బంగరాం ధరల్లో అనూహ్య స్థిరత్వం
దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు నేడు అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. స్థిరత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి. అంతర్జాతీయంగా ఎదురవుతున్న వివిధ రకాల మిశ్రమ ఆర్థిక సంకేతాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల పరిణామాల కారణంగా వీటి రేట్లల్లో కదలికలు సంభవించలేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రిటైల్ కొనుగోళ్లను గమనిస్తే.. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,51,090 వద్ద ట్రేడ్ అవుతోంది.
అదే సమయంలో సాధారణ ఆభరణాల తయారీకి వినియోగించే ప్రతి 10 గ్రాములకు 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,38,490 వద్ద స్థిరంగా నిలిచింది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న అనిశ్చితి, అమెరికా డాలర్ విలువలో కనిపిస్తున్న హెచ్చుతగ్గుల వల్ల ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తోన్నారు. సాధారణంగా ఇటువంటి క్లిష్టమైన సమయాల్లో బంగారం సేఫ్ హెవెన్ గా మారుతున్నా, ఈ సారి తీవ్రమైన పెరుగుదల కనిపించట్లేదు.

దేశీయ మార్కెట్లలో మాత్రం రాబోయే శుభకార్యాలు, పెళ్లిళ్ల సీజన్ తదితర పండుగల సీజన్ డిమాండ్ కారణంగా స్థానికంగా కొనుగోళ్ళు వేగం పుంజుకుని మార్కెట్‌ను నిలకడగా ఉంచుతున్నాయి. వివిధ రకాల పారిశ్రామిక అవసరాలు వేగంగా పెరగడం, పెట్టుబడి దారులు వెండి వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా వెండికి మంచి డిమాండ్ ఏర్పడింది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా నగరాల్లో కేజీ వెండి ధర రూ.2,64,900 వద్ద స్థిరంగా రికార్డయింది. ఇక చెన్నై మార్కెట్లో వెండి కేజీ ధర రూ.2,74,900 వద్ద నమోదైంది.
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 15,338, 22 క్యారెట్లు - రూ. 14,060, 18 క్యారెట్లు - రూ. 11,770
ముంబై..
24 క్యారెట్లు - రూ. 15,110, 22 క్యారెట్లు- రూ. 13,850, 18 క్యారెట్లు - రూ. 11,332
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 15,110, 22 క్యారెట్లు- రూ. 13,850, 18 క్యారెట్లు - రూ. 11,332
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 15,110, 22 క్యారెట్లు- రూ. 13,850, 18 క్యారెట్లు - రూ. 11,332
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 15,110, 22 క్యారెట్లు- రూ. 13,850, 18 క్యారెట్లు - రూ. 11,332
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 15,110, 22 క్యారెట్లు- రూ. 13,850, 18 క్యారెట్లు - రూ. 11,332

Click it and Unblock the Notifications