సెక్రటరియేట్‌లో జేబుదొంగల్లా, జగన్‌ది గుర్తిందిగా: హరీష్

జేబుదొంగలు, చైన్ స్నాచర్ల మాదిరిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పెళ్లిళ్లు, సినిమా హాళ్లు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో జనం ఎవరి హడావుడిలో వారుంటే జేబు దొంగలు, చైన్ స్నాచర్లు వాళ్ల పనిలో వారుంటారని అలాగే, ఇప్పుడు అందరి దృష్టి విభజనపై ఉంటే ప్రభుత్వంలోని సీమాంధ్ర నేతలు సందట్లో సడేమియాలుగా వందల కోట్ల రూపాయల విలువైన భూములను దొరికిన కాడికి దోచుకుంటున్నారన్నారు.
సీమాంధ్ర ప్రభుత్వ పెద్దల్లో కొందరు ఒకవైపు రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటామని చెబుతున్నారని, మరోవైపు బ్రిటీష్ వారు దేశం విడిచి వెళుతూ వెళుతూ బంగారం, విలువైన వస్తువులు పట్టుకెళ్లినట్టు హైదరాబాద్ చుట్టూ ఉన్న అత్యంత ఖరీదైన భూములను తమ అనుయాయులకు కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు, వైయస్ హయాంలలో ఒక రకంగా భూ దోపిడీ జరిగితే ప్రస్తుతం కిరణ్ కౌలుదార్ల పేరిట భూ దోపిడీకి పాల్పడుతున్నారని, దానికి రెవెన్యూ మంత్రి తోడయ్యారని ఆరోపించారు.
దోపిడీ వివరాలన్నీ తమ వద్ద ఉన్నాయని, వాటి వివరాలన్నీ బయటపెడతామని హెచ్చరించారు. అధికారులు తప్పుల్లో భాగస్వాములు కావొద్దని హెచ్చరించారు. వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ అక్రమ సంపాదనకు సహకరించిన అధికారులు అనేక అవమానాలకు గురయ్యారని, కేసులను ఎదుర్కొంటున్నారని, చాలా మంది జైలు పాలయ్యారని, దీనిని చూసి అధికారులు గుణపాఠం నేర్చుకోవాల్సిందిపోయి భూముల అన్యాక్రాంతానికి సహకరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ వచ్చాక ఈ భూ కేటాయింపులు, ఆక్రమణ కేసులన్నింటినీ తిరగదోడుతామన్నారు. సుప్రీంకోర్టు వరకు వెళ్లి ఇక్కడి ప్రజల ఆస్తిని కాపాడి తీరుతామని చెప్పారు.












Click it and Unblock the Notifications