ఏపీలో అతితక్కువ ఖర్చుతో నిర్మించిన మోడల్ హౌస్ పరిశీలించిన సీఎం జగన్ .. లక్ష్యం దిశగా అడుగులు !!

వైయస్సార్ హౌసింగ్ స్కీమ్ కింద మోడల్ హౌస్ ను రాష్ట్రంలోని నిరుపేదలకు నిర్మించి ఇవ్వాలని ఏపీలోని వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా నిర్మించిన మోడల్ హౌస్ ను ఈరోజు సీఎం జగన్ మోహన్ రెడ్డి పరిశీలించారు. అందులో ఉన్న వసతులను, అయిన ఖర్చును అధికారులు సీఎం జగన్ కు వివరించారు.

2024 వ సంవత్సరంలోగా రాష్ట్రంలో 30 లక్షల ఇళ్ళ నిర్మాణ లక్ష్యం

2024 వ సంవత్సరంలోగా రాష్ట్రంలో 30 లక్షల ఇళ్ళ నిర్మాణ లక్ష్యం

రాష్ట్రంలో నిరుపేదలందరికీ సొంత ఇంటి కల నిజం చేయాలన్న సంకల్పంతో ఉన్న ఏపీ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి రంగం సిద్ధం చేసింది. వివిధ కారణాల వల్ల ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడుతున్నప్పటికీ, భవిష్యత్తులో పేదలందరికీ ఇల్లు కట్టి ఇవ్వడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది . 2024 వ సంవత్సరంలోగా రాష్ట్రంలో 30 లక్షల ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని ,అర్హులైన పేదలకు మంజూరు చేసిన ఇళ్ల స్థలాల్లో ఆ ఇళ్లను నిర్మించాలని, పావలా వడ్డీకే రుణాలు అందించి ఇల్లు కట్టివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అతితక్కువ ఖర్చుతో అన్ని వసతులతో మోడల్ హౌస్ నిర్మాణం

అతితక్కువ ఖర్చుతో అన్ని వసతులతో మోడల్ హౌస్ నిర్మాణం

పేదలకు అతి తక్కువ ఖర్చుతో అన్నివసతులతో ఇంటిని నిర్మించి ఇవ్వటమే లక్ష్యంగా పెట్టుకున్న ఏపీ ప్రభుత్వం మోడల్ హౌస్ ను నిర్మించాలని గృహనిర్మాణ శాఖకు సూచించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు తాడేపల్లి బోట్ హౌస్ వద్ద గృహ నిర్మాణ శాఖ మోడల్ హౌస్ ను నిర్మించింది .కేవలం ఒక సెంటు స్థలంలోనే అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన నిర్మాణాన్ని, అన్ని మౌలిక వసతులతో చేసింది. 40 గజాల విస్తీర్ణంలో చేపట్టిన ఈ నిర్మాణంలో ఒక హాల్, బెడ్ రూమ్, కిచెన్, వరండా ఉన్నాయి. మొత్తం ఈ మోడల్ హౌస్ నిర్మాణానికి రెండు లక్షల 50 వేల రూపాయలు ఖర్చయింది.అత్యంత తక్కువ ఖర్చుతో మోడల్ హౌస్ నిర్మాణాన్ని పూర్తి చేసినట్లుగా అధికారులు చెబుతున్నారు .

రాజమండ్రిలో 48 గంటల్లోనే మోడల్ హౌస్ .. ప్రారంభించిన ఎంపీ మార్గాని భరత్ రామ్

రాజమండ్రిలో 48 గంటల్లోనే మోడల్ హౌస్ .. ప్రారంభించిన ఎంపీ మార్గాని భరత్ రామ్

ఇదే సమయంలోతూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ పరిధిలోని జేగురుపాడు గ్రామంలో కేవలం 48 గంటల్లోనే అత్యుత్తమ టెక్నాలజీతో మోడల్ హౌస్ ను నిర్మించారు . ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా ప్రయోగాత్మకంగా నిర్మితమైన ఈ మోడల్ హౌస్ సోలార్ రూఫ్ టెక్నాలజీతో, వెహికల్ గార్డెనింగ్ తో డిజైన్ చేశారు. రాజమండ్రి ఎంపీ మార్గాన్ని భరత్ రామ్ 320 చదరపు అడుగుల్లో అత్యుత్తమ టెక్నాలజీ తో నిర్మించిన ఈ మోడల్ హౌస్ ను ప్రారంభించారు. రాష్ట్ర హౌసింగ్ చరిత్రలో అతి తక్కువ ఖర్చుతో తొలిసారి ఒక మోడల్ హౌస్ నిర్మాణం జరిగిందని, ఈ మోడల్ సక్సెస్ అయితే భవిష్యత్తులో తక్కువ ఖర్చుతో పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి అవకాశం ఉంటుందని ఎంపీ భరత్ అంటున్నారు. మూడున్నర లక్షల లోపు ఖర్చుతో ఈ మోడల్ హౌస్ నిర్మాణం జరిగిందని ఆయన పేర్కొన్నారు.

మోడల్ హౌస్ ను పరిశీలించిన సీఎం జగన్

మోడల్ హౌస్ ను పరిశీలించిన సీఎం జగన్

ఏపీలో నాలుగేళ్ల కాలంలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి వారికి అతి తక్కువ ఖర్చుతో అందమైన ఇళ్ల నిర్మాణం చేయించి ఇవ్వాలనేది ఏపీ ప్రభుత్వ సంకల్పం. నిలువ నీడలేని పేదవారు ఉండకూడదని భావించిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆ దిశగా ప్రభుత్వ యంత్రాంగాన్ని, గృహ నిర్మాణ శాఖను సన్నద్ధం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఏపీలో అత్యంత తక్కువ ఖర్చుతో నిర్మితమైన మోడల్ హౌస్ ను సీఎం జగన్ మోహన్ రెడ్డి పరిశీలించారు.

ఇళ్ళ ప్లాన్స్ సిద్ధం .. ఇళ్ళ స్థలాల పంపిణీనే ఆలస్యం

ఇళ్ళ ప్లాన్స్ సిద్ధం .. ఇళ్ళ స్థలాల పంపిణీనే ఆలస్యం

ఈ నాలుగేళ్ళలో 30 లక్షల ఇళ్లను నిర్మించే లక్ష్యం పెట్టుకున్న ఏపీ ప్రభుత్వం అందుకోసం ఇళ్ళ ప్లాన్స్ కూడా సిద్ధం చేసింది . ప్రతి ఇంట్లో కిచెన్, బెడ్ రూమ్, హాల్ ,వరండా, టాయిలెట్ ఉండాలని, అదే విధంగా మొక్కలు పెంచుకునేందుకు స్థలం ఉండేలా చూడాలని అధికారులకు ప్రభుత్వం సూచిందింది. 4500 మంది ఇంజనీర్లు, 45వేలమంది గ్రామ వాలంటీర్లు ఈ ఇళ్ల నిర్మాణంలో పనిచేయబోతున్నారని తెలుస్తుంది. ఏది ఏమైనా సీఎం జగన్ నిరుపేదల సంక్షేమానికి పెద్ద పీట వేసి మరీ ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ ఇళ్ళ స్థలాల విషయంలో మాత్రం న్యాయపరమైన సమస్యలతో ఏపీ ప్రభుత్వానికి అడుగులు ముందుకు పడటం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+