Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారత్ పై మిలిటరీ దాడులు చేస్తాం: పాకిస్థాన్ సంచలన వార్నింగ్

పాకిస్థాన్.. భారత్ పై మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్న తరుణంలో భారత్- పాకిస్థాన్ మధ్య మరోసారి తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ మేరకు పాకిస్థాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్.. భారత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ లోని పలు కీలక నగరాలపై మిలీటరీ దాడులు చేయాలని ఆదేశించారు. పశ్చిమాసియా నుంచి పాకిస్థాన్ పై దాడులకు పాల్పడితే ప్రతీకార చర్యగా తాము భారత్ పై దాడులు చేస్తామని హెచ్చరించారు. తాజాగా జరిగిన లైవ్ బ్రాడ్ కాస్ట్ లో ఈ వ్యాఖ్యలు చేశారు. అబ్దుల్ బాసిత్ 2014 నుంచి 2017 వరకు పాకిస్థాన్ హైకమిషనర్ గా బాధ్యతలు నిర్వర్తించారు.

ప్రస్తుతం పశ్చిమాసియాలో భీకర యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే యుద్ధంలో భాగంగా ఒకవేళ అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా పాకిస్థాన్ పై దాడులకు పాల్పడితే పాకిస్థాన్ చూస్తూ ఊరుకోదని.. వెంటనే భారత్ పై ప్రతీకార దాడులు చేస్తుందని అబ్దుల్ బాసిత్ స్పష్టం చేశారు. అమెరికా తమ రేంజ్ లో లేదు కాబట్టి డిఫాల్ట్ గా భారత్ లోని దిల్లీ, ముంబై లాంటి పెద్ద పెద్ద నగరాలపై అణుబాంబులు వేస్తామని ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. మరోవైపు పాకిస్థాన్ నుంచి తమకు న్యూ క్లియర్ థ్రెట్ ఉందని అమెరికా ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ ఇటీవల తెలిపిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఇక జమ్మూ కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గామ్ లోయలో గతేడాది ఏప్రిల్ 22 న ఉగ్రవాదులు జరిపిన మారణహోమంలో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడికి పాల్పడింది పాకిస్థాన్ అని తేలిన నేపథ్యంలో మే 7-10 మధ్య పాకిస్థాన్ లోని 9 కీలక స్థావరాలపై భారత్ దాడులకు పాల్పడింది. వాటిని ధ్వంసం చేసింది. వందలాది మంది టెర్రరిస్టులను హతమార్చింది.

AbdulBasit Explosive Claim Pakistan to Strike India in Case of US-Israel Attack Abdul Basit warning

భారత్ ధ్వంసం చేసిన పాకిస్థాన్ స్థావరాల్లో ముజఫరాబాద్ లోని సవాయ్ నాలా క్యాంప్, ముజఫరాబాద్ లోని సిడ్నా బిలాల్ క్యాంప్, కోట్లీలోని గుల్ పూర్ క్యాంప్, భీంబర్ లోని బర్నాలా క్యాంప్, కోట్లీలోని అబ్బాస్ క్యాంప్, సియాల్ కోట్ లోని సర్జాల్ క్యాంప్, సియాల్ కోట్ లోని మెహమూనా జోయా క్యాంప్, మురిడ్ కే లోని మార్కాజ్ టైబా క్యాంప్, బహావల్ పుర్ లోని మార్కజ్ సుభానల్లా క్యాంప్ ఉన్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+