బుల్లెట్‌ప్రూఫ్ భద్రత: దసరాకు కొత్త ఆఫీస్‌లో చంద్రబాబు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధానిపై సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుత ఏపి సచివాలంయలోని 8వ ఫ్లోర్‌లోని ఎల్ బ్లాక్ మెరుగులు దిద్దుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అక్టోబర్ మొదటి వారం నుంచి ఇక్కడి నుంచే తన అధికారిక కార్యకలాపాలను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. దీంంతో ముఖ్యమంత్రి కార్యాలయం సుందరీకరణ పనులు జోరుగా సాగుతున్నాయి.
దసరా పండగ వరకు సిఎం కార్యాలయం సిద్ధమవుతుందని ఏపి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు చెప్పారు. భద్రతా పరమైన చర్యలపై కూడా దృష్టి సారించినట్లు తెలిపారు. ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ విభాగాల సూచనల మేరకు తలుపులు, కిటికీలకు బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులు ఏర్పాటు చేస్తున్నారు.

ఇప్పటికే ఏపి ప్రభుత్వం ముఖ్యమంత్రి కార్యాలయం, భవనాల సుందరీకరణ, భద్రత ఏర్పాట్ల కోసం రూ. 10 కోట్లను కేటాయించిన విషయం తెలిసిందే.
ఎల్ బ్లాక్ కంటే.. ఆ భవనం చుట్టూ ఉన్న ఇతర భవనాలు ఎత్తులో ఉండటంతో ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ విభాగాలు భద్రతపై ప్రధాన దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు సూచించాయి. ఈ నేపథ్యంలోనే తలుపులు, కిటికీలకు బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. అత్యవసర సమయాల్లో ఎల్, కె బ్లాక్‌ల మధ్య ఉండే గేట్ తెరిచి ఉండేలా చూసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications