Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎన్నికల వేళ సీఎం జగన్ మరో కీలక అడుగు - కేంద్రం మద్దతుతో..!!

ముఖ్యమంత్రి జగన్ ఎన్నికలకు సిద్దం అవుతున్నారు. అధికారం నిలబెట్టుకోవటం కోసం పార్టీ - పాలనా పరంగా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. సీఎం జగన్ కు ఎన్నికల వేళ కేంద్రం నుంచి అనూహ్య మద్దతు కనిపిస్తోంది. పెండింగ్ నిధులకు ఆమోదం తెలపటం ద్వారా సీఎం జగన్ కు ఆర్దికంగా వెసులుబాటు కలుగుతోంది. ఇదే సమయంలో ఏపీ జీవనాడి పోలవరం విషయంలోనూ ముఖ్యమంత్రి కీలక అడుగులు వేస్తున్నారు. కేంద్రం నుంచి రూ 17 వేల నిధుల విడుదలకు ఆమోదంతో వేగం పెంచారు.

కేంద్రం నుంచి పోలవరం నిధులు : ముఖ్యమంత్రి జగన్ సంక్షేమంతో పాటుగా పోలవరం ప్రాజెక్టు పైన ఫోకస్ చేసారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం కేంద్రమే పూర్తి చేయాల్సి ఉన్నా..నాటి చంద్రబాబు ప్రభుత్వం నీతి అయోగ్ ద్వారా ఆ బాధ్యతలను తీసుకుంది. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రాజెక్టు నిర్మాణంలో లోపాల గురించి పదే పదే ప్రస్తావించారు.

 jsjagan-

అదే సమయంలో పునారావాస ప్యాకేజీ..ప్రాజెక్టు సవరించిన అంచనాల ఆమోదం కోసం కేంద్రానికి పలు మార్లు కలిసి అభ్యర్ధించారు. తాజాగా ఢిల్లీ పర్యటనలో కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్ తో మరోసారి చర్చించారు. ఈ మేరకు జరిగిన పోలవరం తాజా సమీక్షలో ఏపీ ప్రభుత్వం సమర్పించిన సవరించిన అంచనాల్లో అడహక్ నిధుల కింద రూ 17 వేల కోట్ల వరకు విడుదలకు ఆమోద ముద్ర పడింది.

సీఎం జగన్ ప్రాజెక్టు సందర్శన : ఈ నిధులు విడుదలకు ఆమోదం లభించినట్లు అధికార వైసీపీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. బీజేపీ ఎంపీ జీవీఎల్ సైతం వచ్చే కేబినెట్ లో దీనికి అధికారికంగా ఆమోద ముద్ర వేస్తారని వెల్లడించారు. ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ కేంద్రం తీసుకున్న సానుకూల నిర్ణయంతో సీఎం జగన్ వేగం పెంచారు.

సీఎం జగన్ పోలవరం పర్యటనకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 6న పోలవరం ప్రాజెక్ట్‌ను జగన్ సందర్శించనున్నారు. పోలవరం ప్రాజెక్టు లోయర్, అప్పడర్ కాఫర్ డ్యామ్‌లను జగన్ పరిశీలించనున్నారు. అలాగే స్పిల్‌వే, ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ ప్రాంతాలను జగన్ సందర్శించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం ప్రాజెక్ట్ వద్ద జలవనరులశాఖ అధికారులు, ఇంజినీర్లతో జగన్ సమావేశం కానున్నారు.

 jaganmeeting6

ఎన్నికల వేళ కీలకంగా : ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన తరువాత పోలవరం ప్రాజెక్టుకు రావడం ఇది నాలుగో సారి. కేంద్రం నుంచి నిధుల విడుదల..ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ పర్యటనలో పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి గురించి తెలుసుకోనున్నారు. వేగంగా పనులు చేపట్టేలా అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.

ఇరిగేషన్‌ ఇంజనీర్లు, వివిధ శాఖల అధికారులతో ప్రాజెక్టు పనుల పురోగతి, పునరావాస కార్యక్రమాల అమలుపై సమీక్షిస్తారు. 2024 జూన్ లోగా ప్రాజెక్టు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని తాజా సమీక్షలో కేంద్ర మంత్రి షెకావత్ కోరారు. దీనికి అనుగుణంగా ముఖ్యమంత్రి ఈ సారి పర్యటనలో పోలవరం ప్రాజెక్టు పనుల పైన సమీక్షా సమయంలో నిర్మాణం పూర్తికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. పోలవరం వేగవంతం చేయటం ద్వారా రాజకీయంగానూ పైచేయి సాధించేందుకు ముఖ్యమంత్రి వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+