స్టాలిన్‌కు వైఎస్ జగన్ బర్త్‌డే విషెస్: ఢిల్లీ నుంచి కేసీఆర్ ఫోన్

అమరావతి: ఇవ్వాళ డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలను తెలియజేస్తోన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ.. తదితరులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పంజాబ్, బిహార్ ముఖ్యమంత్రులు చరణ్‌జీత్ సింగ్ ఛన్నీ, నితీష్ కుమార్‌ల పుట్టిన రోజు కూడా ఇవ్వాళే.

కాగా స్టాలిన్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో చిరకాలం జీవించాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ట్వీట్ చేశారు. వైఎస్ జగన్-స్టాలిన్ మధ్య స్నేహ సంబంధాలు ఉన్నాయి. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి స్టాలిన్ హాజరైన విషయం తెలిసిందే. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటి నుంచీ స్టాలిన్-జగన్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

CM YS Jagan greets Tamil Nadu CM MK Stalin on his birth day.

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కూడా స్టాలిన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఢిల్లీ నుంచి ఆయన స్టాలిన్‌కు ఫోన్ చేశారు. ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. భవిష్యత్ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాల్సి ఉంటుందని, దీనికి సంసిద్ధంగా ఉండాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. భవిష్యత్‌లో అన్నీ విజయాలే సాధించాలని కోరారు.

జాతీయ స్థాయిలో ఎన్డీఏ, యూపీఏలకు ప్రత్యామ్నాయంగా థర్డ్‌ఫ్రంట్‌ను తెరమీదికి తీసుకుని రావడానికి కేసీఆర్ తన వంతు ప్రయత్నాలను సాగిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన ప్రస్తుతం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. హస్తినలో పర్యటిస్తోన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌తో బుధవారం భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అలాగే- పలువురు జాతీయ స్థాయి ప్రతిపక్ష నేతలనూ కేసీఆర కలుసుకోనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+