మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!?
బాలినేని జనసేనలో కొనసాగుతారా. తిరిగి వైసీపీ గూటికి చేరుతారా. ప్రస్తుతం బాలినేని నిర్ణయం పైన రాజకీయంగా చర్చ సాగుతోంది. జగన్ కు బంధువు అయిన బాలినేని వైసీపీని వీడి జనసేన లో చేరారు. అయితే, ఒంగోలు కేంద్రంగా చోటు చేసుకుంటున్న రాజకీయాల్లో బాలినేని ప్రేక్షక పాత్రకే పరిమితం అయ్యారు. తాజాగా తన కుమారుడుతో కలిసి పవన్ తో సమావేశం అయ్యారు. అటు బాలినేని తిరిగి వైసీపీలోకి వస్తారనే ప్రచారం వేళ.. బాలినేని చేసిన ట్వీట్ వైరల్ అయింది. అయితే, అంతలోనే ఆ ట్వీట్ డిలీట్ చేయటంతో కొత్త అంశాలు తెర మీదకు వస్తున్నాయి.
వైసీపీ నుంచి జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని వ్యవహారం పైన కొంత కాలంగా రాజకీ యంగా చర్చ జరుగుతోంది. జనసేనలో చేరినా గుర్తింపు లేకపోవటంతో తిరిగి వైసీపీ లోకి వస్తారనే ప్రచారం వేళ.. బాలినేని తాజా ట్వీట్ తో స్పష్టత వచ్చినట్లు కనిపించింది. అయితే, అంతలోనే ఆ ట్వీట్ డిలీట్ చేసారు. 2024 ఎన్నికల ఫలితాల తరువాత ఓటింగ్.. ఈవీఎంల పైన అభ్యంతరాలు వ్యక్తం చేసారు. ఆ తరువాత పవన్ సమక్షంలో జనసేనలో చేరారు. వైసీపీ పైన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అప్పటికే ఎంపీ సుబ్బారెడ్డితో ఉన్న విభేదాలతో బాలినేని ఆగ్రహంతో ఉన్నారు.

అయితే, జనసేనలో చేరిన తరువాత స్థానికంగా టీడీపీ ఎమ్మెల్యే తో గ్యాప్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఒంగోలులో బాలినేని స్థానంలో వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ ను జగన్ నియమించారు. తాజాగా జరిగిన పార్టీ ఒంగోలు సమీక్షలోనూ జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఒంగోలు అనగానే వాసన్న విషయంలో కొన్ని ప్రశ్నలు వస్తాయని వ్యాఖ్యానించారు. అదే సమయంలో వాసన్నా మళ్లీ వస్తాడా అంటూ జగన్ ప్రశ్నించారు. దీంతో.. బాలినేని వైసీపీలోకి రీ ఎంట్రీ ఖాయమేనా అనే ప్రచారం మొదలైంది.
బాలినేని రాజకీయ నిర్ణయం ఏంటి..?
కాగా, ఈ సమయంలోనే తన కుమారుడు తో కలిసి బాలినేని తాజాగా డిప్యూటీ సీఎం పవన్ తో సమావేశం అయ్యారు. సుదీర్ఘంగా చర్చించారు. ఒంగోలులో పరిస్థితులను వివరించారు. ఆ తరువాత బాలినేని చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. తాను వైసీపీలో రీ ఎంట్రీ ఇస్తున్నానే ప్రచారం వేళ.. ఎక్కడా వైసీపీ పేరు ప్రస్తావన చేయకుండానే తన మనసులో మాట ఏంటో స్పష్టం చేసారు.

ఈ మేరకు బాలినేని చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఆ ట్వీట్ లో పవన్ తో ఉన్న ఫొటోలను జత చేసిన బాలినేని..' ఆయన మాకు ఒక నాయకుడు మాత్రమే కాదు... నమ్మకం, ఆదరణ, ఆశ్రయం..' అని పేర్కొన్నారు. దీని ద్వారా తన కుమారుడితో కలిసి పవన్ ను కలవటం ద్వారా.. తనయుడికి రాజకీయంగా స్పష్టమైన హామీ పొందినట్లు ప్రచారం జరిగింది. అయితే, ఆ తరువాత ఆ ట్వీట్ డిలీట్ చేసారు. సన్నిహితులు.. మద్దతు దారులతో బాలినేని చర్చలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో.. ఈ పరిణామాల నేపథ్యంలో బాలినేని మనసు మారిందా.. రాజకీయంగా ఏం చేబోతున్నారనే చర్చ ఆసక్తి కరంగా మారుతోంది.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications