ఎన్నికల వేళ మహిళల ఖాతాల్లొ సీఎం జగన్ నిధుల జమ- ముహూర్తం ఫిక్స్..!!

ఏపీలో ఎన్నికల వేళ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వై నాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్నారు. పార్టీ, ప్రభుత్వం పరంగా ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారు. ఇప్పటికే ఎన్నికల సమరశంఖం పూరించిన జగన్..ఇక ప్రజల్లోనే ఉండాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా సంక్షేమం - సామాజిక న్యాయం నినాదంగా ముందుకు వెళ్తున్నారు. ఈ సమయంలోనే ఇప్పటికే వరుస సంక్షేమ పథకాలకు నిధులు విడుదల చేస్తున్న జగన్..మహిళల ఖాతాల్లో మరో పథకం నిధులు జమకు ముహూర్తం ఖరారు చేసారు.

వరుస పథకాల అమలు
ఎన్నికల వేళ వరుసగా సంక్షేమ పథకాల అమలుకు సీఎం జగన్ నిర్ణయించారు. జనవరి 1న పెన్షన్ ను రూ 4వేలకు పెంపు అమలు ప్రారంభించారు. దీని ద్వారా 67 లక్షల మంది పెన్షనర్లకు లబ్ది అందుతోంది. ఈ నెలలోనే 23వ తేదీన వైఎస్సార్ ఆసరా పథకం నిధులు విడుదల చేసారు. ఈ పథకం కోసం ఇప్పటి వరకు రూ 25,570 కోట్లు ఖర్చు చేసారు. చివరి విడతగా రూ 6, 400 కోట్లు అందిస్తున్నారు. ఈ నెల 31వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ పథకం ద్వారా 78.94 లక్షల మంది మహిళలు లబ్ధి పొందుతున్నారు.

CM Jagan to release YSR Cheyutha Funds in 31 Lakh beneficiaries Accounts on 5th February

చేయూత నిధుల విడుదల
ఇక, ఫిబ్రవరి 5న వైఎస్సార్ చేయూత పథకం నిధుల విడుదలకు సీఎం జగన్ ముహూర్తంగా ఖరారు చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 లక్షల మందికి పైగా మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ది చేకూరుతోంది. ఫిబ్రవరి 5 నుంచి 14 వరకూ వైయస్సార్‌ చేయూత కార్యక్రమం జరుగుతుంది. ఈ పథకం కింద ఇప్పటివరకూ రూ.14,129 కోట్లు అందించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో అట్టడుకు వర్గాల్లో వారికి తోడుగా నిలిచేందుకు ఈ పథకం అమలు చేస్తున్నారు. 45 ఏళ్ల పైబడ్డ ఉన్న మహిళలకు ఏడాదికి రూ.18,750 ఈ పథకం ద్వారా అందిస్తున్నారు. ఈ పథకంలో ఇప్పటివరకు యూనిక్‌ లబ్ధిదారులు 31,23,466 మంది ఉన్నారు. ఈ సారి ఈ పథకం అమలు సమయంలో సీఎం జగన్ లబ్దిదారులకు రాసిన లేఖను అందించనున్నారు.

CM Jagan to release YSR Cheyutha Funds in 31 Lakh beneficiaries Accounts on 5th February

సీఎం జగన్ ఎన్నికల వరాలు
ఇక, ఈ నెల 31న ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సీఎం జగన్ ఎన్నికల వరాలను ఖరారు చేస్తారని అంచనా వేస్తున్నారు. ఉద్యోగులు, మహిళలు, రైతులు లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారని ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఫిబ్రవరి 6 నుంచి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. మంత్రివర్గ సమావేశం, అసెంబ్లీ సమావేశాల్లోనూ ఎన్నికల వేళ సీఎం జగన్ కొత్త వరాల పైన ప్రకటన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక, ఇటు భీమిలి వేదికగా ప్రారంభించిన సిద్దం సభలను ఫిబ్రవరి 3న ఏలూరు, తరువాత అనంతపురంలో నిర్వహించేలా నిర్ణయించారు. ఇప్పుడు మహిళల లక్ష్యంగా సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో భాగంగా చేయూత నిధులను విడుదలకు నిర్ణయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+