సొంత జిల్లాకు సీఎం జగన్..8,9 తేదీల్లో కడప పర్యటన, 400 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం !!
ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అభివృద్ధిలో తన మార్పును చూపిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ తన సొంత జిల్లా అయిన వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన షెడ్యూల్ ఖరారైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 8,9 తేదీల్లో కడప జిల్లా పర్యటనకు వెళ్లనున్నట్టు సమాచారం. పలు అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టనున్నట్టు సమాచారం.
ఈనెల 9వ తేదీన సీఎం జగన్ బద్వేలులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తుంది. సీఎం అయిన తర్వాత తొలిసారిగా ఆయన బద్వేలు రానున్న నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 9వ తేదీన మున్సిపాలిటీ తోపాటు గా నియోజకవర్గానికి సంబంధించిన సుమారు 400 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు బద్వేలు పర్యటనకు వస్తున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వెల్లడించారు. సీఎం జగన్ నాయకత్వంలో కడపలో అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ది జరుగుతుందని ఆయన వెల్లడించారు.

Recommended Video
సీఎం జగన్ టూర్ నేపధ్యంలో పర్యటన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను చూస్తున్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, అలాగే మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి స్థానిక బైపాస్ రోడ్ లోని బహిరంగ సభ నిర్వహించే స్థలాన్ని, హెలిప్యాడ్ కోసం సిద్ధవటం రోడ్డులోని ఓ స్థలాన్ని, మైదుకూరు రోడ్డులోని మరో స్థలాన్ని పరిశీలించారు. కడప జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం తన సొంత జిల్లాలో ఈ రెండు రోజుల్లో నాలుగు వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు.












Click it and Unblock the Notifications