వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అటు జగన్..ఇటు కేసీఆర్ మధ్యలో ప్రశాంత్ కిషోర్ : ‘ఐ ప్యాక్‌’ టీంతో సమావేశం : అక్కడే అసలు ట్విస్టు..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్..కేసీఆర్ కొత్త అడుగులు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వారిద్దరూ కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ.. రెండు పార్టీలకు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ టీం సహకారం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఏపీ సీఎం జగన్ 2019 ఎన్నికల్లో గెలుపు వెనుక ప్రశాంత్ కిషోర్ పాత్ర ఉంది. వచ్చే ఎన్నికల్లోనూ రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ సేవలను వినియోగించుకొనేందుకు జగన్ సిద్దమయ్యారు. వచ్చే ఏడాది నుంచే ఐ ప్యాక్ టీం పార్టీ కోసం పని చేస్తుందని ముఖ్యమంత్రి కేబినెట్ సమావేశంలోనే చెప్పుకొచ్చారు.

రెండు రాష్ట్రాల్లో ఐ ప్యాక్ సర్వేలు

రెండు రాష్ట్రాల్లో ఐ ప్యాక్ సర్వేలు


దీంతో..ఈ సారి ఎన్నికల్లోనూ ఏపీలో వైసీపీకి ప్రశాంత్ కిషోర్ పని చేయనున్నారు. జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ప్రధానంగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి స్ట్రాటజిస్ట్ గా వ్యవహరిస్తున్నారు. బీజేపీ- కాంగ్రెస్ లక్ష్యంగా ఇతర పార్టీలను ఏకం చేసే బాధ్యతలు తీసుకున్నారు. అందులో భాగంగానే ప్రధానంగా బీజేపీని వ్యతిరేకిస్తున్న పార్టీలకు దగ్గరవుతున్నారు. ఇక, తాజాగా టీఆర్ఎస్ అధినేత...తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం బీజేపీని టార్గెట్ చేస్తున్నారు. ఇక, తాజాగా ఆయన ఐ ప్యాక్ కుచెందిన కీలక బృందంతో సీఎం కేసీఆర్ సమావేశమైనట్లుగా ప్రచారం సాగుతోంది.

టీఆర్ఎస్ సైతం వారికే బాధ్యతలు

టీఆర్ఎస్ సైతం వారికే బాధ్యతలు


ఐ ప్యాక్‌ సర్వే బృం దంగా చెబుతున్న వారితో జరిగిన భేటీలో.. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించినట్టు తెలుస్తోంది. కాగా రాష్ట్రంలోని వివిధ వర్గాల స్పం దన వివిధ కోణాల్లో తెలుసుకునేందుకు కేసీఆర్‌ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, వివిధ సందర్భాల్లో ప్రభుత్వం తీసుకుంటున్న విధాన నిర్ణయాలపై ప్రజాభిప్రాయాన్ని సర్వేల ద్వారా సేకరించడంపై చర్చించినట్లు చెబుతున్నారు.

సర్వేకేనా.. ఎన్నికలకూ వినియోగిస్తారా

సర్వేకేనా.. ఎన్నికలకూ వినియోగిస్తారా

ఏడేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో తీసుకున్న నిర్ణయాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం అవుతున్న అంశాలు, పార్టీ యంత్రాంగం పనితీరు వంటి వాటిపై ఐ ప్యాక్‌ ద్వారా సర్వే చేయించాలని టీఆర్‌ఎస్‌ అధినేత భావిస్తున్నట్లు తెలిసింది. ఐ ప్యాక్‌ నుంచి ప్రస్తుతానికి సర్వేలకు సంబంధించిన సేవలు మాత్రమే తీసుకోవాలని, భవిష్యత్తులో అవసరమైతే మరిన్ని విస్తృత సేవలు పొందాలనే యోచనలో కేసీఆర్‌ ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, జగన్ తో కలిసి పని చేయటం ఖాయమైనా... కేసీఆర్ కోసం ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ ప్యాక్ టీం కేవలం పధకాల..ప్రజాభిప్రాయ సర్వే కోసమే పని చేస్తారా లేక, వచ్చే ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ కోసం పని చేస్తుందా అనేది స్పష్టత రావాల్సి ఉంది.

జగన్ కు పూర్తిగా సహకారం అందిస్తూ

జగన్ కు పూర్తిగా సహకారం అందిస్తూ

తెలంగాణలో తన పార్టీ కోసం ప్రశాంత్ కిషోర్ సహకరిస్తానని మామీ ఇచ్చారంటూ కొద్ది రోజుల క్రితమే షర్మిల చెప్పుకొచ్చారు. ఇప్పుడు టీఆర్ఎస్ కోసం క్షేత్ర స్థాయిలో అదే ఐ ప్యాక్ టీం సర్వే చేయనున్నట్లు అధికార పార్టీలో ప్రచారం సాగుతోంది. టీఆర్ఎస్ కు పని చేస్తే..షర్మిలకు హ్యాండ్ ఇచ్చినట్లే. అయితే, ఏపీ - తెలంగాణలో ఇద్దరు ముఖ్యమంత్రులు..రెండు పార్టీలను కాంగ్రెస్ - బీజేపీకి దూరంగా ఉంటూ...జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించే విధంగా ప్రశాంత్ కిషోర్ సంప్రదింపులకు సిద్దం అవుతున్నట్లు చెబుతున్నారు.

జగన్ ఇప్పటికిప్పుడు కేంద్రానికి వ్యతిరేకంగా

జగన్ ఇప్పటికిప్పుడు కేంద్రానికి వ్యతిరేకంగా

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికిప్పుడు కేంద్రానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకొనే అవకాశం లేదనేది విశ్లేషకుల అభిప్రాయం. కేసీఆర్ ఇప్పటికే రాజకీయ యుద్దం ప్రకటించినా... తెలంగాణలో అధికారం కాపాడుకుంటూనే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనేది ఆయన లక్ష్యం. ఇక, ఈ ఇద్దరితో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ రోల్ కీలకం కానుంది. షెడ్యూల్ ప్రకారం 2023 లో తెలంగాణ.. 2024 లో ఏపీలో ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ, ఏపీలో సైతం 2023లోనే ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ పరిస్థితుల్లో రెండు రాష్టాల్లో చోటు చేసుకోబోయే రాజకీయ పరిణామాల పైన ఆసక్తి పెరుగుతోంది.

English summary
News is making rounds that Telangana CM has reached out to Prashant Kishores IPAC team to provide the survey on his Govt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X