భరత్ - రాజా కు సీఎం జగన్ ఫైనల్ వార్నింగ్-పరిణామాలు వేరేగా ఉంటాయి : పార్టీకి ఎవరైనా నష్టం చేస్తే ..!!
ఎంపీ భరత్ వర్సెస్ ఎమ్మెల్యే రాజా వివాదాల పైన ముఖ్యమంత్రి జగన్ ఒక రేంజ్ లో ఫైర్ అయినట్లు విశ్వసనీయ సమాచారం. మీ ఇద్దరికీ పార్టీలో కీలక బాధ్యతలు ఇచ్చాం. భరత్ తొలి సారి ఎంపీ అయినా పార్టీ లోక్ సభ పార్టీ విప్ గా అవకాశం దక్కింది. రాజా కు కాపు కార్పోరేషన్ ఛైర్మన్ వంటి పోస్టు వచ్చింది. మీరిద్దరూ ఏం చేస్తున్నారు...మీరు బాధ్యత కలిగిన పదవుల్లో ఉన్నారనే విషయం మర్చిపోతున్నారా.. పార్టీని ఏం చేద్దామనుకుంటున్నారా.. పార్టీకి - ప్రభుత్వానికి నష్టం చేసే విధంగా వ్యవహరిస్తే ఎవరినైనా సరే ఉపేక్షించేది లేదు..అంటూ సీఎం జగన్ ఫైర్ అయినట్లు తెలుస్తోంది.

ఎంపీ-ఎమ్మెల్యే పై సీఎం సీరియస్
కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య కొద్ది రోజులుగా సాగుతున్న వివాదాల పైన హైకమాండ్ సీరియస్ అయింది. వారిద్దరినీ అమరావతికి పిలిపించింది. ముందుగా వారిద్దరి పార్టీ ఉభయ గోదావరి జిల్లాల ఇన్ ఛార్జ్ సుబ్బారెడ్డి భేటీ అయ్యారు. వారిద్దరి వివాదాలు.. బహిరంగ సవాళ్లు..విమర్శల- ఆరోపణల పైన సీఎం సీరియస్ గా ఉన్నారంటూ సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. ఇద్దరు విభేదాలు పక్కన పెట్టి పార్టీ కోసం పని చేయాలని స్పష్టం చేసారు. అప్పటికీ ఇద్దరు నేతలు ఒకరి పైన మరొకరు ఫిర్యాదు చేసుకొనే ప్రయత్నం చేసారు.

సుబ్బారెడ్డి ప్రయత్నాలు ఫలించకపోవటంతో
తమ వద్ద తప్పు లేదని ఎవరికి వారు సమర్ధించుకుంటుండగా సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల దాకా సమావేశం నడచింది. ముందు వారిద్దరితో వైవీ విడివిడిగా మాట్లాడారు. వారిద్దరి మధ్య విభేదాలకు కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. తర్వాత ఇద్దరినీ కలిపి కూర్చోబెట్టి రాజీ యత్నాలు చేశారు. ఇందుకు మరో గంట పట్టింది. అయినా ఇద్దరి మధ్య సయోధ్య కుదరలేదు. రాజీకి ససేమిరా అన్నారు. దీంతో పంచాయితీ సీఎం క్యాంపు కార్యాలయానికి చేరింది. సాయంత్రం ఐదున్నరకు వైవీ వారిద్దరినీ వెంటబెట్టుకుని ముఖ్యమంత్రి వద్దకు వెళ్లారు.

అరగంట సేపు సీఎం క్లాస
ఈ సందర్భంగా జగన్ వారిద్దరిపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. పరస్పరం రోడ్డెక్కితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అధికారపక్షంలో ఉంటూ సీరియల్ విమర్శలు ఏమిటని నిలదీశారు. పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. మరోసారి ఇలా చేస్తే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. ముఖ్యమంత్రి అరగంట సేపు క్లాసు తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇద్దరు కలిసి పని చేయాల్సిందేనని సీఎం స్పష్టం చేసారు. ఎవరికి వారుగా వ్యవహరిస్తామంటే కుదరదని తేల్చి చెప్పారు.

రిపీట్ అవుతే ఇక నిర్ణయాలే ఉంటాయి
మరోసారి ఇలాంటి పరిస్థితి వస్తే పిలిచి మాట్లాడేది ఏమీ ఉండదని.. నిర్ణయాలు మాత్రమే ఉంటాయంటూ సీఎం ఆగ్రహం వ్యక్తం చేయటంతో వారిద్దరూ మరేమీ మాట్లాడలేదని తెలుస్తోంది. ఇద్దరు కలిసి మీడియా ముందుకు వెళ్లండి. ఎక్కడైతే ఒకరి పైన మరొకరు ఆరోపణలు చేసుకున్నారో..అక్కడి నుంచే కలిసే ఉన్నామని చెప్పండంటూ సీఎం ఆదేశించినట్లుగా సమాచారం. దీంతో..ఇద్దరు నేతలు ఈ రోజున రాజమండ్రిలో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు.
Recommended Video

వివాదాలు పక్కన పెడతారా
ముఖ్యమంత్రి ఆగ్రహం తో అప్పటి వరకు ఎవరి వాదన వారు సమర్ధించుకొనే ప్రయత్నం చేసిన ఇద్దరు నేతలు మౌనం దాలుస్తూ...సీఎం చెప్పినట్లుగా నడుచుకుంటామని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో..ఇద్దరు నేతలు మీడియా ముందుకు వచ్చి ఏం చెబుతారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది. సీఎం హెచ్చరిక తో ఈ వివాదం ముగిసినట్లుగా పార్టీ నేతలు భావిస్తున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications