కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టి గాంధీ అంత్యక్రియలకు హాజరైన కెసిఆర్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

కరీంనగర్: నగరంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత డాక్టర్ బోయినిపల్లి వెంకటరామారావు(బోవెరా) అంత్యక్రియలకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఎం బోయినపల్లి వెంకటరామారావు మృతదేహానికి నివాళులర్పించారు.

బోయినిపల్లి అంత్యక్రియలను ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి తోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. కాగా, బోవెరా మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. ఆయన మృతి తీరని లోటని, కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

బోవెరాకు నివాళి

బోవెరాకు నివాళి

నగరంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత డాక్టర్ బోయినిపల్లి వెంకటరామారావు(బోవెరా) అంత్యక్రియలకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు హాజరయ్యారు.

బోవెరా అంత్యక్రియలు

బోవెరా అంత్యక్రియలు

ఈ సందర్భంగా సిఎం బోయినపల్లి వెంకటరామారావు మృతదేహానికి నివాళులర్పించారు.

బోవెరా అంత్యక్రియలు

బోవెరా అంత్యక్రియలు

బోయినిపల్లి అంత్యక్రియలను ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి తోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

బోవెరా అంత్యక్రియలు

బోవెరా అంత్యక్రియలు

తెలంగాణ గాంధీగా పేరు తెచ్చుకున్న ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, రచయిత డాక్టర్ బోయినపల్లి వెంకటరామారావు (బోవేరా) (95) సోమవారం హైదరాబాద్‌లో తుది శ్వాస విడిచారు.

బోవెరా అంత్యక్రియలు

బోవెరా అంత్యక్రియలు

కరీంనగర్ జిల్లాలోని బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామానికి చెందిన వెంకటరామారావు జాతీయ స్వాతంత్ర ఉద్యమం, నిజాం విమోచనా ఉద్యమంలో పాల్గొనడంతోపాటు జైలుశిక్షను అనుభవించారు.

బోవెరా అంత్యక్రియలు

బోవెరా అంత్యక్రియలు

బోవెరా మృతి పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. 1920 సెప్టెంబర్‌ 2న రంగమ్మ, కొండాల్‌రావు దంపతులకు బోయినపల్లి వెంకట్రామారావు జిల్లాలోని బెజ్జంకి మండలం తోటపల్లిలో పద్మనాయక వంశంలో జన్మించారు.

బోవెరా అంత్యక్రియలు

బోవెరా అంత్యక్రియలు

ప్రాథమిక విద్య తోటపల్లిలో ప్రారంభమైంది. అనంతరం కరీంనగర్‌లో ఓ ప్రైవేట్‌ పాఠశాలలో చేరారు. కొద్ది రోజుల్లో కాశ్మీరగడ్డలోని ప్రభుత్వ పాఠశాలలోకి మారారు.

బోవెరాకు నివాళి

బోవెరాకు నివాళి

సామజిక, రాజకీయ కార్యకలాపాలతో చదువుకు ప్రాధాన్యమివ్వలేదు. 1939లో ఆంధ్ర సారస్వత పరిషత్‌ ద్వారా మెట్రిక్యులేషన్‌ పరీక్ష రాశారు. ఉత్తీర్ణత అనంతరం చదువునిలిపివేశారు. అయినా ఉర్దూ, హిందీ, ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు.

బోవెరాకు నివాళి

బోవెరాకు నివాళి

జిల్లాలో జరిగిన క్విట్‌ ఇండియా ఉద్యమంలో బోవెరా పాత్ర కీలకం. ఆ సమయంలో జాతీయవాదులను 40మందిని సమీకరించారు. ప్రభుత్వ కార్యాలయాలు కూల్చేసి గిడ్డంగుల్లోని బియ్యాన్ని ప్రజలకు సరఫరా చేశారు.

అధికారిక లాంఛనాలతో..

అధికారిక లాంఛనాలతో..

ప్రతిగ్రామంలోనూ జాతీయ జెండా ఎగురవేశారు. నైజాం ప్రభుత్వానికి సమాంతరంగా గ్రామాల్లో ప్రభుత్వాన్ని నడిపారు. ఆయన 65సంవత్సరాల క్రితం దేవులపల్లి రామానుజరావు సాహితీ స్ఫూర్తితో కరీంనగర్‌లో సారస్వతజ్యోతి మిత్రమండలిని స్థాపించి రికార్డు స్థాయిలో సాహిత్య కార్యక్రమాలు నిర్వహించారు.

బోవెరా అంత్యక్రియలు

బోవెరా అంత్యక్రియలు

గత కొంతకాలంగా అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నారు. ఆయనకు ఒక కుమారుడు, ఆరుగురు కుమార్తెలు ఉన్నారు.

English summary
Rich tributes were paid to freedom fighter Dr Boinapally Venkata Rama Rao popularly known as Karimnagar Gandhi and Bo Ve Ra, who passed away at 94 in Hyderabad on Monday. Telangana Chief Minister K. Chandrasekhar Rao would attend the funeral which is being organised by the government in Karimnagar on Tuesday
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X