ఎక్కడికెళ్ల: గీతాతో కల్సిన కిరణ్, బాబు సీట్లో మోత్కుపల్లి
హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం గురువారం సభ్యులు గ్రూఫ్ ఫోటో దిగారు. ఈ సమయంలో పలు ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. లాబీల్లో చలోక్తులు విసురుకున్నారు. ఇటీవల ఢిల్లీ ఘటనపై తెలంగాణ ప్రాంత మహిళా మంత్రులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. అయితే, గురువారం గీతా రెడ్డి ముఖ్యమంత్రితో నవ్వులు పంచుకున్నారు.
ఈ సమయంలో కిరణ్‌కు ఆమె బెస్టాఫ్ లక్ చెప్పారు. దానికి స్పందించిన కిరణ్.. తాను ఎక్కడకు వెళ్లడం లేదని, మీరు కూడా ఎక్కడకు వెళ్లరన్నారు. తద్వారా రాష్ట్రం విడిపోదని ఆయన అభిప్రాయపడ్డారు. మహిళా ప్రజాప్రతినిధులతో కిరణ్ మరో గ్రూఫ్ ఫోటో దిగారు.

గ్రూఫ్ ఫోటోకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ హాజరు కాలేదు. దీంతో గ్రూప్ ఫోటోలో బాబు కూర్చోవలసిన స్థానంలో మోత్కుపల్లి కూర్చున్నారు. దాంతో అంతా ఆయన్ని తెలంగాణ ముఖ్యమంత్రి అంటూ అభినందనల్లో ముంచెత్తారు.
ఇతర ఎమ్మెల్యేలతో కలిసి తెరాస ఎమ్మెల్యే హరీశ్ రావు అసెంబ్లీ నుంచి బయటకు రాగానే లాబీల్లో ఉన్న టిడిపి ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమ నాయుడు తెలంగాణ రాదంటూ ఏదో చెప్పబోగా.. హరీశ్ ఆయన్ని గట్టిగా కౌగిలించుకుని మీరు తెలంగాణ రాష్ట్రానికి కాబోయే గవర్నర్ అంటూ పొగిడారు.

దాంతో ముద్దు ముసిముసిగా నవ్వుతుంటే హిస్ ఎక్సిలెన్సీ అంటూ తాము ఇప్పటి నుంచి గౌరవిస్తామని హరీశ్ అన్నారు. తెలంగాణకు గాలి గవర్నర్, ఆంధ్రకు మోత్కుపల్లి నర్సింహులు గవర్నర్ అని హరీశ్ తెలిపారు. గాలి, బొజ్జల చెరి రెండున్నర ఏళ్లపాటు తెలంగాణ గవర్నర్లుగా ఉంటారని హరీశ్ చెప్పుకొచ్చారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications