చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎం జగన్ మంచి మనసు: ఆ తల్లికి రూ. లక్ష చెక్కు, నెలకు రూ. 3వేలు

|
Google Oneindia TeluguNews

కడప: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. బుధవారం మదనపల్లె టిప్పు సుల్తాన్ గ్రౌండ్స్ నుంచి 4వ దశ జగనన్న విద్యా దీవెన లబ్దిని ప్రారంభించారు సీఎం జగన్. ఈ సందర్భంగా వేదిక వద్ద హమీద తన కుమారుడు మొహమ్మద్ అలీకి దీర్ఘకాలిక వ్యాధి ఉన్న విషయం దృష్టికి రావడంతో ముఖ్యమంత్రి తన దయార్ద హృదయాన్ని చూపారు.

తన బిడ్డతో జగన్ వద్దకు మహిళ

తన బిడ్డతో జగన్ వద్దకు మహిళ

హమీద అనే మహిళ తన బిడ్డ మహ్మద్ అలీ అనే చిన్నారిని ఎత్తుకుని బుధవారం టిప్పు సుల్తాన్ గ్రౌండ్స్‌లో జరిగిన బహిరంగ సభకు వచ్చారు. తన బిడ్డ తలకు సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నాడని కన్నీరుపెట్టుకుంది. చికిత్స చేయించడానికి ఆర్ధిక స్థోమత సరిపోక ఇబ్బందులు పడుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్ళారు.

మహిళను ఆదుకోవాలని జగన్ ఆదేశం

మహిళను ఆదుకోవాలని జగన్ ఆదేశం

వివరాలు ఆరా తీసిన తర్వాత విషయం అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి జగన్.. వెంటనే ఆమెకు ఆర్ధిక పరంగా సహాయం అందజేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గిరీష
పీఎస్ వెంటనే స్పందించారు.

ఆ మహిళకు రూ. లక్ష సాయం, నెలకు రూ. 3వేలు

ఈ కార్యక్రమం అనంతరం మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం లో రూ. లక్ష చెక్కును ఆమెకు అందించారు. అలాగే నెలవారీగా 3000 రూపాయల పింఛను అందజేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. అలాగే స్విమ్స్‌లో మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని కూడా ఆరోగ్య శాఖ అధికారులను కలెక్టర్‌ సూచించారు. దీంతో సీఎం జగన్, జిల్లా కలెక్టర్‌కు హమీద ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

English summary
CM YS Jagan financial help to a mother for her son's health treatment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X