Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రతిపక్షాలపై సీఎం జగన్ తాజా అస్త్రం - విశాఖ కేంద్రంగా, ఇక మొదలు..!!

ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన తరువాత ఎన్నికల ప్రణాళికల అమలు మొదలు పెడుతున్నారు. ఈ నెల 9న పార్టీ నేతలతో ముఖ్యమంత్రి జగన్ కీలక సమావేశం ఏర్పాటు చేసారు. ఇక..దసరా నుంచి విశాఖ కేంద్రంగా పాలన ప్రారంభించేందుకు జగన్ సిద్దమయ్యారు. ఈ సమయంలోనే ఈ నెల 16న విశాఖ కేంద్రంగా సీఎం జగన్ ముఖ్య కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.

విశాఖకు సీఎం జగన్: ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల సమరశంఖం పూరించేందుకు సిద్దమయ్యారు. ఏపీ వై నీడ్స్ జగన్ అనే కార్యక్రమం ద్వారా ఈ నెల 11వ తేదీ నుంచి ప్రతీ ఇంటికి పార్టీ శ్రేణులు వెళ్లేలా కార్యాచరణ సిద్దం చేసారు ఈ నెల 9న జరిగే సమావేశంలో ఈ మేరకు దిశా నిర్దేశం చేయనున్నారు.

CM Jagan to perform Bhoomi pooja for his camp office in Vizag on 16th october

ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ది దారుల్లో ఎవరైనా అర్హత ఉండి అందకుంటే వారికీ అమలయ్యేలా అధికారులకు ఇప్పటికే సూచనలు చేసారు. దీని ద్వారా తమకు మరోసారి అధికారం అందిస్తుందని నమ్ముకున్న సంక్షేమ ఓట్ బ్యాంక ను మరింత పెంచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమయంలో విశాఖ కేంద్రంగా ప్రతిపక్షాలను కౌంటర్ చేసేందుకు సీఎం సిద్దమయ్యారు.

ఓట్ బ్యాంక్ పై గురి: విశాఖ లో అభివృద్ధి...పాలన ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతంలో పూర్తి పట్టు సాధించేలా సీఎం జగన్ కొత్త అస్త్రం సంధిస్తున్నారు. అందులో భాగంగా విశాఖలో ఈ నెల 16న ముఖ్యమంత్రి ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అదే సమయంలో విశాఖలో ప్రారంభించే క్యాంపు కార్యాలయం కోసం భూమి పూజ చేయనున్నారు.

ముఖ్యమంత్రి పాలన ప్రారంభించేందుకు వీలుగా రుషికొండపై ఆరు బ్లాక్ లు పర్యాటక శాఖ సిద్దం చేస్తోంది. ఇందులో భాగంగా కళింగ బ్లాక్ కు సంబంధించి ముఖ్యమంత్రి జగన్ పూజ నిర్వహిస్తారు. దసరా నుంచి వారంలో రెండు రోజులు ముఖ్యమంత్రి జగన్ విశాఖ నుంచే పాలన చేసేలా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఆరు బ్లాకుల్లో ముందుగా రెండింటిని ఈ నెలలో అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం సాగుతోంది.

CM Jagan to perform Bhoomi pooja for his camp office in Vizag on 16th october

ఎన్నికల సమరశంఖం: ఇక. ఈ నెల 23 నుంచి విశాఖలో అధికారికంగా పాలన ప్రారంభం అవుతుందని చెబుతున్నారు. దీనికి సంబంధించి 16న పర్యటనలో సీఎం జగన్ స్పష్టత ఇవ్వనున్నారు. అధికారులు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక..రాజకీయంగానూ విశాఖ నుంచి ఎన్నికల సమర శంఖం పూరించేందుకు జగన్ సిద్దమయ్యారని తెలుస్తోంది.

వారంలో రెండు రోజులు జిల్లాల పర్యటనకు కేటాయించనున్నారు. అదే విధంగా పార్టీ పరిస్థితులు..అభ్యర్దుల ఎంపిక పైనా నియోజకవర్గాల్లోనే ముఖ్యమంత్రి ప్రకటనలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకొనేందుకు ముఖ్యమంత్రి సిద్దం అవుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+