జగన్ గ్రౌండ్ లోకి దిగితే ఇలానే ఉంటది..!!

ఏపీలో ఎన్నికల వేళ సీఎం జగన్ కీలక నిర్ణయాలు అమలు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ అభ్యర్దుల కసరత్తు తుది దశకు చేరుకుంది. ఈ నెల 25 నుంచి ముఖ్యమంత్రి జగన్ జిల్లాల పర్యటనలకు సిద్దం అవుతున్నారు. వరుస సంక్షేమ పథకాల అమలుకు నిర్ణయించారు. ఇక, విజయవాడ కేంద్రంగా కొత్త చరిత్రకు సీఎం జగన్ శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర నలు మూలల నుంచి వచ్చిన జన సందోహం నడుమ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు

CM Jagan unveils the tallest Ambedkar statue, symbolizing social justice in Vijayawada

బెజవాడ నడిబొడ్డున
విజయవాడ నడి బొడ్డున సీఎం జగన్ ఎన్నికల వేళ కొత్త చరిత్ర ప్రారంభిస్తున్నారు. బెజవాడ స్వరాజ్య మైదానంలో భారతరత్న బాబాసాహెబ్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ స్మృతివనం ప్రారంభోత్సవం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించింది. చరిత్రలో నిలిచిపోయేలా సామాజిక న్యాయ మహాశిల్పం జాతికి అంకితమిచ్చే కార్యక్రమం కొనసాగుతోంది. 2021 డిసెంబర్ 21న ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసారు. స్మృతివనం పనులను మహాయజ్ఞంలా పూర్తిచేశారు. అత్యంత అందంగా తీర్చిదిద్దుతున్న ఈ ప్రాంగణం ప్రపంచస్థాయి పర్యాటకులను సైతం ఆకర్షించే వేదికగా మారనుంది. దేశంలో మతాతీతమైన విగ్రహాల్లో ఇదే అతిపెద్దది. 125 అడుగుల విగ్రహం, 81 అడుగుల బేస్ తో మొత్తం 206 అడుగుల విగ్రహం ఆవిష్కరణ పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నారు.

CM Jagan unveils the tallest Ambedkar statue, symbolizing social justice in Vijayawada

తరలి వచ్చిన జనసందోహం
ఈ రోజు ప్రారంభం తరువాత రేపటి నుంచి సందర్శకులను అనుమతించాలని నిర్ణయించారు. స్టాట్యూ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌ (సామాజిక న్యాయ మహా శిల్పం)ను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. 18.18 ఎకరాల్లో దాదాపు రూ.404.35 కోట్లతో పనులు చేపట్టారు. ఇందులో అందమైన గార్డెన్‌ను రూపొందించారు. ఎంఎస్‌ అసోసియేట్‌ సంస్థ డిజైన్లు రూపొందించింది. అంబేడ్కర్‌ విగ్రహం పనుల కోసం రూపొందించిన ప్రాజెక్టు పనులకు దేశీయ మెటీరియల్‌నే ఉపయోగించారు. ప్రత్యేకంగా అందమైన గార్డెన్, వాటర్‌ బాడీస్, మ్యూజికల్‌ ఫౌంటేన్లు, చిన్నపిల్లలు ఆడుకోవటానికి, వాకింగ్‌ చేసుకోవటానికి వీలుగా తీర్చిదిద్దారు. మొత్తం భవనాన్ని 30 మీటర్ల లోతులో.. 539 పిల్లర్లతో నిర్మించారు. ముందుభాగం కారిడార్‌ను 166 పిల్లర్లతో రూపొందించారు. దీనిని 388 మీటర్ల పొడవు, 4.5 మీటర్ల వెడల్పుతో రూపొందించారు.

రాష్ట్రానికే తల మానికంగా
ఇందులో ఆయన జీవిత చరిత్ర తెలిపే 38 ఘట్టాలను ప్రదర్శించేలా ఆర్ట్‌వర్క్‌ ఏర్పాటుచేశారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో నాలుగు హాల్స్‌ ఉంటాయి. ఇందులో ఓ సినిమా హాలు, మిగిలిన మూడు హాళ్లు ఆయన చరిత్ర తెలిపే డిజిటల్‌ మ్యూజియంలు ఉంటాయి. ఫస్ట్‌ ఫ్లోర్‌లో 2,250 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన నాలుగు హాళ్లుంటాయి. ఒక హాల్లో అంబేడ్కర్‌కు దక్షిణ భారతదేశంతో ఉన్న అనుబంధాన్ని డిస్‌ప్లే చేస్తారు. రెండు హాళ్లలో మ్యూజియం, ఒక హాల్‌లో లైబ్రరీ ఏర్పాటు చేసారు. అంబేడ్కర్‌ జీవిత చరిత్ర తెలిపే (డిజిటల్‌) మ్యూజియంను 75 మంది సీటింగ్‌ కెపాసిటీతో అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించారు. అంబేడ్కర్‌ జీవిత చరిత్ర తెలిపే 38 ఘట్టాలను ప్రదర్శించేలా ఆర్ట్‌ వర్క్‌ ఏర్పాటుచేస్తున్నారు. అంబేడ్కర్‌ జీవితంలో బాల్యం, విద్య, వివాహం, ఉద్యోగం, రాజకీయ జీవితం, పోరాటాలు, రాజ్యాంగ నిర్మాణం ఛాయాచిత్రాలను, ఇతర వస్తువులను ప్రదర్శించే మ్యూజియం ఏర్పాటవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+