వైఎస్సార్ శ్రీకారం చుట్టిన వెలిగొండ ప్రాజెక్ట్ పై సీఎం జగన్ ఫోకస్ .. నేడు సందర్శన
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు వెలిగొండ ప్రాజెక్ట్ ను సందర్శించనున్నారు. అక్కడ అజరుగుతున్న పనులను పరిశీలించనున్నారు. ప్రకాశం జిల్లలో నేడు పర్యటించనున్న సీఎం జగన్ నాడు కడప ,ప్రకాశం,నెల్లూరు జిల్లాలను కరువు నుంచి దూరం చేయాలనే ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి శ్రీకారం చుట్టిన వెలిగొండ ప్రాజెక్ట్ పనులపై దృష్టి పెట్టారు.

వైఎస్సార్ శ్రీకారం చుట్టిన వెలిగొండ ప్రాజెక్ట్ పై సీఎం జగన్ దృష్టి
2014లో వెలిగొండ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ . ఆయన హయాంలో ప్రాజెక్టు పనులు మొదలైనా అవి నేటికీ కొనసాగుతున్నాయి. అయితే సీఎంగా బాధ్యతలు చేపట్టిన జగన్ నాటి నుండి మూడు జిల్లాలకు వరప్రదాయినిగా తండ్రి నిర్మించ సంకల్పించిన వెలిగొండ ప్రాజెక్టుపై పలుమార్లు సమీక్ష చేశారు. అందులో భాగంగా రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ద్వారా పనులను అప్పగించారు. నిపుణుల కమిటీ సూచలనల మేరకు వెలిగొండ ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ కు వెళ్లి రూ.62.1 కోట్ల మేర ఆదా చేశారు.

నేడు వెలిగొండ ప్రాజెక్ట్ సందర్శన .. పనుల పరిశీలన
ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో జగన్ మోహన్ రెడ్డి నేడు ప్రాజెక్ట్ సందర్శన చెయ్యనున్నారు.పెద్దదొర్నాల మండలంలోని కొత్తూరు వద్ద జరుగుతున్న వెలిగొండ ప్రాజెక్టు పనులను ముఖ్యమంత్రి జగన్ తొలిసారి పరిశీలించనున్నారు. మొదటి టన్నెల్ రెండో టన్నెల్ పనులను పరిశీలించటంతో పాటు ముఖ్యమంత్రి ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ప్రాజెక్టు ప్రాంతాలను పరిశీలించి పనులు ఏ విధంగా కొనసాగుతున్నాయో.. ఎంతవరకు వచ్చాయో.. ఎంత సమయంలో పూర్తి అవుతుందో స్వయంగా తెలుసుకోనున్నారు.సీఎం జగన్ పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. భద్రతా సిబ్బంది పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఆర్ధిక భారమే అయినా ప్రాజెక్ట్ పూర్తి చెయ్యాలని సంకల్పించిన సీఎం జగన్
ఈ ప్రాజెక్టుకు ఇప్పటివరకు రూ.5107 కోట్లు ఖర్చు చేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పూర్తికి రూ.3480 కోట్లు అవసరం ఉంది రాష్ట్రం ఆర్ధిక భారంలో ఉన్నప్పటికీ సీఎం జగన్ ఈ ప్రాజెక్ట్ పూర్తి చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు 15 లక్షల మందికి తాగునీరు అందించేలా రూపకల్పన చేసిన ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే మూడు జిల్లాల రైతుల సాగునీటి కష్టాలు తీరతాయి .ఇక ఈ ప్రాజెక్ట్ పూర్తయితే కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు ఎగువ నుంచి 43.5 టీఎంసీల నీటిని వెలిగొండ ప్రాజెక్టును నింపనున్నారు.
Recommended Video


జూన్ లోపే పనులు పూర్తి చెయ్యాలని భావన
ఇక వై ఎస్సార్ కలలు కన్న ఈ ప్రాజెక్ట్ పనులు త్వరగా పూర్తి చేసి జూన్ లోపు ప్రాజెక్టును ప్రారంభించాలని అధికారులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. వర్షాకాలంలోపు పూర్తయితే ఆ తర్వాత వచ్చే వరద తో ప్రాజెక్టును నింపే అవకాశం ఉంది. అందుకోసం సీఎం జగన్ యుద్ధ ప్రాతిపదికన పనులు చెయ్యాలని అధికారులకు దిశా నిర్దేశం చెయ్యనున్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications