వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వారి ఖాతాల్లో రూ.10వేల నగదు జమ - సీఎం జగన్ మార్క్ నిర్ణయం..!!

ముఖ్యమంత్రి జగన్ వినుకొండ వేదికగా జగనన్న చేదోడు మూడో విడత నిధులు విడుదల చేయనున్నారు.

|
Google Oneindia TeluguNews

ముఖ్యమంత్రి జగన్ తనం మార్క్ సంక్షేమం కొనసాగిస్తున్నారు. సీఎం జగన్ ఈ రోజు పల్నాడు జిల్లా వినుకొండలో పర్యటించనున్నారు. అక్కడ జరిగే జగనన్న చేదోడు కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 3,30,145 మందికి రూ 330.15 కోట్ల ఆర్దిక సాయాన్ని విడుదల చేయనున్నారు. దీని ద్వారా ఒక్కో లబ్ది దారుడుకు రూ 10 వేల చొప్పున ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ రోజు అందిస్తున్న సాయంతో ఈ పథకం ద్వారా మూడేళ్ల కాలంలో ఒక్కొక్కరికి రూ 30 వేల చొప్పున రూ 927.39 కోట్ల మేర లబ్ది చేకూరింది. ఇదే వేదిక నుంచి పాలనా - రాజకీయంగానూ సీఎం కీలక నిర్ణయాలు వెలువరించే ఛాన్స్ కనిపిస్తోంది.

మూడేళ్లుగా వారికి చేదుడుగా..

మూడేళ్లుగా వారికి చేదుడుగా..

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమంలో ముఖ్యమైన పథకం జనగన్న చేదోడు. షాపులున్న నాయీ బ్రాహ్మణులు..రజకులు..దర్జీలకు ఏటా రూ 10వేల చొప్పున ఆర్దిక సాయం ప్రభుత్వం అందిస్తోంది. ఈ రోజు అందుతున్న సాయంతో కలిపితే ఒక్కొక్కరికి రూ 30 వేల చొప్పున ప్రభుత్వం నుంచి ఆర్దిక సాయం అందినట్లు అవుతుంది. ఈ పథకాన్ని ప్రభుత్వం మూడేళ్లుగా అమలు చేస్తోంది. 2020-21 కాలంలో మొత్తం 2,98,122 మందికి రూ 298.12 కోట్లు అందించారు. అదే విధంగా 2021-22 కాలంలో 2,99,116 మంది రూ 299.12 కోట్ల మేర నిధులు విడుదల చేసారు. ఈ రోజు వినుకొండ వేదికగా జరుగుతున్న కార్యక్రమంలో సీఎం జగన్ మొత్తం మూడు లక్షల 30 వేల 145 మందికి రూ 330.15 కోట్లు నిధులు విడుదల చేయటంతో మొత్తంగా ఇప్పటి వరకు ఈ పథకం కింద రూ. 927.39 కోట్ల మేర లబ్ది చేకూరింది.

అర్హత ఉంటే మిస్ కాకుండా ఏర్పాట్లు

అర్హత ఉంటే మిస్ కాకుండా ఏర్పాట్లు

లంచాలకు ఎక్కడా తావు లేకుండా సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పథకాల నిర్వహణలో అవినీతి జరిగినట్లు ఇప్పటి వరకు ఎక్కడా ఎలాంటి ఆరోపణలు లేవు. పారదర్శకంగా గ్రామ సచివాలయాల్లో అర్హుల జాబితా ప్రదర్శిస్తున్నారు. సోషల్ ఆడిట్ నిర్వహించి లబ్దిదారుల ఎంపిక చేస్తున్నారు. అర్హత ఉన్న ఏ ఒక్కరూ మిస్ కాకూడదని ప్రభుత్వం అధికారులకు స్పష్టం చేస్తోంది. అర్హులై ఉండి జాబితాలో పేరు లేకపోతే వారి కోసం మరో అవకాశం కల్పిస్తోంది. ఏ కారణం చేతైనా పథకాల లబ్ది అందని వారి కోసం జూన్.. డిసెంబర్ మాసాల్లో లబ్దిని అందచేసేందుకు నిర్ణయించింది. ఇందుకోసం లబ్ది దారులు తమ పరిధిలోని సచివాలయంలో సంప్రదించాలి. అవసరమైన డాక్యుమెంట్లను అందించి పథకంలో భాగస్వాములు కావచ్చు. గత ఏడాది స్కీమ్ కింద లబ్ధి పొందిన వారు ప్రస్తుత ఏడాది కూడా వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

ఎవరికి ఎంత మేర లబ్ది కలిగిందంటే..

ఎవరికి ఎంత మేర లబ్ది కలిగిందంటే..

జగనన్న చేదోడు కింద ఈ మూడేళ్ల కాలంలో నాయితీ బ్రాహ్మణులు 47,533 మందికి రూ 47.53 కోట్ల మేర లబ్ది కలిగింది. అదే విధంగా షాపులున్న 1,67,951 మంది టైలర్లను రూ 167.95 కోట్లు అందించారు. ఇక, షాపులున్న 1,14,661 మంది రజకులకు రూ 114.67 కోట్ల మేర ప్రభుత్వం ఆర్దిక సాయం అందించింది. పల్నాడు జిల్లా వినుకొండ వెల్లటూరు రోడ్ లో ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ చేదోడు నిధులను విడుదల చేయనున్నారు. అక్కడే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రాజకీయంగా స్పందించే అవకాశం ఉంది. అదే సమయంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. పాలనా పరంగా అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించనున్నారు. ఈ సాయంత్రం సీఎం జగన్ రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.

English summary
CM Jagan to releae funds for Jagananna Chedou scheme Third phase at Vinukonda in Palnadu Dist.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X