• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏపీ కొత్త సీఎస్‌గా నీలం సాహ్ని..! ఆల్ ది బెస్ట్ చెప్పిన సీఎం జగన్: కేంద్రం అనుమతి రాగానే..!

|

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్య ఆకస్మిక బదిలీతో కొత్త సీఎస్ ఎవరనే చర్చ మొదలైంది. అయితే, ముఖ్యమంత్రి జగన్ సీఎస్ పై బదిలీ ఉత్తర్వులకు ముందే నూతన సీఎస్ నియామకం పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ప్రవీణ్ ప్రకాశ్ కు షోకాజ్ నోటీసు ఇవ్వగానే ఢిల్లీలో కేంద్ర సర్వీసుల్లో పని చేస్తున్న ఏపీ కేడర్ అధికారిణి నీలం సహానీకి ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఆహ్వానం అందింది. ముఖ్యమంత్రిని కలవాలని సూచించారు.

దీంతో..సోమవారం మధ్నాహ్నం నీలం సాహ్ని సీఎం జగన్ ను కలిసారు. సీఎం తన ఆలోచన బయట పెట్టారు. అందులకు నీలం సైతం ఓకే అన్నారు. ఆ వెంటనే ఎల్వీ బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక, ప్రస్తుతానికి సీసీఎల్ఏ కు తాత్కాలిక బాధ్యతలు అప్పగించినా..కేంద్రం నీలం రిలీవ్ కు అనుమతించిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శిగా నీలం సాహ్ని బాధ్యతలు స్వీకరించే అవకాశం కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రక్రియ ప్రారంభమైంది.

సీఎస్ ను తొలిగించిన విధానం సరిగా లేదు: ఆ విషయంలో ఇచ్చిన బహుమానమా: ఐవైఆర్ సంచలనం..!

జగన్ తో నీలం సాహ్ని భేటీ..

జగన్ తో నీలం సాహ్ని భేటీ..

ముఖ్యమంత్రి కార్యాలయ పిలుపు మేరకు ఢిల్లీ నుండి విజయవాడ వచ్చిన నీలం సాహ్ని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ తో సమావేశమయ్యారు. సీఎంతో కలిసి భోజనం చేసారు. ముఖ్యమంత్రి జగన్ తన మనసులోని ఆలోచన బయట పెట్టారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఎల్వీ సుబ్రమణ్యంను బదిలీ చేస్తున్నామని..ఆ స్థానంలో సీఎస్ గా బాధ్యతలు నీలం కు అప్పగించాలని భావిస్తున్నానని చెప్పుకొచ్చారు. అందుకు నీలం సాహ్ని సైతం అంగీకరించారు. ఏపీ కేడర్ కు చెందిన అధికారిణి కావటంతో..ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న నీలం ను రిలీవ్ చేయాల్సిందిగా కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖ రాయనుంది.

కేంద్రం రిలీవ్ కు అనుమతి ఇవ్వగానే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్నిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి ఈ మేరకు నీలం సాహ్నితో చర్చలు జరపటం..నీలం అంగీకరిం చటంతో ఇక..ఏపీ తరువాతి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని దాదాపు ఖరారయ్యారు.

సీనియార్టీలోనూ తొలి స్థానంలో..

సీనియార్టీలోనూ తొలి స్థానంలో..

ఎల్వీ సుబ్రమణ్యం బదిలీతో సీనియార్టీ ప్రకారం ఆ తరువాతి స్థానంలో 1983 బ్యాచ్ కు చెందిన ప్రీతీ సూడాన్ ఉన్నారు. అయితే, మరో అయిదు నెలలు మాత్రమే పదవీ విరమణకు గడువు ఉంది. ఇక, తరువాతి స్థానంలో 1984 బ్యాచ్ కు చెందిన నీలం సాహ్ని..అజయ్ సాహ్ని ఉన్నారు. 1985 బ్యాచ్ నుండి సమీర్ శర్మ.. రెడ్డి సుబ్రమణ్యం ఉండగా, 1986 బ్యాచ్ నుండి డి సాంబశివరావు, అభయ్ త్రిపాఠి, సతీష్ చంద్ర ఉన్నారు. ఇందులో డి సాంబశివ రావు..సతీష్ చంద్ర మాత్రమే రాష్ట్ర సర్వీసులో ఉన్నారు.

దీంతో..మహిళకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారు. అందులో భాగంగా..నేరుగా తన కార్యాలయానికి పిలిపించి చర్చించారు. నీలం సాహ్ని సైతం సీఎస్ గా వచ్చేందుకు సుముఖంగా ఉండటంతో సీఎం ఆల్ ది బెస్ట్ చెప్పినట్లు తెలుస్తోంది. రెండు లేదా మూడు రోజుల్లో ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి.

ఏపీలో పనిచేసిన అనుభవం..

ఏపీలో పనిచేసిన అనుభవం..

ఏపీకి నూతన సీఎస్ గా దాదాపు ఖరారైన నీలం సాహ్ని ఉమ్మడి ఏపీలో పలు కీలక పోస్టులు నిర్వహించారు. నల్లగొండ కలెక్టర్‌గా సుదీర్ఘ కాలం పనిచేశారు. గత కొంతకాలంగా కేంద్ర సర్వీసుల్లో డిప్యుటేషన్‌పై ఉన్నారు. ప్రస్తుతం కేంద్ర సామాజిక న్యాయ విభాగం కార్యదర్శిగా పనిచేస్తున్న నీలం సాహ్నికి వచ్చే ఏడాది జూన్‌ వరకు సర్వీసు ఉంది. ఆమెను తిరిగి రాష్ట్ర సర్వీసులోకి పంపాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయనుంది. కేంద్రం అనుమతించిన తర్వాతే ఆమెను సీఎ్‌సగా నియమించాల్సి ఉంటుంది.

ఆమె భర్త అజయ్‌ సాహ్ని 2014లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పేషీలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ప్రస్తుతం కేంద్ర సర్వీసులో ఉన్నారు. ఇక, కేంద్రం నీలం ను ఏపీకి రిలీవ్ చేస్తే..కొత్త సీఎస్ గా ఉత్తర్వులివ్వటానికి ప్రభుత్వం సిద్దంగా ఉంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
senior IAS Neelam Sahni may be appoint as new Chief secretary for ANdhar Pradesh after LV subrmanyam sudeen transfer. She called Jagan and discussed about her post. CM jagan want to give C.S post for lady officer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more