టైం చెప్పలేం: టి బిల్లుపై కిరణ్ సైన్: దామోదర ఆగ్రహం

ఇంగ్లీష్ ప్రతులను అనువాదం చేయాల్సి ఉందన్నారు. ప్రతులను తెలుగు, ఉర్దూ భాషల్లోకి అనువాదం చేయాల్సిన పరిస్థితుల్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇచ్చిన సమయం సరిపోతుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. బిల్లులోని ప్రతి క్లాజు పైన ఓటింగు అవసరమన్నారు.
తెలంగాణ బిల్లును సభ్యులకు ఇచ్చే అంశం సభాపతి చూసుకుంటారన్నారు. బిల్లుపై సీక్రెట్ అని ఉన్నందున సభ్యులకు రహస్యంగా ఇవ్వాలా లేక ఓపెన్‌గా ఇవ్వాలా అనే అంశాన్ని కూడా స్పీకరే చూసుకుంటారన్నారు. తాను దిగ్విజయ్‌తో వ్యతిరేకంగా మాట్లాడినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు.
కిరణ్ పైన దామోదర నిప్పులు
మరోవైపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి పైన తెలంగాణ ప్రాంత మంత్రులం విశ్వాసం కోల్పోయామని, వెంటనే సిఎల్పీని సమావేశపర్చాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బిల్లు రాష్ట్రానికి వచ్చిన నేపథ్యంలో కిరణ్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కిరణ్ నాయకత్వంపై తమకు నమ్మకం లేదని, తెలంగాణను అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.
విభజన సున్నిత అంశం: పల్లె
రాష్ట్ర విభజన అంశం చాలా సున్నితమైన అంశమని టిడిపి ఎమ్మెల్యే పల్లె రఘునాథ్ రెడ్డి శుక్రవారం అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే విభజన చేస్తున్నారన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం వచ్చాకనే విభజన జరగాలన్నారు. విభజన బిల్లుపై సభ అభిప్రాయం అడిగారంటే ఓటింగేనని యనమల రామకృష్ణుడు అన్నారు.












Click it and Unblock the Notifications