితి పెంపుకు అనుమతి పైన ముఖ్యమంత్రి కేంద్రాన్ని కోరుతూ వస్తున్నారు.

పొత్తులు- వ్యూహాలపై షా తో కీలక భేటీ

పొత్తులు- వ్యూహాలపై షా తో కీలక భేటీ

వీటి పైన ప్రధాని నుంచి సానుకూల నిర్ణయం వచ్చేలా ఈ సారి సీఎం వ్యవహరించబోతున్నారనేది పార్టీ నేతలు చెబుతున్నారు. అదే విధంగా.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీలో ఏపీలో రాజకీయ పరిస్థితులు.. పొత్తుల అంశం పైన చర్చించనున్నారు. తాజాగా కోనసీమలో చోటు చేసుకున్న పరిణామాలు .. పొత్తులు - సమీకరణాల పైన వీరిద్దరి మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక, వచ్చే నెల నుంచి పూర్తిగా ప్రజల్లోనే ఉండాలని భావిస్తున్న సీఎం జగన్.. ఇప్పటి వరకు తాను కేంద్రానికి మద్దతుగా నిలిచానని.. ఇప్పుడు కేంద్రం నుంచి ఏపీకి పాలనా పరమైన వ్యవహారాల్లో మద్దతు అవసరమని తన వాదన వినిపించేందుకు సిద్దమయ్యారు. దీంతో..ఈ సారి ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.


English summary
CM to meet with PM Modi in Delhi to day discussions on president elections and AP state administrative and political issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X