కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కర్నూలులో రెండూ ఖాళీ, జగన్ రంగంలోకి దిగినా: బుట్టా రేణుక దారిలో మరో ఇద్దరు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు ఎంపీ బుట్టా రేణుక టిడిపిలో చేరడం దాదాపు ఖరారయిందని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లోను ఆమె కర్నూలు ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారు.

|
Google Oneindia TeluguNews

Recommended Video

రేపే టీడీపీలోకి రేణుక? బెడిసికొట్టిన వ్యూహం! కర్నూలు ఎంపీ టికెట్ ఇస్తున్న చంద్రబాబు| Oneindia Telugu

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు ఎంపీ బుట్టా రేణుక టిడిపిలో చేరడం దాదాపు ఖరారయిందని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లోను ఆమె కర్నూలు ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారు.

ఇందుకు సీఎం చంద్రబాబు నుంచి హామీ వచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఆమె పార్టీ మారుతున్నారనే ప్రచారం సాగుతోంది. ఇప్పుడు అవే వార్తలను ఆమె నిజం చేయనున్నారు.

వారితో మాట్లాడి చెబుతా

వారితో మాట్లాడి చెబుతా

శుక్రవారం అమరావతిలో ఎంపీ బుట్టా రేణుక, ఆమె భర్త నీలకంఠం ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడారు. పార్టీ మారే విషయంపై మరో రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నట్లు ఆమె.. ముఖ్యమంత్రికి తెలిపారు. దీనిపై కార్యకర్తలు, అనుచరులతో మాట్లాడాలని అనుకున్నట్లు ఆమె చంద్రబాబుకు తెలిపారు.

మంచి భవిష్యత్తు ఉంది

మంచి భవిష్యత్తు ఉంది

ముఖ్యమంత్రిని కలిసినప్పుడు మంచి భవిష్యత్తు ఉందని, ప్రజలకు సేవ చేసేందుకు వచ్చే ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే సీటు ఏది కావాలన్నా ఇస్తానని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. ఈ రోజు (ఆదివారం) చంద్రబాబుతో ఆమె మరోసారి భేటీ కానున్నారు.

వారితో జగన్ మాట్లాడారు కానీ

వారితో జగన్ మాట్లాడారు కానీ

వైసిపికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ టిడిపిలో చేరనున్నట్లు వచ్చిన కథనాలపై వైసిపి అధినేత జగన్ స్పందించారు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లోని లోటస్‌ పాండ్‌లో కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, మంత్రాలయం, ఆదోని, ఆలూరు ఎమ్మెల్యేలు బాలనాగిరెడ్డి, సాయిప్రసాద్ రెడ్డి, గుమ్మనూరు జయరామ్‌లతో ప్రత్యేకంగా ఆయన మాట్లాడారు.

బుట్టా రేణుకతో పాటు మరో ఇద్దరు

బుట్టా రేణుకతో పాటు మరో ఇద్దరు

పార్టీ మారతారని వస్తోన్న వదంతులు, జిల్లా పరిస్థితులపై చర్చించారు. జగన్‌ ప్రత్యేకంగా మాట్లాడిన కొన్ని రోజులకే బుట్టా రేణుక పార్టీ మారుతుండటం గమనార్హం. జగన్‌తో మాట్లాడిన వారిలో ఇద్దరు ఎమ్మెల్యేలు సైతం టిడిపిలో చేరతారన్న ప్రచారం సాగుతోంది.

ఎస్పీవై రెడ్డి నుంచి బుట్టా రేణుక వరకు

ఎస్పీవై రెడ్డి నుంచి బుట్టా రేణుక వరకు


కర్నూలు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 2014 ఎన్నికల్లో టిడిపి బనగానపల్లె, పత్తికొండ, ఎమ్మిగనూరు మూడు సీట్లు గెలుచుకుంది. మిగిలిన 11 సీట్లలో వైసిపి గెలిచింది. గెలిచిన మూడు రోజులకే నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి టిడిపిలో చేరారు. ఆ తర్వాత నంద్యాల ఎమ్మెల్యే దివంగత భూమా నాగిరెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ, కర్నూలు ఎమ్మెలే ఎస్వీ మోహన్‌రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ టిడిపి తీర్థం పుచ్చుకున్నారు.

కర్నూలులో వైసిపికి లోకసభ సభ్యులు ఖాళీ!

కర్నూలులో వైసిపికి లోకసభ సభ్యులు ఖాళీ!

ప్రస్తుతం కర్నూలు ఎంపీ బుట్టా రేణుక టిడిపిలోకి వెళుతుండటంతో వైసిపికి ఇద్దరు పార్లమెంట్‌ సభ్యులు జిల్లాలో చేజారిపోయినట్లే. ప్రస్తుతం వైసిపిలో కొనసాగుతున్న డోన్‌, నందికొట్కూరు, పాణ్యం, ఆదోని, మంత్రాలయం, ఆలూరు ఎమ్మెల్యేలు ఉన్నారు.

English summary
Jolt for YSR Congress Party chief YS Jaganmohan Reddy as second MP Butta Renuka from Kurnool district will join Telugu Desam Party soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X