వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చదువుతో పాటు ఉద్యోగం... డిగ్రీ 4 , ఇంజనీరింగ్ 5 సంవత్సరాలు .. ఏయూలో సీఎం జగన్

|
Google Oneindia TeluguNews

రాష్ట్ర విద్యావిధానంలో మార్పులు తీసుకువస్తామని సీఎం జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో డిగ్రీతోపాటు ఇతర ఇంజనీరింగ్ కోర్సుల్లో సమూల మార్పులు తీసుకువస్తామని చెప్పారు. ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులు ఉద్యోగాలు పోందేలా నూతన విద్యావిధానం కొనసాగుతుందని సీఎం చెప్పారు. ఏయూ పూర్వ విద్యార్థుల సమావేశానికి ముఖ్య అతిధిగా సీఎం జగన్ హజరయ్యారు.

పెళ్లాయ్యాక చదువు,గిదువు జాంతానై...! చదువుతూ... తనని పట్టించుకోవడం లేదని విడాకులు కోరిన భార్యపెళ్లాయ్యాక చదువు,గిదువు జాంతానై...! చదువుతూ... తనని పట్టించుకోవడం లేదని విడాకులు కోరిన భార్య

మేధావులకు నిలయం ఏయూ

మేధావులకు నిలయం ఏయూ

సమావేశంలో మాట్లాడిన సీఎం ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రపంచానికి గొప్ప మేధావులను అందించిందని సీఎం అన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ పారీశ్రామికవేత్త జీఎంఆర్ ఈ యూనివర్సిటీ నుండే వచ్చారని సీఎం గుర్తు చేశారు. ఇక యూనివర్శిటి దేశంలోనే 14వ స్థానంలో ఉందని అన్నారు. అయితే యూనివర్శిటి టాప్ 5 లో ఉండాలని ఆయన కోరుకున్నారు. ఇక యూనివర్శిటిలో ఖాలీగా ఉన్న 459 బోధన సిబ్బంది పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. ఇన్ని పోస్టులు యూనివర్సిటిలో ఖాలీగా ఉండడం తల దించుకోవాల్సిన పరిస్థితి అని అన్నారు. దీంతో తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా విధానంలో పలు మార్పులు తీసుకు వచ్చామని చెప్పారు. యూనివర్శిటి అభివృద్ది కోసం 50 కోట్ల రూపాలయను సీఎం మంజూరు చేశారు.

ఉన్నత విద్యావిధానంలో మార్పలు

ఉన్నత విద్యావిధానంలో మార్పలు


రానున్న రోజుల్లో ఉన్నత విద్యావిధానంలో సమూల మార్పులు తీసుకువస్తామని సీఎం చెప్పారు. ఉన్నత విద్యను చదివే విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చే విధంగా తీర్చిదిద్దుతామని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు 100 శాతం ఫీజు రీ ఎంబర్స్‌మెంట్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఈనేపథ్యంలోనే డిగ్రీని నాలుగేళ్ల కోర్సు చేయాలనే అలోచన ఉందని ..మూడు సంవత్సరాలు విద్యను అర్జించిన తర్వాత నాలుగో సంవత్సరం పూర్తిగా ప్రాక్టికల్స్ , ఉద్యోగం వచ్చే విధంగా దృష్టి పెట్టెలా చర్యలు చేపడతామని సీఎం చెప్పారు. మరోవైపు బీటెక్ ఆనర్స్ కోర్సును కూడ ఐదేళ్లు చేస్తామని చెప్పారు. బీటెక్ చివరి సంవత్సరంలో కూడ ఏడాది పాటు ప్రాక్టికల్స్ ఉండే విధంగా చూస్తామని చెప్పారు.

ఇంగ్లీష్ మీడియంలో ఇబ్బందులను అధిగమిస్తాం

ఇంగ్లీష్ మీడియంలో ఇబ్బందులను అధిగమిస్తాం

ఈ నేపథ్యంలోనే ఇంగ్లీష్ విద్యావిధానంలో తీసుకువచ్చిన మార్పులతో విజయాన్ని సాధిస్తామని, ఇంగ్లీష్ విద్యలో ఎదురయ్యో సమస్యలను అధిగమిస్తామని సీఎం చెప్పారు. ఇందుకోసం ఇంగ్లీష్ ల్యాబ్‌లు ,బ్రిడ్జ్ కోర్సులు ఏర్పాటు చేసి టీచర్లకు ట్రైనింగ్ ఇస్తామని చెప్పారు. వచ్చే సంవత్సరం నుండి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి ప్రతి సంవత్సరం తరగతులను పెంచుకుంటూ పోతామని చెప్పారు. ఈ నేపథ్యంలో కొన్ని సమస్యలు ఎదురైనా..వాటిని అధిగమించి ముందుకు సాగుతామని అన్నారు.

English summary
Drastic chenges will be chenge in the education system in state said CM Jaganmohan Reddy.cm particpated in AU Alumni Conference on friday
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X