దానం నాగేందర్ కుమార్తె వివాహానికి హాజరైన సీఎం కేసీఆర్ (ఫోటో)
హైదరాబాద్: మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దానం నాగేందర్ కుమార్తె మనీష వివాహానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించిన కేసీఆర్, వారికి వివాహా శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ వివాహ కార్యక్రమానికి తెలంగాణ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు... మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి, మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, మోహన్ బాబు, బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా హాజరయ్యారు.

మాదాపూర్‌లోని హైటెక్స్‌లో జరిగిన ఈ వివాహ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యులు, వి.హనుమంతురావు, సుబ్బిరామిరెడ్డి, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల, అల్లు అరవింద్ తదితరులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.












Click it and Unblock the Notifications