ఎన్నికల వేళ పులివెందుల కేంద్రంగా సీఎం జగన్..!!
ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల వేళ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. నాలుగు సిద్దం సభల ద్వారా ఎన్నికల సమరశంఖం పూరించారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా పోటీ చేస్తున్నాయి. తాను చేసిన సంక్షేమం - సామాజిక న్యాయం తనను గెలిపిస్తాయని ధీమాతో ఉన్నారు. ఈ నెల 16 నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని నిర్ణయించారు. ఇటు ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ సొంత నియోజకవర్గం లో సీఎం జగన్ పర్యటించారు.
ముఖ్యమంత్రి జగన్ తన సొంత నియోజక వర్గమైన పులివెందులలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ముందుగా పులివెందులలో డాక్టర్ వైయస్ఆర్ సర్వజన(జనరల్) ఆస్పత్రిని సీఎం వైయస్ జగన్ ముందుగా ప్రారంభించారు. అక్కడే డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ముఖ్యమంత్రి అవిష్కరించారు. అనంతరం మెడికల్ కళాశాల, అసుపత్రికి సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రికి వైద్య అరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి కృష్ణబాబు వివరించారు. ఆ తర్వాత బనాన ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్..ఆ వెంటనే డాక్టర్ వైయస్ఆర్ మినీ సెక్రటేరియట్ కాంప్లెక్స్‌కు చేరుకుని దానిని ప్రారంభించారు.

ఆ తర్వాత డాక్టర్ వైయస్ఆర్ జంక్షన్ కు వెళ్లి సెంట్రల్ బౌల్ వార్డ్ ప్రారంభించిన తర్వాత వైయస్ జయమ్మ షాపింగ్ కాంప్లెక్స్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం డాక్టర్ వైయస్ఆర్ ఉలిమెల్ల లేక్ ఫ్రంట్‌ను సందర్శించి, పార్కును పరిశీలించారు. పార్కును ప్రారంభించిన అనంతరం అక్కడ కొద్దిసేపు గడిపారు. ఆ తర్వాత ఆదిత్యా బిర్లా యూనిట్‌కు చేరుకుని ఫేజ్-1 ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఇడుపులపాయ చేరుకొని అక్కడ రూ.40 కోట్లతో అభివృద్ధి చేసిన డాక్టర్ వైయస్సార్ మెమోరియల్ పార్కును ప్రారంభించారు.
వైఎస్సార్ జిల్లాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన సీఎం శ్రీ వైఎస్ జగన్. తొలుత పులివెందులలో వైఎస్సార్ మెడికల్ కాలేజ్, సర్వజన ఆసుపత్రిని ప్రారంభించిన ముఖ్యమంత్రి. #Kadapa#YSRDistrict pic.twitter.com/hQIZqLJIFT
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) March 11, 2024
ఎన్నికల్లో తిరిగి పులివెందుల నుంచి జగన్ పోటీ చేయనున్నారు. వరుసగా మూడో సారి గెలిచి హ్యాట్రిక్ దిశగా అడుగులు వేస్తున్నారు. కడప, పులివెందుల కేంద్రంగా టీడీపీ - కాంగ్రెస్ ఎన్నికల వేళ రాజకీయంగా జగన్ కు వ్యతిరేకంగా చేస్తున్న రాజకీయంతో సీఎం అలర్ట్ అయ్యారు. సొంత జిల్లాల్లో అన్ని సీట్లు గెలవమటే లక్ష్యంగా కేడర్ కు దిశా నిర్దేశం చేసారు. ఈ సారి ఎన్నికల సమయంలో కడప జిల్లా కేంద్రంగా చోటు చేసుకొనే ఎన్నికల రాజకీయం పైన ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications