తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమిత్ షా సమావేశానికి దూరంగా సీఎం కేసీఆర్..!! జగన్ తో సమస్యా - బై పోల్ ఎఫెక్టా..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. హుజూరాబాద్ బై పోల్ తరువాత ఒక్క సారిగా సీఎం కేసీఆర్ కేంద్రం పైన యుద్దం ప్రకటించారు. వడ్లు కొనుగోలు అంశంలో కేంద్రాన్ని నిలదీసారు. వెంటాడుతానని ప్రకటించారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిని టార్గెట్ చేసారు. నిత్యం మీడియా సమావేశాలు ఉంటాయని స్పష్టం చేసారు. కానీ, సడన్ గా కామ్ అయిపోయారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి... గజేంద్ర షెకావత్ సీఎం లక్ష్యంగా వ్యాఖ్యలు చేసినా... మంత్రి హరీష్ స్పందించారు. ఇక, అధికార టీఆర్ఎస్ కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా రైతు దీక్షలు చేసింది.

అమిత్ షా సమావేశానికి కేసీఆర్ హాజరు పై చర్చ..

అమిత్ షా సమావేశానికి కేసీఆర్ హాజరు పై చర్చ..

ఇది ఇలా ఉంటే..రేపు (ఆదివారం) తిరుపతి కేంద్రంగా జరిగే సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్ కు కేసీఆర్ హాజరు కావాల్సి ఉంది. ఈ సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షత వహిస్తున్నారు. ఇందులో ఏపీ తెలంగాణ తమిళనాడు కర్ణాటక కేరళ సీఎంలతో పాటు పుదుచ్చేరి అండమాన్ లక్ష్యద్వీప్ ప్రాంతాల లెప్టినెంట్ గవర్నర్లు పాల్గొంటారు. అయితే కరోనా కారణంగా గత రెండేళ్లు ఈ సమావేశాలను వాయిదా వేస్తూ వస్తున్నారు. తొలుత ఈ సమావేశానికి హాజరు కావాలనే సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లుగా ప్రచారం సాగింది. అయితే, ఇప్పుడు కేసీఆర్ ఈ సమావేశానికి హాజరు కావటం లేదని తెలుస్తోంది.

రాజకీయ అంశాలే కారణమా

రాజకీయ అంశాలే కారణమా

అధికారికంగా వెల్లడించకపోయినా...ఆ రాష్ట్ర హోం మంత్రి మహమ్మూద్ అలీ హాజరవుతారని సమాచారం. ఢిల్లీ వెళ్లి తెలంగాణ సమస్యల పైన అమిత్ షా తో సుదీర్ఘంగా సమావేశమయ్యే ముఖ్యమంత్రి...ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల సమస్యల పైన జరిగే ఈ సమావేశానికి హాజరు కాకపోవటం పైన చర్చ సాగుతోంది. రాజకీయ కారణాలతోనే వెళ్లటం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కేంద్రం తీరు పైన మండిపడుతున్న కేసీఆర్...తాము ఇప్పుడు తిరిగి అమిత్ షా సమావేశానికి హాజరైతే రాజకీయంగా విమర్శలకు ఆస్కారం ఇచ్చినట్లవుతుందనే కారణంగానే హాజరు కావటం లేదనేది మరో వాదన.

జగన్ తోనూ కొంత కాలంగా దూరంగా

జగన్ తోనూ కొంత కాలంగా దూరంగా

అయితే, ఇది పూర్తిగా అధికారిక ..రాష్ట్ర అంశాల పైన జరిగే సమావేశం కావటంతో..ఇక్కడ రాజకీయాల ప్రస్తావన అవసరం లేదనేది మరో అభిప్రాయం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రి హాజరవుతున్నారని చెబుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఇద్దరు సీఎంలు ఇటు హైదరాబాద్..ఇటు అమరావతిల్లో సమావేశాలు నిర్వహించారు. ఇచ్చి పుచ్చుకొనే ధోరణితో వ్యవహరిస్తున్నారు. అయితే, పోతిరెడ్డి పాడు నీటి అంశం దగ్గర నుంచి ఇద్దరు కలుసుకున్న సందర్భాలు లేవు.

తాజాగా తెలంగాణ వర్సెస్ ఏపీ మంత్రుల వ్యాఖ్యలు

తాజాగా తెలంగాణ వర్సెస్ ఏపీ మంత్రుల వ్యాఖ్యలు


ఇదే సమయంలో తాజాగా ఏపీ సీఎం పైన తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు...దీనికి స్పందనగా ఏపీ మంత్రి పేర్ని నాని తెలంగాణ ముఖ్యమంత్రి పైన చేసిన వ్యాఖ్యలతో వివాదం చోటు చేసుకుంది. కేసీఆర్ రెండో సారి సీఎం అయిన తరువాత తిరుమలకు వచ్చారు. స్వామి వారి దర్శనం చేసుకున్నారు. రాష్ట్ర విభజన చట్టంలోని అంశాల గురించి రెండు ప్రభుత్వాలు ఈ సమావేశంలో ప్రస్తావన తీసుకొచ్చే అవకాశం ఉంది. రాజకీయ కారణాలతోనే కేసీఆర్ ఇప్పుడు అమిత్ షా సమావేశానికి దూరంగా ఉంటున్నారనే ప్రచారం సాగుతోంది.

కేసీఆర్ మనసు మార్చుకుంటారా..దూరంగానే ఉంటారా

కేసీఆర్ మనసు మార్చుకుంటారా..దూరంగానే ఉంటారా

ఇక, ఇదే సమయంలో ఏపీ సీఎం తన రాష్ట్రంలో జరుగుతున్న సమావేశం కావటంతో...అమిత్ షా కు తిరుపతిలో స్వాగతం పలకటంతో పాటుగా..ఆయనతో కలిసి శ్రీవారిని దర్శించుకోనున్నారు. అదే విధంగా సమావేశంలోనూ కీలక అంశాలను ప్రస్తావించేందుకు సిద్దం అయ్యారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి జగన్ ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఏపీకి సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించాలని ఇప్పటికే సీఎం జగన్ నిర్ణయించారు. దీంతో..కేసీఆర్ హాజరు కావటం లేదని తెలుస్తున్నా.. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించ లేదు.

English summary
CM KCR has restrained himself from attending the southern states council meet that is to be held on sunday at Tirupati. Union Minister Amit Shah is holding this meet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X