CM Jagan: విజయవాడ దుర్గ గుడి, శ్రీశైలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్..
ఏపీలోని ప్రముఖ దేవాలయాలు అయిన విజయవాడ దుర్గ గుడి, శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయాల అభివృద్ధికి సీఎం జగన్ శ్రీకారం చట్టనున్నారు.
విజయవాడ దుర్గ గుడి వద్ద భక్తులకు మెరుగైన సౌకర్యాల కోసం దాదాపు రూ.225 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఈ పనులకు ఈ నెలలో సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారని మంత్రి సత్యనారాయణ తెలిపారు. అటు శ్రీశైలం ఆలయం వద్ద రూ.175 కోట్లతో చేపట్టే పలు పనులకు కూడా సీఎం జగన్ భూమి పూజ చేయనున్నారు.
విజయవాడ దుర్గమ్మ ఆలయం ప్రసాదం పోటు, అన్నదాన భవనం, శివాలయ నిర్మాణ పనులు, రాక్ మిటిగేషన్, ఆటోమేష్ పార్కింగ్ పనులకు జగన్ శంకుస్థాన్ చేస్తారని సత్యనారాయణ చెప్పారు. ప్రస్తుతం ఉన్న ఘాట్ రోడ్డు వాస్తుపరంగా అంత శుభప్రదం కాదని వాస్తు పండితులు చెబుతున్నారు. దీంతో రాజగోపురం నుంచి భక్తులు వచ్చి వెళ్లేలా దుర్గానగర్‌లో ఎలివేటెడ్ క్యూలైన్ (ప్లై ఓవర్), క్యూ కాంపెక్స్ విస్తరణ చేపడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

అమ్మవారి ఆలయాల పక్కన రెండు అంతస్తులతో పూజా మండపాలు కడుతున్నామని వివరించారు. ఇక శ్రీశైలం ఆలయం వద్ద రూ.75 కోట్లతో క్యూ కాంప్లెక్స్, రూ.40 కోట్లతో సాల మండపాల నిర్మాణంతో పాటు ఇటీవల అటవీ శాఖ నుంచి ఆలయం స్వాదీనంలోకి వచ్చిన 4,600 ఎకరాలకు ఫెన్సింగ్ నిర్మాణ పనులను చేపడుతున్నట్లు సత్యనారాయణ వివరించారు. అక్టోబరు నుంచి ధర్మ ప్రచార కార్యక్రమాలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
కాగా ఐక్యరాజ్యసమితిలో ఏపీ ప్రతినిధులుగా మట్టిలో మాణిక్యాలను పంపిస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులను ప్రతినిధులుగా పంపనున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కొండబారేడు మండలం గుమ్మ లక్మీపురం గ్రామానికి చెందిన మనశ్విని ప్రతినిధిగా ఎంపిక చేశారు. కేజీబీవీలో 9వ తరగతి చదువుతోంది. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనలో జరిగిన కొమరాడ బహిరంగ సభలో అనర్గళంగా ఇంగ్లిష్‌లో మాట్లాడి సీఎం జగన్‌తో పాటు నాయకులను, రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించింది మనశ్వని.












Click it and Unblock the Notifications