తిరుమల లడ్డూ వివాదం, సిట్ ఏర్పాటు చెయ్యడం వెనుక బాబు ప్లాన్ ఇదే!!
తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి ప్రసాదం లడ్డూను ఎంతో ప్రవిత్రంగా బావించే హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. శ్రీవారి పవిత్రమైన ప్రసాదం తయారు చెయ్యడానికి గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె తయారు చేశారని వెలుగు చూడటంతో హిందువులు మండిపడుతున్నారు. తిరుమల లడ్డూ వివాదంపై దర్యాప్తు చెయ్యడానికి ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చెయ్యడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
తిరుమల లడ్డూ కల్తీపై ఐజీ, అంతకంటే పైస్థాయి అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేస్తామని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆదివారం మంత్రులతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు మీడియాతో శ్రీవారి లడ్డూ వ్యవహారంపై మాట్లాడారు. తిరుమలలో జరిగింది అపచారమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే. ప్రపంచంలోనే అన్నింటి కంటే అత పెద్ద పుణ్యక్షేత్రం అయిన శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంపై ప్రత్యేక శ్రద్ద పెట్టాల్సిన సమయంలో గత వైసీపీ ప్రభుత్వంలో అధికార దుర్వినియోగం వల్ల అడుగడుగునా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. వ్యాపార సంస్థగా, రాజకీయ పునరావాస కేంద్రంగా తిరుమలను జగన్ ప్రభుత్వం వాడుకుందని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు.
వైసీపీ వారికి కావలసిన పనులు చేయించుకునేందుకు టీటీడీ బోర్డును ఉపయోగించుకున్నారని, దీనిపై చాలా మంది హిందువులు బాధపడ్డారని, మళ్లీ ప్రజల మనోభావాలను కాపాడే బాధ్యత మేం తీసుకుంటున్నామని. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని సీఎం నారా చంద్రబాబు నాయుడు శ్రీవెంకటేశ్వరస్వామి భక్తులకు, హిందులకు హామీ ఇచ్చారు.
దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తిరుమల లడ్డూ కల్తీపై సిట్ దర్యాప్తునకు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు దర్యాప్తునకు సంబంధించిన విధివిధానాలను రూపొందించి సోమవారం ప్రకటించే అవకాశం ఉంది. దర్యాప్తు అధికారిగా ఎవరిని నియమించాలనే దానిపై కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సోమవారం సిట్ దర్యాప్తు అధికారి పేరుతో పాటు చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక జీవో విడుదల చేసే అవకాశం ఉంది.

తిరుమల లడ్డూ తయారు చెయ్యడానికి కల్తీ నెయ్యి ఉపయోగించారని వెలుగు చూడటంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు, హిందూ సంఘాలు, శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేయిస్తే నిజానిజాలు బయటకు వస్తాయని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేసి శ్రీవారి లడ్డూ వ్యవహారంపై దర్యాప్తు చేయిస్తే తప్పు చేసిన వారు అందరూ బయటకు వస్తారని శ్రీవారి భక్తులు కూడా అంటున్నారు.
తిరుమల లడ్డూ వ్యవహారంలో ఇప్పటికే వైసీపీ నాయకుటు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ తో పాటు ఆంధ్రప్రదేశ్ పై ఎదురు దాడి చెయ్యడం మొదలుపెట్టింది. ఇలాంటి సందర్బంలో సిట్ ఏర్పాటు చేస్తే సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులు, ఆ జిల్లా అధికారులకు ఎలాంటి సంబందం ఉండదని, వైసీపీ నాయకుల ఎదురుదాడిని తిప్పికొట్టడానికి కూడా అవకాశం ఉంటుందని కూటమి ప్రభుత్వం ఆలోచించిందని తెలిసింది మొత్తం మీద తిరుమల లడ్డూ వ్యవహారంపై చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ అధికారి ఎవరు ? అంటూ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.












Click it and Unblock the Notifications