వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపిలోకి కడప వైసిపి ప్రజాప్రతినిధులు: 'జగన్ బంధువుల ఫిర్యాదు వల్లే'

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రపై టిడిపి నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ విమర్శలు గుప్పించారు. జగన్ పాదయాత్ర నవ్వులాటగా మారిందన్నారు.

|
Google Oneindia TeluguNews

కడప: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రపై టిడిపి నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ విమర్శలు గుప్పించారు. జగన్ పాదయాత్ర నవ్వులాటగా మారిందన్నారు.

చదవండి: జగన్‌ను కలిశా, కానీ: రూ.50 కోట్లు ఇస్తేనే వైసిపి టిక్కెట్‌పై విష్ణు వర్ధన్ రెడ్డిచదవండి: జగన్‌ను కలిశా, కానీ: రూ.50 కోట్లు ఇస్తేనే వైసిపి టిక్కెట్‌పై విష్ణు వర్ధన్ రెడ్డి

ఆదివారం మైదుకూరు మండలం మాచుగారిపల్లెలో వైసిపికి చెందిన మిట్టమానుపల్లె ఎంపీటీసీ సభ్యురాలు కానాల వసుంధర, నాయకులు పోలిరెడ్డి, గోవిందురెడ్డి వారి అనుచరులతో టిడిపిలో చేరారు.

చదవండి: కర్నూలులో రెండూ ఖాళీ, జగన్ రంగంలోకి దిగినా: బుట్టా రేణుక దారిలో మరో ఇద్దరు

 ఓ రోజు భోజనం చేసి, నిరాహార దీక్ష చేసినట్లుగా

ఓ రోజు భోజనం చేసి, నిరాహార దీక్ష చేసినట్లుగా

వారం రోజులు నిరాహార దీక్ష చేసి మధ్యలో ఒకరోజు భోజనం చేసి మళ్లీ నిరాహార దీక్ష చేస్తే ఎలా ఉంటుందో ఆరు రోజుల పాటు పాదయాత్ర చేసి ఏడో రోజు కోర్టుకు హాజరైతే, కోర్టుకు హాజరై తిరిగి పాదయాత్ర చేస్తే అలాగే ఉంటుందని ఎద్దేవా చేశారు. పాదయాత్ర చేస్తూ కోర్టుకు హాజరవడాన్ని చూస్తుంటే నిరాహార దీక్ష సమయంలో ఓ రోజు భోజనం చేసినట్లుగానే ఉంటుందన్నారు.

 జగన్ బాధపడుతున్నారు

జగన్ బాధపడుతున్నారు

వర్షాలతో జలాశయాలు నిండుకుని రాష్ట్ర ప్రజలంతో సంతోషంగా ఉంటే జగన్‌ మాత్రమే బాధగా ఉన్నారని సీఎం రమేష్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూ ముందుకు వెళుతుంటే జగన్‌ అడ్డుకుంటున్నారన్నారు.

జగన్ బంధువుల ఫిర్యాదు వల్లే

జగన్ బంధువుల ఫిర్యాదు వల్లే

ఉపాధి హామీ పథకంలో రాష్ట్రంలో ఆరు వేల కిలోమీటర్లు సిమెంటు రోడ్లు వేయగా దుర్వినియోగం జరిగిందంటూ జగన్‌ బంధువులైన వైవీ సుబ్బారెడ్డి, అవినాష్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో కూలీలకు బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతోందని సీఎం రమేష్ చెప్పారు.

 ఆ ఆలోచన జగన్ చేయడం లేదు

ఆ ఆలోచన జగన్ చేయడం లేదు

ప్రజలకు ఏమి చేస్తే మేలు జరుగుతుందనే ఆలోచన జగన్‌ చేయడం లేదని సీఎం రమేష్ మండిపడ్డారు. 80 శాతం మంది ప్రజలు చంద్రబాబు సీఎం అయితేనే అభివృద్ధి జరుగుతుందనే అభిప్రాయంతో ఉన్నారన్నారు. టిటిడి ఛైర్మన్‌గా సుధాకర్ యాదవ్‌ పేరును సీఎం పరిగణలోకి తీసుకున్నారన్నారు.

English summary
Telugu Desam Party leader and rajya sabha MP CM Ramesh satires on YSR Congress Party chief YS Jaganmohan Reddy's padayatra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X