జగన్ లాంటి అన్న ఉంటే వేరే శత్రువు అవసరం లేదు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, సోదరి షర్మిలకు మధ్య చోటు చేసుకున్న ఆస్తి వివాదాల నేపథ్యంలో ఇటీవల విజయమ్మ షర్మిలకు అన్యాయం చేయొద్దు అంటూ జగన్ కు లేఖ రాసిన క్రమంలో ఏపీ మంత్రులు జగన్ తీరుపైన విరుచుకుపడుతున్నారు. తల్లికి ,చెల్లికి న్యాయం చేయనివారు ప్రజలకు న్యాయం చేస్తారా అంటూ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జగన్ ను టార్గెట్ చేశారు.

జగన్ గొప్పతనం చెప్పటానికి ఇది చాలు: మంత్రి మండిపల్లి

మహిళల ఆస్తి హక్కులు కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. జగన్ లాంటి అన్న ఉంటే వేరే శత్రువు అవసరం లేదన్న మాట చాలు, జగన్ గొప్పతనాన్ని తెలపడానికి అంటూ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఎద్దేవా చేశారు. మహిళల ఆస్తి హక్కుల అంశాన్ని వ్యక్తిగత కుటుంబ సమస్యగా చూపించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.

Minister Rampasad Reddy Targets Jagan with Sharp Remarks slams with current properties dispute

తల్లి, చెల్లెలికి చట్టప్రకారం వాటా ఇవ్వడం ప్రతి వ్యక్తి బాధ్యత

మహిళల ఆస్తి హక్కుల అంశం సమాజ న్యాయం మరియు చట్టబద్ధ హక్కులకు సంబంధించిన ముఖ్యమైన విషయమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. తండ్రి ఆస్తులలో తల్లి, చెల్లెలికి చట్టప్రకారం వాటా ఇవ్వడం ప్రతి వ్యక్తి బాధ్యత అని మంత్రి పేర్కొన్నారు. ఇంట్లోనే కుటుంబ సభ్యులకు న్యాయం చేయలేని వారు ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పడం విశ్వసనీయతను కోల్పోయే అంశమని విమర్శించారు.

ఆస్తి హక్కుల రక్షణ కోసం అన్యాయం పైన పోరాడాలి

ఆస్తి హక్కుల రక్షణ కోసం మహిళలు ఎవరైనా సరే అన్యాయం పైన ప్రశ్నించాలని, ఐక్యంగా నిలబడి పోరాడాలని మంత్రి పిలుపునిచ్చారు. మహిళల గౌరవం, ఆస్తి హక్కులు, భద్రతా వంటివి రక్షించబడితేనే సమాజం స్థిరంగా అభివృద్ధి చెందుతుందన్నారు. సునీత న్యాయం కోసం చేస్తున్న పోరాటానికి మహిళా లోకం, ప్రజాస్వామ్య వాదులు అండగా నిలవాలని మంత్రి కోరారు.నేరానికి పాల్పడిన వారు ఎవరైనా సరే చట్టం ముందు నిలబడాల్సిందేనని మంత్రి స్పష్టం చేశారు.

హత్య రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడాలి

ప్రజలు ఇచ్చిన అధికారాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. అక్రమ ఆస్తులు, అవినీతి, హింసాత్మక రాజకీయాలు సమాజానికి హానికరమని మంత్రి స్పష్టం చేశారు. ప్రజల విశ్వాసానికి ద్రోహం చేసే రాజకీయాలకు ముగింపు పలకాల్సిన అవసరం ఉందన్నారు. హత్య రాజకీయాలకు వ్యతిరేకంగా శాంతియుత సమాజ నిర్మాణం కోసం అందరూ ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+