సీఎం జగన్ గుడ్ న్యూస్, తల్లుల ఖాతాల్లోకి నిధులు - అర్హుల జాబితా సిద్దం..!!
ముఖ్యమంత్రి జగన్ తన సంక్షేమ పథకాలను క్యాలెండర్ ప్రకారం అమలు చేస్తున్నారు. మరో అయిదు నెలల్లో ఎన్నికలు వస్తుండటంతో రాకీయంగా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. సంక్షేమ ఓట్ బ్యాంకు ను నమ్ముకున్న జగన్ పార్టీ శ్రేణులను ప్రజల్లోనే ఉండాలని నిర్దేశించారు. ఇక, సంక్షేమ పథకాల క్యాలెండర్ ను యథావిధిగా అమలు చేయాలనీ డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా నవంబర్ 28న విద్యా దీవెన నిధుల విడుదల, నవంబర్ 30న కాల్యాణమస్తు షాదీ తోఫా నిధులను విడుదల చేయనున్నారు.
తల్లుల ఖాతాల్లో నిధులు : ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 28న విద్యా దీవెన నిధులు విడుదల చేయనున్నారు. విద్యార్థుల ఫీజు ఎంతైనా కూడా మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని సీఎం జగన్ హామీ ఇచ్చారు. అందులో భాగంగానే అర్హులైన విద్యార్థులందరికీ జగనన్న విద్యాదీవెన నిధులు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. పిల్లల చదువుల కోసం ఎవరూ అప్పుల పాలు కాకూడదని చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగా గత ప్రభుత్వం బకాయిలను కూడా ప్రస్తుత ప్రభుత్వమే చెల్లించింది. ఇక విద్యారంగలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. పిల్లల శిక్షణ కోసం మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం చేసుకున్నారు.

విద్యా రంగానికి ప్రాధాన్యత : అమ్మఒడి, వైఎస్సార్ సంపూర్ణ పోషణ, జగనన్న గోరుముద్ద, విద్యాకానుక, విద్యాదీవెన, మనబడి నాడు-నేడు, ఇంగ్లిష్ మీడియం, బైజూస్ తో ఒప్పందం లాంటివి అమలు చేస్తున్నారు. జగనన్న విద్యా దీవెన కింద హాస్టళ్లలో ఉంటూ చదువుకునే విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బందిపడకుండా ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున జగనన్న వసతి దీవెన పథకం ద్వారా ఆర్థిక సాయం అందిస్తోంది. తాజాగా విడుదల చేస్తున్న సాయంతో పాటు ఇప్పటివరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.15,593 కోట్లు ఖర్చుచేసింది.
విద్యా దీవెన నిధులు : మొత్తం మీద నాలుగేళ్లలో విద్యారంగంపై జగన్ ప్రభుత్వం దాదాపుగా రూ.69,289 కోట్లు ఖర్చుచేసినట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇక ఈ త్రైమాసికానికి సంబంధించిన నిధులను ఈ నెల 28న విద్యార్దుల తల్లుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 11 లక్షలకు పైగా తల్లుల కాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేయనున్నారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం..ఈ నెల 30న కాల్యాణమస్తు షాదీ తోఫా నిధులను విడుదల చేయనుంది.












Click it and Unblock the Notifications