Jagananna Vidya Deevena: నేడు ఖాతాల్లోకి జగనన్న విద్యాదీవెన పైసలు..
సంక్షేమ పథకాలతో ఏపీ దూసుకెళ్తోంది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల కోసం అనే సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. అందులో జగనన్న విద్యా దీవెన పథకం ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. జగనన్న విద్యాదీవెన పథకంలో భాగంగా నేడు విద్యార్థులకు డబ్బులు విడుదల కానున్నాయి. 2023 ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సంబంధించి విద్యార్థులకు పూర్తి రీయింబర్స్ మెంట్ ను ముఖ్యమంత్రి జగన్ సోమవారం విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
చిత్తూరు జిల్లా నగరిలో జగన్ బటన్ నొక్కి రూ.680.44 కోట్లను 8,44,336 మంది విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. అనంతరం నగరిలో పలు అభివృద్ధి పనులకు జగన్ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే పూర్తి అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. నగరిలో రూ.31 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. చాలా మంది పేదరికంతో చదువుకు దూరమవుతున్నారు. ఇది గమనించిన జగన్ ప్రభుత్వం పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యాను అందించాలనే లక్ష్యంతో జగనన్న విద్యాదీవెన పథకం తీసుకొచ్చింది.

ఈ పథకం కింద ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసన్ చదువులకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తోంది. చదువు మాత్రమే కాదు విద్యార్థుల వసతికి కూడా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది. హాస్టళ్లలో ఉంటూ చదువుకునే పేద విద్యార్థుల భోజన, వసతి ఖర్చలకు డబ్బులు చెల్లిస్తోంది. సంవత్సరానికి రెండు విడుతలుగా విద్యార్థులకు నిధులు మంజూరు చేస్తోంది. ఐటీఐ విద్యార్థులకు సంవత్సరానికి రూ.10 వేల చొప్పున అందిస్తోంది.
పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తూ పెద్ద మనస్సు చాటుకుంటోంది. నేడు విడుల చేసే నిధులతో పాటు జగనన్న విద్యా దీవెన, జగననన్న వసతి దీవెన కింద ఇప్పటి వరకు రూ. 15,593 కోట్లు విడుదల చేసింది. కాగా గత నాలుగేళ్లలో జగన్ ప్రభుత్వం విద్యారంగం కోసం భారీగా ఖర్చు చేసింది. ఇప్పటి వరకు విద్యారంగంపై రూ.69,289 కోట్లు ఖర్చు చేసింది.












Click it and Unblock the Notifications